కోల్ కతా: భారత్ లోకి అక్రమంగా చొరబడిన పది మంది బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తులను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి పత్రాలు లేకుండా కొంతమంది బంగ్లా మీదుగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోకి చొరబడ్డారు. పోలీసుల తనిఖీల్లో భాగంగా బస్సులో ప్రయాణిస్తున్న బంగ్లాదేశీయులను దక్షిణ దినాజ్ పూర్ జిల్లాలోని బాలుర్ ఘట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. 'అరెస్టు చేసిన బంగ్లాదేశీయుల వద్ద సరైన ధృవపత్రాలు ఏమీ లేవని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందని' పోలీసులు తెలిపారు.
గత కొన్ని నెలల నుంచి బంగ్లాదేశ్ నుంచి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన 100పైగా వలసలను అరెస్టు చేసిన విషయాన్ని ఆ రాష్ట్ర పోలీస్ అధికారి స్వపాన్ బెనార్జీ గుర్తు చేశారు.