జిల్లాలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమను నిరాకరించిందనే కోపంతో నడిరోడ్డుపై విద్యార్థిని గొంతు కోశాడు. ఈ దారుణం అనకాపల్లిలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. యశోద భార్గవి అనే యువతి డీవీఎన్ కాలేజీలో డిగ్రీ చదువుతుంది. ఈ క్రమంలో సాయి అనే యువకుడు ప్రేమించాల్సిందిగా యశోద భార్గవి వెంట పడుతున్నాడు. కానీ బాధితురాలు అందుకు అంగీకరించలేదు. ప్రేమను నిరాకరించడంతో సాయి ఆమె మీద పగ పెంచుకున్నాడు. తనకు దక్కని యువతి మరెవరికి దక్కకూడదని భావించాడు. ఈ క్రమంలో బుధవారం విద్యార్థిని కాలేజీ నుంచి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు మీదకు వచ్చింది. ఆ సమయంలో అక్కడే ఉన్న సాయి యశోద భార్గవి మీద కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలి మెడ, నడుము భాగంలో తీవ్రమైన గాయాలయ్యాయి. దాడి అనంతరం పరారయ్యేందుకు ప్రయత్నించిన సాయిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం యశోద పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నడిరోడ్డుపై విద్యార్థిని గొంతు కోసిన ప్రేమోన్మాది
Published Wed, Aug 28 2019 6:27 PM | Last Updated on Wed, Mar 20 2024 5:24 PM
Advertisement
Advertisement
Advertisement