సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన విద్యార్థిని శ్వేతా రెడ్డి(17) అరుదైన అవకాశం లభించింది. అమెరికాలోని ప్రముఖ లాఫాయేట్ కాలేజీ శ్వేతారెడ్డికి ఏకంగా రూ.2 కోట్ల రూపాయల స్కాలర్ షిప్ ఆఫర్ చేసింది. లాఫాయేట్ కాలేజీలో 4 ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీ(మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్) కోర్సులో అడ్మిషన్‌తోపాటు ఈ స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది.ఈ కాలేజీలో అడ్మిషన్ దక్కించుకోవడమే గొప్ప విషయం కాగా.. శ్వేతారెడ్డి స్కాలర్ షిష్‌ను కూడా దక్కించుకుంది. డైయర్ ఫెలోషిప్ పేరిట లాఫాయెట్ కాలేజీ ప్రతి ఏడాది ఆరుగురు విద్యార్థులకు మాత్రం ఈ స్కాలర్ షిప్ అందిస్తుంది.
ఈ ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన ఆరుగురిలో తెలుగు విద్యార్థి శ్వేతారెడ్డి ఉండడం విశేషం. శ్వేతా ప్రతిభ, నాయకత్వ లక్షణాలు చూసే ఈ ఆఫర్ ఇచ్చినట్లు లాఫాయెట్ కాలేజీ తెలిపింది. కాగా స్కాలర్ షిప్ సాధించడం పట్ల శ్వేతా హర్షం వ్యక్తం చేశారు. ఇది తనకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. తనకు ఇలాంటి అద్భుత అవకాశం రావడం వెనక డెక్స్ టెరీటీ గ్లోబల్ సంస్థ ఇచ్చిన శిక్షణ, ప్రోత్సాహం ఉందని.. దాని వల్లే తాను ఈ స్కాలర్ షిప్ అందుకోగలిగానని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment