బీచ్లో స్నానానికి వెళ్లిన విద్యార్ధిని మృతి | Degree student died in kalingapatnam beach | Sakshi
Sakshi News home page

బీచ్లో స్నానానికి వెళ్లిన విద్యార్ధిని మృతి

Published Fri, Oct 30 2015 1:31 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

Degree student died in kalingapatnam beach

విజయనగరం: కళింగపట్నం బీచ్లో స్నానానికి వెళ్లిన ఓ విద్యార్థిని మృతి చెందింది. గుమ్మలక్ష్మీపురం మండలం బెంగళ గ్రామానికి చెందిన ధనలక్ష్మి గురువారం స్నేహితులతో కలసి కళింగపట్నం బీచ్‌లో స్నానానికి దిగి గల్లంతైంది.    

ధనలక్ష్మీ స్థానిక డిగ్రీ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె కోసం గ్రామస్థులు గురువారం ఎంత గాలించిన ఫలితం లేదు. కాగా, శుక్రవారం ఉదయం ఆమె మృతదేహం కళింగపట్నం తీరానికి కొట్టుకురావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ధనలక్ష్మీ మృతితో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement