30 లక్షల మంది వలసదారులను పంపిస్తాం | 30 million immigrants will be sent | Sakshi
Sakshi News home page

30 లక్షల మంది వలసదారులను పంపిస్తాం

Published Mon, Nov 14 2016 1:16 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

30 million immigrants will be sent

ట్రంప్ వెల్లడి

 వాషింగ్టన్: అమెరికాలో తిష్ట వేసిన వలసదారుల పట్ల కఠినమైన  వైఖరి అవలంబిస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పిన అధ్యక్ష ఎన్నికల విజేత డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. సరైన పత్రాలు లేని నేరస్తులు, మత్తు పదార్థాల సరఫరాదారులు, ముఠా సభ్యులు వంటి దాదాపు 30 లక్షల మంది వలసదారులను తక్షణమే ఖైదు చేయడమో, లేదా దేశం నుంచి పంపించి వేయడమో చేస్తానని ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు.

దేశంలో అక్రమంగా నివసిస్తున్నారనే కారణంతోనే వారిని వెల్లగొడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. అయితే రిపబ్లికన్ పార్టీ అగ్రనాయకుల్లో ఒకరు, సభ స్పీకర్ అరుున పాల్ ర్యాన్ మాత్రం ఇప్పుడే అలాంటిదేమీ లేదని, సరిహద్దు భద్రతపై తాము దృష్టి పెట్టామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement