Sea level rise
-
ముంపు అంచున అగ్రరాజ్యం
భూతాపోన్నతి, కాలుష్యం, కార్చిచ్చులు అన్నీ కలిసి ధ్రువపు మంచును వేగంగా కరిగించేస్తున్నాయి. కొత్తగా వచి్చచేరిన నీటితో సముద్ర మట్టాలు అమాంతం పెరిగి తీరప్రాంతాలను తమలో కలిపేసుకోనున్నాయి. ఇలా సముద్రమట్టాల పెరుగుదలతో ముంపు ముప్పును అమెరికాలోని 24 తీరప్రాంత నగరాలు ఎదుర్కోనున్నాయని తాజా అధ్యయనం ఒకటి ప్రమాదఘంటికలు మోగించింది. ఇప్పటికైనా తేరుకోకపోతే అనూహ్యంగా పెరిగే సముద్రమట్టాలను ఆపడం ఎవరితరమూ కాదు. అమెరికాలోని ప్రభావిత 32 తీరనగరాలకుగాను 24 నగరాల వెంట సముద్రమట్టం ప్రతిసంవత్సరం 2 మిల్లీమీటర్ల మేర పెరుగుతోంది. వీటిలోని 12 నగరాల్లో అయితే అంతర్జాతీయ సముద్రమట్టాల సగటు పెరుగుదల రేటును దాటి మరీ జలాలు పైపైకి వస్తున్నాయి. వీటికితోడు ఈ నగరాల్లోని ప్రతి 50 మంది జనాభాలో ఒకరు దారుణమైన వరదలను చవిచూడక తప్పదని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఈ పరిశోధన తాలూకు సమగ్ర వివరాలు జర్నల్ ‘నేచర్’లో ప్రచురితమయ్యాయి. గ్లోబల్ వార్మింగ్ దెబ్బకి వాతావరణంలో అనూహ్య ప్రతికూల మార్పులు సంభవిస్తున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా తరచూ హీట్‌వేవ్‌లు, కరువులు సంభవించి, కార్చిచ్చులు చెలరేగి సగటు ఉష్ణోగ్రతలను అంతకంతకూ పెచ్చరిల్లుతున్నాయి. దీంతో ధృవాల వద్ద హిమానీనదాలు గతంలో కంటే వేగంగా కరిగిపోతున్నాయి. దీంతో అమెరికా, భారత్‌సహా పలు ప్రపంచదేశాల తీరప్రాంతాలకు ముంపు ప్రమాదం హెచి్చందని అధ్యయనకారులు ఆందోళన వ్యక్తంచేశారు. మరిన్ని వరదలు 2050 సంవత్సరంకల్లా అమెరికా తీరప్రాంతాల వెంట సముద్రం దాదాపు 0.30 మీటర్లమేర పైకి ఎగిసే ప్రమాదముంది. దీంతో జనావాసాలను సముద్రపు నీరు ముంచెత్తి జనజీవనం అస్తవ్యస్తంకానుంది. సముద్రపు నీటితో కుంగిన నేలలు, రోడ్లు ఇలా ప్రజారవాణా వ్యవస్థ మొత్తం దెబ్బతిననుంది. కొన్ని ప్రాంతాలు మరింతగా కుంగిపోయే ప్రమాదముందని గణాంకసహితంగా అధ్యయనం పేర్కొంది. వచ్చే 30 సంవత్సరాల్లో ప్రతి 35 ప్రైవేట్ ఆస్తుల్లో ఒకటి వరదల బారిన పడి నాశనమయ్యే అవకాశముంది. గత అంచనాలను మించి విధ్వంసం తప్పదని అధ్యయనం హెచ్చరించింది. మట్టం పెరగడంతో లక్షలాది మంది తీరప్రాంత ప్రజల జీవనం ప్రశ్నార్ధకంగా మారనుంది. అమెరికాలో 109 బిలియన్ డాలర్లమేర ఆస్తినష్టం సంభవించవచ్చని ఓ అంచనా. ఈ అధ్యయనంలో పంజాబ్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ వారి బృందం సైతం పాలుపంచుకుంది. అమెరికా తీరప్రాంతంలో ముంపును ఎదుర్కోనున్న ప్రాంతాల అంచనా గణాంకాలను సిద్దంచేసింది. ‘నక్షత్రాలు నేలరాలితే ఏం చేయగలం?. చిన్నపాటి వర్షం కూడా పడవ వేగంగా మునగడానికి ప్రబల హేతువు కాగలదు. అలాగే తీరాల వెంట మట్టాలు పెరిగితే కలిగే విపత్తులు, విపరిణామాలు దారుణంగా ఉంటాయి’ అని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్త రాబర్ట్ నెకొలస్ ఆందోళన వ్యక్తంచేశారు. ముంపు అవకాశమున్న 32 నగరాలు బోస్టన్, న్యూయార్క్ సిటీ, జెర్సీ సిటీ, అట్లాంటిక్ సిటీ, వర్జీనియా బీచ్, విలి్మంగ్టన్, మేర్టల్ బీచ్, చార్లెస్టన్, సవన్నా, జాక్సన్విల్లే, మయామీ, నేపుల్స్, మొబిల్, బిలోక్సీ, న్యూ ఓర్లీన్స్, స్లైడెల్, లేక్ చార్లెస్, పోర్ట్ ఆర్ధర్, టెక్సాస్ సిటీ, గాల్వెస్టన్, ఫ్రీపోర్ట్, కార్పస్ క్రిస్టీ, రిచ్మండ్, ఓక్లాండ్, శాన్ ప్రాన్సిస్కో, సౌత్ శాన్ ప్రాన్సిస్కో, ఫాస్టర్ సిటీ, శాంటాక్రూజ్, లాంగ్ బీచ్, హటింగ్టన్ బీచ్, న్యూపోర్ట్ బీచ్, శాండియాగో – సాక్షి, నేషనల్ డెస్క్ -
కలల నగరం, నిద్రపోని నగరం న్యూయార్క్ .. మునిగిపోనుందా?
