
పూజ (ఫైల్) నివాళులర్పిస్తున్న అధ్యాపకులు
నేరేడ్‌మెట్: అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన డిగ్రీ కళాశాల విద్యార్థిని అంత్యక్రియల నిమిత్తం అధ్యాపకులు, తోటి విద్యార్థులు విరాళాలు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే...కార్ఖానాకు చెందిన పూజ(18) వాజ్‌పేయినగర్‌లోని మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీకళాశాలలో బీఎస్సీ చదువుతోంది. పూజ చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు మృతి చెందడంతో కార్ఖానాలో ఉంటుంటున్న అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటోంది. శుక్రవారం ఉదయం ఆమె అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలియడంతో కళాశాలకు వచ్చిన ఆమె తోటి విద్యార్థిని, విద్యార్థులు, అధ్యాపకులను దిగ్బ్రాంతికి లోనయ్యారు. తరగతులను బహిష్కరించి కళాశాల ఆవరణలో పూజ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె అంత్యక్రియల నిమిత్తం విద్యార్థులు రూ.6వేలు సేకరించగా, కళాశాల అధ్యాకులు తమ వంతుగా రూ.25వేలు అందజేశారు. దీంతో విద్యార్థులు, అధ్యాపకులు ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు నగదు అందజేసి, అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment