ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉచ్చు బిగుస్తోంది. షేక్ హసీనాను తమ దేశం రప్పించేందుకు తాత్కాలిక ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు.. ఆమె వందల సంఖ్యలో కేసులు నమోదు కావడం విశేషం. తాజాగా షేక్ హసీనాపై నమోదైన కేసుల సంఖ్య 155కి చేరింది.
కాగా, బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనల కారణంగా షేక్ హసీనా భారత్‌లో తలదాచుకుంటున్నారు. ఇప్పట్లో ఆమె బంగ్లాదేశ్‌కు వెళ్లే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఆమెను తిరిగి బంగ్లాకు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటు తాత్కాలిక ప్రభుత్వం సైతం ఇదే పనిలో బిజీగా ఉంది. అయితే, హింసాత్మక ఘటనల్లో 22 ఏళ్ల విద్యార్థి హత్యకు సంబంధించి హసీనాతోపాటు మరో 58 మందిపై హత్య కేసు నమోదైనట్లు స్థానిక మీడియా పేర్కొంది.
ఇక, హసీనాపై ఇప్పటివరకు 155 కేసులు నమోదయ్యాయి. ఇందులో హత్య కేసులే 136 ఉన్నాయి. మారణహోమం, ఇతర నేరాలకు సంబంధించి ఏడు, మూడు అపహరణ, ఎనిమిది హత్యాయత్నంతోపాటు బీఎన్‌పీ పార్టీ ఊరేగింపుపై దాడికి సంబంధించిన కేసులున్నాయి. దీంతో, నేరాలు, కేసుల విషయంలో ఆమె బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు.. ఈ క్రమంలో భారత్‌లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పిస్తామని, ఆమెపై అరెస్టు వారెంట్లు జారీ చేస్తామని ఐసీటీ నూతన ప్రాసిక్యూటర్ కామెంట్స్ కూడా చేశాడు.
ఇది కూడా చదవండి: పాక్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్‌పై మరో కేసు
Comments
Please login to add a commentAdd a comment