
బంజారాహిల్స్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రహమత్‌నగర్ సమీపంలోని కార్మికనగర్‌లో నివసించే విద్యార్థిని (23) బీకాం చదువుతోంది. శుక్రవారం అదే ప్రాంతానికి చెందిన బీటెక్ విద్యార్థి రాజు(23) ఆమెతో మాట్లాడాలని, పెళ్లి చేసుకుంటానని ఇంటికి పిలిపించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: విడాకులు కోరిన భార్య.. కడుపుమీద కారు ఎక్కించి హత్య)
Comments
Please login to add a commentAdd a comment