kalingapatnam beach
-
బీచ్ కోత నివారణకు రూ.7.5 కోట్లు
సాక్షి, గార: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కళింగపట్నం (కె.మత్స్యలేశం) బీచ్ వంశధార వరద వల్ల కోతకు గురవ్వకుండా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.7.50 కోట్లు మంజూరు చేసింది. ఇందుకు పరిపాలన ఆమోదం తెలిపింది. దీంతో వంశధార నది సముద్రంలో కలిసే సంగమం వద్ద మత్స్యలేశం గ్రామం వైపు గ్రోయిన్లు నిర్మించనున్నారు. దీనివల్ల వంÔశధార వరద సమయంలో కోత బెడదకు అడ్డుకట్ట పడనుంది. ప్రతి ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో వంశధారకు వరద వస్తుంది. వరద వచ్చినప్పుడు నది దిశ మార్చుకుంటూ కె.మత్స్యలేశం వైపు పయనిస్తుంది. ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా ఉన్న సుమారు వంద ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయింది. ఇదే పరిస్ధితి కొనసాగితే కె.మత్స్యలేశం, బందరువానిపేట పంచాయతీలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. గతేడాది ఆగస్టు 9వ తేదీన వచ్చిన వరదతో బీచ్‌రోడ్డు కోతకు గురయ్యింది. పర్యాటకుల ఆహ్లాదం కోసం రూ.50 లక్షలతో ఏర్పాటు చేసిన జంతువుల బొమ్మలు, గ్రానైట్ బెంచీలు కొట్టుకుపోయాయి. దీంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందారు. ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పరిశీలించి శాశ్వత చర్యలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రొయ్యల చెరువుల కోసం... నదీ తీరం ఆక్రమించేసి... వంశధార నది సంగమానికి సమీపంలో రెండు పాయలుగా ఉండి, సముద్రంలో కలిసే సరికి ఒకే నదిగా ఏర్పడుతుంది. నదికి ఆవలి వైపునున్న పోలాకి మండలం అంపలాం వద్ద భూమి ఆక్రమణకు గురయ్యింది. బడా వ్యాపారస్తులు ఇసుక దిబ్బలను రొయ్యల చెరువులుగా మార్చుకున్నారు. ఆ చెరువుల్లోకి వరద నీరు వెళ్లకుండా నదివైపు పెద్ద ఎత్తున గట్లు నిర్మించుకున్నారు. దీనివల్ల నీరు వేగం పెరిగి సముద్రంలో కలుస్తూ తీరాన్ని కబళించేసింది. ఆక్రమణలను గత ప్రభుత్వం చూసీ చూడనట్టు వదిలేసింది. అధికారులు సర్వేలు చేసి నా టీడీపీ నాయకుల ఒత్తిడితో ఎక్కడివక్కడ నిలిచిపోయినట్టు ఆరోపణలున్నాయి. పలుమార్లు టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు పరిశీలించి చర్యలు తీసుకుంటామని ప్రకటించడమే తప్ప ఆచరణలో అమలు కాలేదు. కోతకు గురయిన ప్రాంతం వద్ద గ్రోయిన్ల నిర్మాణానికి మార్గం సుగమం అవ్వడంతో రెండు పంచాయతీల ప్రజలు ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ధర్మాన లేఖతో అత్యున్నత స్థ్ధాయి కమిటీ ఏర్పాటు పర్యాటక ప్రదేశం కోతకు గురవ్వడంతోపాటు మత్స్యకారుల ఆందోళనపై ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సీఎం జగన్మోహన్రెడ్డికి లేఖ రాయడంతో ప్రభుత్వం అత్యున్నత స్ధాయి కమిటీ వేసింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో అప్పటి చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం నార్త్‌కోస్టు హైడ్రాలజీ విశ్రాంత ఇంజినీర్ ఇన్ చీఫ్ రౌతు సత్యనారాయణ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. ముగ్గురు నిపుణుల బృందం నదీ సంగమ స్ధలాలు కోతకు గురైన కారణాలను పరిశీలించింది. అంపలాం వద్ద రొయ్యల చెరువులు ఆక్ర మంగా నిర్మించారని నిర్ధారించి వాటిని తొలగించాలని సూచించారు. అధికారులు కొంతమేర తొలగించారు. ఇదిలావుండగా కొద్ది రోజుల క్రితం లోకాయుక్త నదిలో ఆక్రమణలను మే 15 కల్లా తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. -
కళింగపట్నం బీచ్‌లో విషాదం,చివరి సెల్ఫీ
-
కళింగపట్నం బీచ్‌లో విషాదం,చివరి సెల్ఫీ
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానం సరదా కాస్తా వారి ప్రాణాల మీదకు తెచ్చింది. సముద్ర స్నానానికి వెళ్లిన అయిదుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. వారిలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరంతా శ్రీకాకుళంలోని చైతన్య కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం విద్యార్థులు. మృతులు షేక్ అబ్దుల్లా, ప్రవీణ్ కుమార్ రెడ్డి, యజ్ఞమయ పండా, కురుమూరి సందీప్, అనపర్తి సుందర్‌గా గుర్తించారు. కాగా ఆదివారం సెలవు కావడంతో మొత్తం ఆరుగురు విద్యార్థులు కళింగపట్నం బీచ్‌కు వచ్చారు. అనంతరం స్నానానికి దిగారు. సరదాగా స్నేహితులంతా అప్పటివరకూ సెల్ఫీలు దిగారు. ఇంతలో పెద్ద అల రావడంతో గల్లంతు అయ్యారు. ఈ ఆరుగురిలో లింగాల రాజసింహం అనే విద్యార్థిని మెరైన్ సిబ్బంది రక్షించారు. మరోవైపు గల్లంతు అయిన విద్యార్థులు కుటుంబాలు ...తమ పిల్లల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. గల్లంతు అయిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు -
కళింగ పట్నం వద్ద కోతకు గురైన సముద్రం
సాక్షి, శ్రీకాకుళం: భారీగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని వంశధార నది సముద్రం వైపు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద నీరు భారీగా సాగర సంగమం వద్ద కలుస్తుండడంతో సముద్రం 50 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో ఇసుక దిబ్బలు కోతకు గురవడంతో పాటు కళింగపట్నం బీచ్‌లో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన జిరాఫీ, ఏనుగు, ఒంటె బొమ్మలు ఆనవాలు లేకుండా కొట్టుకుపోయాయి. మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం ఇంకా కొనసాగుతుండడంతో చేపల వేటపై నిషేదంతో పాటు కళింగ పట్నం పోర్టు వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. -
ముగ్గురు ప్రాణాలు తీసిన బైక్ రేస్
సాక్షి, శ్రీకాకుళం: పుట్టిన రోజునాడు బైక్ రేస్‌లో పాల్గొనాలన్న యువకుల సరదా.. వారి ప్రాణాలు తీయడంతో పాటు ఎదురుగా వస్తున్న మరో వ్యక్తిని పొట్టనపెట్టుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వివరాలు.. శ్రీకాకుళం నగరంలో కస్పావీధికి చెందిన దువ్వు హిమశేఖర్ (19) పుట్టినరోజు సందర్భంగా బుధవారం రాత్రి స్నేహితులంతా కలిసి పార్టీ చేసుకున్నారు. గురువారం వేకువజామున కళింగపట్నం బీచ్‌కు వెళ్తామంటూ స్నేహితులంతా బయల్దేరారు. హిమశేఖర్ బైక్‌పై అతని మిత్రుడు బెహరా తేజేశ్వరరావు (19) ఉన్నాడు. మార్కెట్లో సరుకులు కొనేందుకు గార మండలం తూలుగు గ్రామానికి చెందిన వ్యాపారి దామోదర శ్రీనివాసరావు (35), కలాసీ లింగబరి బోడయ్య ద్విచక్రవాహనంపై ఎదురుగా వస్తున్నారు. చల్లపేట జంక్షన్ వద్ద రెండు వాహనాలు ఢీకొనడంతో దామోదర్ శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. కొనఊపిరితో ఉన్న హిమశేఖర్, తేజేశ్వరరావు, బోడయ్యలను హిమశేఖర్ స్నేహితులు రిమ్స్‌కు తరలించారు. మార్గమధ్యంలోనే హిమశేఖర్ మృతి చెందాడు. పరిస్థితి విషమంగా ఉన్న తేజేశ్వరరావును కుటుంబ సభ్యులు జెమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. హిమశేఖర్, అతడి స్నేహితులు రాత్రి వేళల్లో పెట్రోలు దొంగతనం చేసి జల్సా చేయడానికి అలవాటు పడ్డారని పోలీసులు గుర్తించారు. వాంబే కాలనీలో ఓ ఇంటి నుంచి దొంగిలించిన కోడిని ఎవరికి దక్కాలనే దానిపై వీరంతా పందెం పెట్టుకున్నారు. ముందుగా కళింగపట్నం బీచ్‌కు చేరుకున్న వారికే కోడి దక్కేలా బైక్ రేసు పెట్టుకున్నారు. అతివేగంగా వెళుతూ చల్లపేట జంక్షన్ వద్ద ప్రమాదం బారిన పడ్డారు. బైక్ రేస్‌లో పాల్గొన్న హిమశేఖర్, తేజేశ్వరరావుతో పాటు వ్యాపారి శ్రీనివాసరావు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. విచారణలో భాగంగా 13 మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. -
శోకసంద్రం
శ్రీకాకుళం ,గార: విహారం విషాదం మిగిల్చింది. పిక్నిక్లో తోటి స్నేహితులతో కలిసి సందడిగా గడిపిన ఇద్దరు యువకులు అందరూ చూస్తుండగానే సముద్రంలో గల్లంతయ్యారు. స్థానికులు ఎంతగా గాలించినా గల్లంతైన వారి జాడ తెలియకపోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ విషాద ఘటన కళింగపట్నం బీచ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం నగరంలోని బరాటం వీధికి చెందిన బరాటం వెంకటరమణ కుమారుడు సాయి (20) స్థానిక పెద్దమార్కెట్లో తోపుడు బండిపై పండ్లు అమ్ముతుండేవాడు. పిక్నిక్ జరుపుకొనేందుకు పది మంది స్నేహితులతో కలిసి ఆదివారం కళింగపట్నం బీచ్‌కు వచ్చాడు. మధ్యాహ్నం స్నేహితులతో కలిసి భోజనం చేసి సాయంత్రం సముద్రంలో స్నానానికి దిగాడు. అందరూ సందడి చేస్తున్న సమయంలో సాయి ఒక్కసారిగా గల్లంతయ్యాడు. స్థానిక యువకులు ఎంత వెతికినా ఆచూకీ తెలియలేదు. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబానికి చేదోడువాదోడుగా ఉన్న ఒక్కగానొక్క కుమారుడు సముద్రంలో గల్లంతు కావడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. సాయి తండ్రి వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై ఎస్.లక్ష్మణరావు తెలిపారు. ఇదే బీచ్‌లో విజయనగరం జిల్లా రామభద్రపురం గ్రామానికి చెందిన మామిడి నాగరాజు (17) అనే ఇంటర్మీడియెట్ విద్యార్థి కూడా ఆదివారం సాయంత్రం గల్లంతయ్యాడు. సుమారు 30 మంది స్నేహితులతో కలిసి బీచ్‌కు పిక్నిక్ కోసం వచ్చాడు. అందరూ కలిసి సాయంత్రం సముద్ర స్నానం చేస్తుండగా గల్లంతయ్యాడు. మృతుడి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రి సత్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ తలే రామారావు తెలిపారు. -
పుట్టిన రోజునే..
పుట్టిన రోజు కావడంతో ఉదయం నుంచి తల్లిదండ్రులతో ఆ యువకుడు ఆనందంగా గడిపాడు. ఆలయాలకు వెళ్లి పూజలు చేశాడు. తరువాత స్నేహితులతో కలిసి విహారయాత్ర కోసం బీచ్‌కు వెళ్లాడు. సాయంత్రం వరకూ అక్కడే సందడి చేశారు. మరికొద్దిసే పట్లో ఇంటికి తిరిగిముఖం పడతారకుంటున్న సమయంలో విషాదం చోటుచేసుకుంది. స్నానం కోసం సముద్రంలో దిగి యువకుడు గల్లంతయ్యాడు. దీంతో తోటి స్నేహితులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలిసి కన్నవారు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. పొందూరు మండలం నందివాడ గ్రామానికి చెందిన మజ్జి చంద్రమౌళి (17) కళింగపట్నం బీచ్‌లో గల్లంతు కావడంతో స్వగ్రామంలో విషాదం నెలకొంది. శ్రీకాకుళం, గార/పొందూరు: నందివాడ గ్రామానికి చెందిన మజ్జి వెంకటరమణ, సర్వలక్ష్మి దంపతులకు కుమారుడు చంద్రమౌళి, కుమార్తె భాగ్యలక్ష్మి ఉన్నారు. వెంకటరమణ ఆటో డ్రైవర్‌గా పని చేస్తు కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కుమారుడు చంద్రమౌళి (17) పొందూరు మండలం వావిలాపల్లి ఆదర్శ పాఠశాలలో ఇంటర్ (ఎంపీసీ) రెండో ఏడాది చదువుతున్నాడు. బుధవారం కళాశాలకు సెలవు కావడంతో పాటు తన పుట్టినరోజు కలసి రావడంతో ఆనందంగా గడపాలని భావించాడు. మంగళవారమే స్నేహితులతో కలిసి విహార యాత్ర కోసం గార మండలం కళింగపట్నం బీచ్‌కు వెళ్లాలని నిర్ణయిం చకున్నారు. బుధవారం ఉదయం తల్లిదండ్రులు ఆశీస్సులు చంద్రమౌళి తీసుకున్నాడు. అనంతరం 11 మంది స్నేహితులతో కలిసి ఆటోలో కళింగపట్నం బీచ్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో ఎచ్చె ర్ల మండలం కుంచాలకుర్మయ్యపేటలోని దేవీ ఆశ్రమానికి వెళ్లి అక్కడ పూజలు చేశారు. అక్కడ నుంచి బీచ్‌కు వెళ్లారు. స్నేహితులతో కలిసి బీచ్‌లో సందడిగా గడిపారు. సెల్ఫీలు తీసుకొని తల్లి దండ్రులకు చంద్రమౌళి వాట్సాప్‌లో పోస్టు చేశా డు. వాటిని చూసి కన్నవారు మురిసిపోయారు. స్నేహితులకు కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫొటోలను వాట్సాప్‌లో పంపించాడు. సాయంత్రం నాలుగు గంటల వరకూ బీచ్‌లో సందడిగా స్నేహితులంతా గడిపారు. అనంతరం స్నానం చేసేందుకు సముద్రంలో దిగారు. అయితే ఇక్కడే విషాదం నెలకొంది. పుట్టిన రోజును సంతోషంగా జరుపుకుంటున్న చంద్రమౌళిని రాకాసి అల ఉవ్వెత్తిన వచ్చి ఈడ్చుకుపోవడంతో గల్లంతయ్యాడు. దీన్ని చూసి మిగిలిన స్నేహితులు ఆందోళనకు గురయ్యారు. విధుల్లో ఉన్న మెరైన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గాలింపుచర్యలు చేపట్టా రు. అయినా రాత్రి వరకూ ఎలాంటి ఆచూకీ లేదు. మెరైన్ పోలీసులు వద్దంటున్నా.. బీచ్‌లో స్నానానికి దిగవద్దని విధుల్లో ఉన్న మెరైన్ పోలీసులు మైక్‌లో హెచ్చరించారు. అయితే చంద్రమౌళితోపాటు అతని స్నేహితులు వీటిని పట్టించుకోకుండా సముద్రంలోకి దిగారు. వీరిలో చంద్రమౌళి గల్లంతయ్యాడు. పడవలో మెరైన్ సీఐ అంబేడ్కర్ ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థి చంద్రమౌళి తండ్రి వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని గార ఏఎస్సై తలే రామారావు తెలిపారు. -
బీచ్‌లో స్నానానికి వెళ్లిన విద్యార్ధిని మృతి
విజయనగరం: కళింగపట్నం బీచ్‌లో స్నానానికి వెళ్లిన ఓ విద్యార్థిని మృతి చెందింది. గుమ్మలక్ష్మీపురం మండలం బెంగళ గ్రామానికి చెందిన ధనలక్ష్మి గురువారం స్నేహితులతో కలసి కళింగపట్నం బీచ్‌లో స్నానానికి దిగి గల్లంతైంది. ధనలక్ష్మీ స్థానిక డిగ్రీ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె కోసం గ్రామస్థులు గురువారం ఎంత గాలించిన ఫలితం లేదు. కాగా, శుక్రవారం ఉదయం ఆమె మృతదేహం కళింగపట్నం తీరానికి కొట్టుకురావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ధనలక్ష్మీ మృతితో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది.