ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, శ్రీకాకుళం: భారీగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని వంశధార నది సముద్రం వైపు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద నీరు భారీగా సాగర సంగమం వద్ద కలుస్తుండడంతో సముద్రం 50 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో ఇసుక దిబ్బలు కోతకు గురవడంతో పాటు కళింగపట్నం బీచ్‌లో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన జిరాఫీ, ఏనుగు, ఒంటె బొమ్మలు ఆనవాలు లేకుండా కొట్టుకుపోయాయి. మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం ఇంకా కొనసాగుతుండడంతో చేపల వేటపై నిషేదంతో పాటు కళింగ పట్నం పోర్టు వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment