
టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ (టీపీఎస్)ను పొడిగించిన బైడెన్
టీపీఎస్ రక్షణలను రద్దు చేయాలన్న యోచనలో ట్రంప్
వాషింగ్టన్: పదవి నుంచి దిగపోవడానికి ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) సంచలన నిర్ణయం తీసుకున్నారు. వలసదారులకు(immigrants) టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వెనిజులా, ఎల్ సాల్వడార్, ఉక్రెయిన్, సూడాన్ దేశాలకు చెందిన వారికి వర్క్‌పర్మిట్లను 18 నెలలపాటు పొడిగించారు. ఈ మేరకు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆప్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా దేశాలకు చెందిన దాదాపు పది లక్షల మందికి ఉపశమనం లభించనుంది.
ఈ రక్షణ ఇప్పటికే అమెరికాలో ఉన్న ప్రజలకు మాత్రమే పరిమితం. ప్రస్తుత రక్షణ గడువు ముగిసినప్పటి నుంచి మరో 18 నెలల పాటు బహిష్కరణ నుంచి ఉపశమనం లభిస్తుంది. బైడెన్ 2021లో అధికారం చేపట్టినప్పటి నుంచి టీపీఎస్‌కు అర్హులైన వ లసదారుల సంఖ్యను బాగా పెంచారు. స్వదే శంలో ప్రకృతి వైపరీత్యాలు, సాయుధ పోరాటం లేదా ఇతర అసాధారణ సంఘటనలతో ప్రభావితమైన ప్రజల కు వర్తింపజేసే ఈ హో దా ఇప్పుడు అమెరికా లో ఉన్న 17 దేశాలకు చెందిన 1 మిలియన్ కంటే ఎక్కువ మందికి వర్తిస్తుంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్.. జనవరి 20న బాధ్యతలు చేపట్టున్నారు.
వెంటనే వలసదారులను ఆయా దేశాలకు తిప్పి పంపిస్తానని పలు మార్లు ప్రకటించారు. తన మొదటి పదవీ కాలంలోనూ టీపీఎస్ నమోదును ముగించడానికి ప్రయత్నించారు. కానీ యూఎస్‌కోర్టులు ఆ యన చర్యలను అడ్డుకున్నాయి. ఆయన మరోసారి శ్వేతసౌధానికి వస్తే టీపీఎస్ రక్షణలను రద్దు చేస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ అధికారంలోకి వచ్చాక దేశంలో పనిచేసే అవకాశాన్ని కోల్పోతామని వలసదారులు భయపడుతున్నారు.
వారిని రక్షించడానికి మరింత కృషి చేయా లని వలస న్యాయవాదులు, డెమొక్రటిక్ చట్టసభ సభ్యులు బైడెన్‌ను కోరారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఫలితంగా అధ్యక్షుడు శుక్రవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పొడిగింపులు లక్షలాది మందికి మద్దతు ఇవ్వడంతోపాటు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయని అడ్వకెసీ గ్రూప్ అధ్యక్షుడు టాడ్ షూల్టే అన్నారు.
ఇదీ చదవండి: కార్చిచ్చుతో ఇదేం రాజకీయం?!
టీపీఎస్‌ను నికరాగ్వా, ఇతర దేశాలకు విస్తరించాలని బైడెన్‌ను కోరారు. టీపీఎస్ ద్వారా ప్రయోజనం పొందినవారిలో వెనిజులాకు చెందినవారే సుమారు 600,000 మంది ఉన్నారు. 1,900 మంది సుడానీలు, 104,000 మంది ఉక్రేనియన్లకు ఉపశమనం లభించింది. ఈ కార్యక్రమంలో అతిపెద్ద జనాభా వెనిజులాదే. 2021లో వెనిజులా వాసులకు బైడెన్ ప్రభు త్వం మొదట టీపీఎస్ హోదాను ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment