అభివృద్ధి చెందిన అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడేందుకు ప్రపంచ దేశాల్లోని ప్రజలు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అమెరికా కలను సాకారం చేసుకునేందుకు పలు రకాల వీసాల కోసం అప్లే చేస్తారు. అయితే చాలా మందికి వీసాలు దొరక్క.. అక్రమ మార్గాల్లో సరిహద్దులు దాటి అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. దీంతో అమెరికాలో అక్రమ వలసదారుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల నుంచి అమెరికాలోకి అక్రమంగా వలసలు పెరగడం అక్కడ తీవ్ర ఆందోళన కలిగించే అంశం.
అమెరికన్ జనాభాలో 14.3 శాతం మంది వలసదారులే. ప్రస్తుతం అమెరికాలో 1 కోటి 10 లక్షల మంది అక్రమ వలసదారులు ఉంటున్నారని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్, ప్యూ రీసర్చ్ లెక్కలు చెబుతున్నాయి. అత్యధికంగా మెక్సికో నుంచి వస్తున్నారు. తర్వాతి స్థానంలో భారత్ ఉంది. 2040 నాటికి అమెరికాలో జననాల సంఖ్యను మరణాల సంఖ్య దాటిపోతుందని అంచనా.
కరేబియన్, దక్షిణ అమెరికా, ఆసియా, యూరప్, సబ్ సహారా, ఆఫ్రికా నుంచి అనధికార వలసలు పెరిగాయని పరిశోధకులు తెలిపారు. అమెరికా అక్రమ వలసదారుల్లో వెనుజులా, బ్రిజిల్, కెనడా, మాజీ సోవియట్ దేశాలు, చైనా, డొమినికన్ రిపబ్లిక్ దేశాలకు చెందిన వారు ఉన్నారు.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ డిపోర్టేషన్ పై కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 2025 జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సరిహద్దులను బలంగా, శక్తిమంతంగా మార్చడంపై దృష్టి సారిస్తానని ట్రంప్ సృష్టం చేశారు.
అయితే వలసదారులు లేకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తింటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా వలసదారుల జనాభా అమెరికాలోనే ఉంది.
మరి వలసదారులు అమెరికాలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు? ఇమ్మిగ్రెంట్స్ లేకపోతే అమెరికా పరిస్థితి ఏంటి? వలసదారుల్ని భారీ సంఖ్యలో వెనక్కి పంపించడం సాద్యమేనా.. ? అక్రమ వలసదారుల్ని సామూహికంగా అమెరికా నుంచి తిప్పి పంపించటం ట్రంప్‌కు అంత ఈజీయేనా? వంటి విషయాలను తరువాత కథనంలో తెలుసుకుందాం..!
- సింహబలుడు హనుమంతు
Comments
Please login to add a commentAdd a comment