ఆదిలాబాద్ : డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిర్యాణి మండలం చింతపల్లి నాయకపుగూడలో మంగళవారం జరిగింది. వివరాలు.. నాయకపుగూడ గ్రామానికి చెందిన రమేష్ పెద్ద కుమారుడు నాయిడి రాజు తాండూర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ పథమ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం ఉదయం ఆయన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆత్మహత్యకు గల కారాణాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.