తిజువానా(మెక్సికో): సెంట్రల్ అమెరికా నుంచి బయల్దేరిన వలసదారుల తొలి బృందం అమెరికా సరిహద్దు చేరుకుంది. కాలిఫోర్నియాతో సరిహద్దు పంచుకుంటున్న మెక్సికోలోని తిజువానాలో కంచె దాటిన 9 మందిని అమెరికా నిఘా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వీరిలో తల్లి, నలుగురు పిల్లలు, 19 ఏళ్ల గర్భిణి ఉన్నారు. భద్రతా సిబ్బంది చూస్తుండగానే కంచె దాటి అమెరికా వైపు వెళ్లిన మరికొందరు ఆ వెంటనే వెనక్కి వచ్చారు. సుమారు 4 వేల మందితో కూడిన ప్రధాన బృందం కూడా త్వరలోనే ఇక్కడకి చేరుకునే అవకాశం ఉంది. స్వదేశంలో హింస, పేదరికానికి తాళలేక హొండూరస్, గ్వాటెమాల, ఎల్‌సాల్వడార్ దేశాల ప్రజలు అమెరికాలో ఆశ్రయం పొందడానికి సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment