Shoot at site
-
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు తీవ్రతరం... కనిపిస్తే కాల్చివేత!
ఢాకా/సాక్షి, న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. రిజర్వేషన్లపై వారం క్రితం మొదలైన దేశవ్యాప్త హింసాకాండ నానాటికీ పెరిగిపోతోంది. భద్రతా సిబ్బందికి, విద్యార్థులకు మధ్య జరుగుతున్న ఘర్షణల్లో మృతి చెందిన వారి సంఖ్య శనివారంతో 115 దాటింది! రాజధాని ఢాకాతో పాటు ప్రధాన నగరాలు, పట్టణాల్లో కర్ఫ్యూ విధించినా, సైనికులు, పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. అయినా లాభం లేకపోగా పరిస్థితి విషమించడమే గాక పూర్తిగా అదుపు తప్పుతోంది. దాంతో తాజాగా కనిపిస్తే దేశవ్యాప్తంగా కాలి్చవేత (షూట్ ఎట్ సైట్) ఉత్తర్వులు జారీ అయ్యాయి! 978 మంది భారతీయులు వెనక్కు బంగ్లాదేశ్ నుంచి 978 మంది భారతీయ విద్యార్థులను కేంద్రం సురక్షితంగా వెనక్కు తీసుకొచి్చంది. 778 మంది నౌకల్లో, 200 మంది విమానాల్లో వచ్చారు. బంగ్లాదేశ్‌లో పనలు వర్సిటీల్లో ఇంకా 4 వేలకు పైగా భారతీయ విద్యార్థులున్నారు. వారందరినీ సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఢాకాలోని భారత హైకమిషన్ కృషి చేస్తోంది.ఇదీ సమస్య... 1971 బంగ్లాదేశ్ వార్ వెటరన్ల కుటుంబీకులకు ప్రభుత్వోద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. 2018లో షేక్ హసీనా వీటిని రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని ఢాకా హైకోర్టు తాజాగా తప్పుబట్టింది. ఆ రిజర్వేషన్లను పునరుద్ధరించాలంటూ జూన్ 5న ఆదేశాలిచి్చంది. దీనిపై విద్యార్థులు, ఉద్యోగార్థులు భగ్గుమన్నారు. దేశవ్యాప్తంగా వీటిని వ్యతిరేకిస్తూ భారీగా నిరసనలు, ఆందోళనలకు దిగారు. కోటా పునరుద్ధరణ వద్దే వద్దంటూ రోడ్డెక్కారు. దాంతో కోర్టు ఉత్తర్వులను హసీనా ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా పక్కన పెట్టింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆదివారం తుది విచారణకు అంగీకరించింది. -
రైళ్లలో చోరీకి యత్నిస్తే కాల్చివేతే
నగరంపాలెం : వేసవి కాలం రైళ్లలో దొంగతనాలను అరికట్టేందుకు డివిజనులోని రైల్వే పోలీసులు రైల్వేప్రొటెక్షన్‌ఫోర్సు సహకారంతో త్రిముఖవ్యూహం అవలంభిస్తున్నారు. దొంగతనాలకు యత్నించేవారిపై కాల్పులు జరిపేందుకు సైతం ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రైలులో ప్రయాణికులను దోచుకొని అలారం చైన్ లాగి దొంగలు పారిపోయిన ఘటనల నేపథ్యంలో రైళ్లలో భద్రతను పటిష్టపరిచారు. అర్ధరాత్రి సమయంలో ప్రయాణించే అన్ని