
సాక్షి, హైదరాబాద్: యూఏఈలో ప్రకటించిన క్షమాభిక్ష అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎన్నారై, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు గల్ఫ్ ప్రవాసీయులకు ఆదివారం పిలుపునిచ్చారు. ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకు క్షమాభిక్ష ప్రసాదించనున్నారని మంత్రి తెలిపారు. గల్ఫ్‌లో అక్రమంగా నివాసముంటున్న వారు అక్కడి నిబంధనలకు అనుగుణంగా క్రమబద్ధీకరించుకోవడం, ఎలాంటి పత్రాలు లేకుండా యూఏఈలో ఉంటున్న వారు స్వదేశానికి తిరిగిరావడానికి ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. మళ్లీ కావాంటే వీరు రెండేళ్ల నిషేధం తర్వాత చట్టబద్ధంగా యూఏఈకి వెళ్లే అవకాశం ఉంటుందన్నారు.
క్షమాభిక్ష సంద ర్భంగా యూఏఈలోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నారై శాఖ అధికారులను కేటీఆర్ ఆదే శించారు. ఎన్నారై శాఖ రాయబార కార్యాలయం నుంచి తెలంగాణ ప్రవాసీయుల సమాచారాన్ని సేకరిస్తుందని ఆయన తెలిపారు. క్షమాభిక్ష కాలంలో ఎవరికైనా ప్రభుత్వం నుంచి సహాయం అవసరమైతే 9440854433 హెల్ప్‌లైన్ నం బర్‌కు ఫోన్ చేయాలన్నారు. ఈ మెయిల్ ద్వారా సాయం కావాలంటే so_nri@ telangana. gov.inకి లేదా యూఏఈ కాన్సులేటులోని హెల్ప్‌డెస్క్ నంబర్ +71565463903 లేదా indiandubai.amnesty@gmail.com ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.