లండన్:తమ దేశంలో ఉంటున్న అక్రమ వలసదారుల విషయంలో అమెరికా బాటలోనే బ్రిటన్ పయనించనుంది. సోమవారం(ఫిబ్రవరి10) అక్రమ వలసదారుల విషయమై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కీలక ట్వీట్ చేశారు.
‘అక్రమ వలసలకు ఇక ముగింపు పలుకుతాం. బ్రిటన్‌కు అక్రమ వలసలు పెరిగాయి. చాలా మంది అక్రమంగా బ్రిటన్‌కు వచ్చి పనిచేస్తున్నారు’అని ట్వీట్‌లో స్టార్మర్ పేర్కొన్నారు.
Too many people are able to come to the UK and work illegally.
We are putting an end to it.— Keir Starmer (@Keir_Starmer) February 10, 2025
కాగా,ట్రంప్ ఇటీవల రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాలోని అక్రమ వలసదారులపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే.సరైన పత్రాలు లేకుండా అమెరికాలో చాలా కాలం నుంచి ఉంటున్న వారిని గుర్తించి వారిని సొంత దేశాలకు మిలిటరీ విమానాల్లో పంపేస్తున్నారు.
ఈ వ్యవహారంపై ఏ దేశమైన ధిక్కార స్వరం వినిపిస్తే పన్ను బాదుడు ఉంటుందని ట్రంప్ హెచ్చరిస్తున్నారు.దీంతో అన్ని దేశాలు తమ దేశవాసులను తీసుకువస్తున్న అమెరికా విమానాలకు అనుమతి ఇస్తుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment