Bangladesh Elections: ప్రారంభమైన పోలింగ్‌ | Bangladesh General Elections Polling Begins 8 Am | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌లో పోలింగ్‌ ప్రారంభం.. ఎన్నికలను బహిష్కరించిన ప్రతిపక్షం

Published Sun, Jan 7 2024 8:38 AM | Last Updated on Sun, Jan 7 2024 10:27 AM

Bangladesh General Elections Polling Begins 8 Am - Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఆదివారం(జనవరి 7) ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఈ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఎన్‌పీ బహిష్కరించింది. అధికార అవామీ లీగ్‌ పార్టీ  ఎన్నికల్లో ఉద్దేశపూర్వకంగా డమ్మీ ఇండిపెండెంట్‌ క్యాండిడేట్‌లను బరిలో నిలిపిందని బీఎన్‌పీ ఆరోపిస్తోంది.

పోలింగ్‌ ప్రారంభం కాగానే ఢాకాలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ప్రధాని షేక్‌ హసీనా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె భారత మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ భారత్‌ తమకు నమ్మకమైన మిత్ర దేశమని చెప్పారు. 1971 లిబరేషన్‌ సందర్భంగా, 1975లో బంగ్లాదేశ్‌కు భారత్‌ సహకారం మరవలేనిదన్నారు. దేశంలో మొత్తం 11 కోట్ల 90 లక్షల మంది ఓటర్లున్నారు.

మొత్తం 300 యోజకవర్గాలకుగాను 299 నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్‌ జరుగుతోంది. కొన్ని కారణాల వల్ల ఒక్క నియోజకవర్గానికి తర్వాత ఎన్నిక నిర్వహించనున్నారు. మొత్తం 27 రాజకీయ పార్టీల నుంచి 1500 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 436 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు.  

ఈ ఎన్నికల్లోనూ ప్రస్తుత ప్రధాని షేక్‌ హసీనాకు చెందిన అవామీ లీగ్‌ పార్టీ వరుసగా నాలుగోసారి అధికారం చేజిక్కించుకోనుందని అంచనాలున్నాయి. ఈసారి గెలిస్తే అవామీ లీగ్‌కు దేశంలో ఐదోసారి అధికారం దక్కినట్లవుతుంది.  

ఇదీచదవండి...లక్షద్వీప్‌ వర్సెస్‌ మాల్దీవ్స్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement