డిగ్రీ విద్యార్థిని సంతోషిణి అనుమానాస్పద మృతిపై ఎలాంటి అపోహలకు తావులేదని, నిస్పక్షపాతంగా విచారణ జరుపుతున్నామని సిద్ధిపేట పోలీసు కమిషనర్ శివకుమార్ తెలిపారు. వైద్యబృందం పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించామని చెప్పారు. మృతురాలి ఒంటిపై పైకి కనిపించే గాయాలు లేవని, పోస్టుమార్టం నివేదికతో పాటు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వస్తేనే అసలు విషయం తెలుస్తుందన్నారు. ఈ కేసులో ఇప్పటికే 16 మందిని విచారించినట్టు వెల్లడించారు. ఎవరికి ఎలాంటి సందేశాలు, సమాచారం ఉన్నా ఏసీపీకి తెలియజేయవచ్చని చెప్పారు.
Published Mon, May 29 2017 2:25 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
Advertisement