రైళ్లకు పోలీస్ ఎస్కార్టు పెంచారు. ముఖ్యంగా రాత్రి ఒంటి గంట నుంచి 3 గంటల మధ్య రైళ్లలో పూర్తిస్థాయి నిఘా ఉంచుతున్నారు. రైలు బయలుదేరే స్టేషను నుంచే అన్ని బోగీల్లోని ప్రయాణికులను నిశితంగా పరిశీలిస్తున్నారు. డివిజనుకు సంబంధించి రాత్రి సమయంలో ప్రయాణించే 15 రైళ్లకు 8 మంది నుంచి 10 మంది వరకు భద్రతా సిబ్బందిని కేటాయించి నిరంతర పహరా ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి సమయంలో రైల్వే పోలీస్ సిబ్బంది ప్లాట్‌ఫారాలపై తనిఖీలు నిర్వహించి అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. రైల్వే ట్రాకు సమీపంలో రహదారులు ఉన్న ప్రాంతంలో మొబైల్ పార్టీలు రైళ్లలో ప్రయాణిస్తూ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నాయి. రైల్వే శాఖతో సమన్వయ పరచుకొని సాంకేతిక కారణాలతో రైలు నెమ్మదిగా వెళ్లే ప్రాంతాల్లో ముందస్తు పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఉన్నతస్థాయి అధికారులు సైతం అర్ధరాత్రి వేళల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. ప్రయాణికులకు అవగాహన... రైళ్లలో దొంగతనాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించి చైతన్యం తెచ్చేందుకు రైల్వే పోలీసులు కృషి చేస్తున్నారు. రైలు ప్లాట్ ఫారమ్‌పై ఆగిన వెంటనే మొబైల్ స్పీకర్ ద్వారా అన్ని బోగీల్లో భద్రత నియమాలను తెలుపుతున్నారు. దొంగతనాలు జరుగుతున్న తీరుపై పోస్టర్లను రైళ్లలో, ప్లాట్‌ఫారమ్‌లపై ప్రదర్శిస్తున్నారు. కాల్పుల ఆదేశాలు జారీ.. రైళ్లలో అలారం చైన్ లాగి ప్రయాణిలను దోపిడీ చేయటానికి ప్రయత్నిస్తే కాల్పులు జరపటానికి భద్రత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. ఫైరింగ్‌లో నిష్ణాతులైన వారిని రైళ్లలో భద్రతా సిబ్బందిగా నియమించటంతో పాటు ప్రతి ఒక్కరికి ఆయుధాలు సమకూర్చాం. అర్ధరాత్రి డివిజను మీదుగా నడిచే అన్ని రైళ్లకు భద్రతా సిబ్బందితో పాటు ఎనిమిది మొబైల్ పార్టీలు రహదారి మార్గం నుంచి భద్రత కల్పిస్తున్నాయి. రైలు బోగీలలో అనుమానిత వ్యక్తుల కదలికలపై సమాచారాన్ని రైల్వే పోలీసుల టోల్‌ఫ్రీ నంబరు 15121కు ఫోన్ చేసి తెలపవచ్చు. ఐడీ పార్టీల ద్వారా కూడ పాత నేరస్తుల కదలికలపై, సమస్యాత్మక ప్రాంతాలపై పూర్తి స్థాయి నిఘా కొనసాగిస్తున్నాం. రైళ్లలో, ప్లాట్‌ఫారమ్‌లపై, రోడ్డు మార్గంలో ఏర్పాటు చేసిన బందోబస్తును ఉన్నతస్థాయి అధికారులు ఆకస్మిక తనిఖీల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. - అజయ్ ప్రసాద్, రైల్వే డీఎస్పీ, గుంటూరు -
ఖాన్‌తో గేమ్స్ వద్దు!
* గురి తప్పని హైదరాబాదీ హంటర్ * ఒక్క షాట్‌తో గజరాజును నేలకూల్చిన షఫత్ అలీఖాన్ సాక్షి, హైదరాబాద్: జనావాసాలపై పడి బీభత్సం సృష్టించే అడవి జంతువులను వేటాడే హైదరాబాదీ హంటర్ నవాబ్ షఫత్ అలీఖాన్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. జార్ఖండ్ నుంచి బిహార్‌లోకి ప్రవేశించి, గయ ఫారెస్ట్ డివిజన్లో భయోత్పాతం సృష్టించిన ఏనుగును ఖాన్ ఒకే ఒక్క తూటాతో నేలకూల్చారు. శనివారం తెల్లవారుజాము నుంచి ఏనుగు చర్యలు హింసాత్మకంగా మారడంతో... అక్కడి సర్కారు ‘షూట్ ఎట్ సైట్’ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో తన .458 వించిస్టర్ మాగ్నమ్ రైఫిల్‌కు పని చెప్పిన హైదరాబాదీ... శనివారం మధ్యాహ్నానికి దాన్ని హతమార్చారు. ఈ ‘ఆపరేషన్’ వివరాలను ఆయన ఫోన్లో ‘సాక్షి’కి తెలిపారు. నేపాల్‌లో తగిలిన తూటాతో... ఈ మగ ఏనుగు వయసు 35 ఏళ్లుగా ఖాన్ నిర్థారించారు. భారత్-నేపాల్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతానికి చెందినదిగా భావిస్తున్నారు. అక్కడి వేటగాళ్ల బారినపడిన దీనికి కళ్ల మధ్య తూటా దిగింది. ఈ గాయం వల్ల ఇన్ఫెక్షన్ అయి తీవ్రంగా ఇబ్బంది పడిన ఏనుగు ఆహారాన్ని వెతుక్కొంటూ మైదానాలు, అడవులు, గ్రామాల్లో తిరుగుతోంది. చివరకు ఛునాపూర్ ప్రాంతానికి చేరుకుని... పంటలు, ఇళ్లపై విరుచుకుపడింది. అనేక మందిని గాయపరిచి, ఓ బాలుడిని తొక్కి చంపింది. దీన్ని ట్రాంక్వలైజ్ చేయడానికి వెళ్లిన ఖాన్ తన ఆపరేషన్‌ను శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఏనుగు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లోకి చొరబడటంతో ఫలితం దక్కలేదు. అక్కడి నుంచి కథియవర్ జిల్లాలోని యెహానీగావ్లోకి ప్రవేశించింది. రెండిళ్లు ధ్వంసం చేయడంతో పాటు 27 మందిని గాయపరిచింది. కరే పండిట్ అనే 35 ఏళ్ల రైతుతో పాటు ముగ్గురిని తొక్కి చంపింది. పరిస్థితులు చేయి దాటిపోతున్నాయని గుర్తించిన బిహార్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ టీకే గుప్తా, గయ డీఎఫ్ఓ ఎస్ఎస్ సింగ్‌లు ఏనుగుపై ‘షూట్ ఎట్ సైట్’ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఏనుగు కోసం ఖాన్ యెహానీగావ్లో గాలింపు చేపట్టారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో దట్టమైన మొక్కజొన్న తోటలో గజరాజు దాక్కున్నట్లు గుర్తించారు. ఏనుగు ఆయనపై దాడికి యత్నించింది. అప్రమత్తమైన ఖాన్ తన వద్దనున్న అరుదైన వించిస్టర్ మాగ్నమ్ రైఫిల్‌తో 12 మీటర్ల దూరంలో ఉన్న ఏనుగును కాల్చారు. తూటా నేరుగా తలలోకి దూసుకుపోవడంతో ఒక్క షాట్లో నేలకొరిగింది. బిహార్ ప్రభుత్వం, ప్రజలు ఖాన్‌ను అభినందించారు. ‘వేట’ల సంఖ్య 23 ఈ ఏనుగుతో కలిపి ఇప్పటి వరకు షఫత్ అలీఖాన్ చేసిన ‘వేట’ల సంఖ్య 23కు చేరింది. 1976 నుంచి ‘వేటాడుతున్న’ ఈయన గతంలో ప్రజల ప్రాణాలు తీస్తున్న ఏడు ఏనుగులు, మూడు పులులు, 12 చిరుతల్ని హతమార్చారు. బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాల కోరిక మేరకు ఆయా రాష్ట్రాల్లో రైతులు, ప్రజలను ఇబ్బంది పెడుతున్న వెయ్యి అడవి దున్నలు, 15,200 అడవి పందులు, 1300 అడవి కుక్కల్ని చంపారు.