అగ్రరాజ్యం అమెరికాలో ముఖ్యమైన సిటీ న్యూయార్క్. ఖరీదైన కలల నగరంగా, నిద్రపోని నగరంగా పేరుగాంచింది. న్యూయార్క్ సిటీ ఇప్పుడు ముంపు ముప్పును ఎదుర్కొంటోంది. క్రమక్రమంగా భూమిలోకి కూరుకుపోతోంది. ఇందుకు ప్రధాన కారణాలు సిటీలో ఉన్న వేలాది ఆకాశహర్మ్యాలు, వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టం పెరుగుతుండడం. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్ర తీరంలో ఉన్న న్యూయార్క్ ప్రతిఏటా 2 మిల్లీమీటర్ల మేర కుంగిపోతున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ రోడ్ ఐలాండ్ సైంటిస్టుల తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ఈ వివరాలను ‘అడ్వాన్సింగ్ ఎర్త్, స్పేస్ సైన్స్’ పత్రికలో ప్రచురించారు. సముద్ర మట్టం పెరుగుదలకు తోడు భారీ భవనాల వల్ల న్యూయార్క్‌లో భూమిపై ఒత్తిడి పెరుగుతోందని, అందుకే నగరం మునిగిపోతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటికైనా మేల్కొని నివారణ చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో ఈ ముంపు తీవ్రత ఇంకా ఉధృతమవుతుందని అంటున్నారు. నగరం నివాస యోగ్యం కాకుండాపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం న్యూయార్క్ సిటీకే పరిమితమైన సమస్య కాదని, ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతాల్లోని నగరాలు ముంపు బారిన పడుతున్నాయని పేర్కొంటున్నారు. ♦ భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషీమఠ్ పట్టణంలో ఇటీవల ఇళ్లు కూలిపోయిన సంగతి గుర్తుండే ఉంటుంది. పగుళ్లు ఏర్పడడంతో చాలా ఇళ్లను కూల్చేయాల్సి వచ్చింది. జోషీమఠ్‌లో భూమి అంతర్భాగంలో ఒత్తిడి వల్లే ఇళ్లు కూలిపోయినట్లు గుర్తించారు. న్యూయార్క్‌లోనూ ఈ తరహా ఉత్పాతం పొంచి ఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ♦ న్యూయార్క్ నగర జనాభా 80 లక్షల పైమాటే. ఆకాశాన్నంటే భారీ భవనాలతో సహా 10 లక్షల దాకా భవనాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని ప్రాంతాలు ఏటా 2 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగానే భూమిలోకి కూరుకుపోతున్నాయి. ♦ ఉత్తర అమెరికాలో అట్లాంటిక్ తీరంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే సముద్ర మట్టం పెరుగుదల వల్ల ముంపు ముప్పు న్యూయార్క్‌కు మూడు నుంచి నాలుగు రెట్లు అధికంగా ఉందని పరిశోధకులు తెలియజేశారు. ♦ మరో 80 ఏళ్లలో.. అంటే 2100వ సంవత్సరం నాటికి న్యూయార్క్ సిటీ 1,500 మిల్లీమీటర్లు కుంగిపోతుందని అధ్యయనంలో గుర్తించారు. ♦న్యూయార్క్‌పై ప్రకృతి విపత్తుల దాడి కూడా ఎక్కువే. 2012లో సంభవించిన శాండీ తుపాను కారణంగా సముద్రపు నీరు నగరంలోకి చొచ్చుకువచ్చింది. చాలా ప్రాంతాలు జలవిలయంలో చిక్కుకున్నాయి. 2021లో సంభవించిన ఇడా తుఫాను వల్ల సిటీలో మురుగునీటి కాలువలు ఉప్పొంగాయి. డ్రైనేజీ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా మారింది. ♦ కోస్టల్ సిటీలకు ముంచుకొస్తున్న ప్రమాదానికి న్యూయార్క్ ఒక ఉదాహరణ అని ‘యూనివర్సిటీ ఆఫ్ రోడ్ ఐలాండ్’కు చెందిన గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఓషియనోగ్రఫీ సైంటిస్టులు చెప్పారు. ఈ సమస్య ప్రపంచానికి ఒక సవాలు లాంటిదేనని అన్నారు. సముద్ర మట్టాలు పెరగకుండా అన్ని దేశాలు కలిసి చర్యలు తీసుకోవాలని, సముద్ర తీర ప్రాంతాల్లోని నగరాల్లో భవనాల నిర్మాణంపై నియంత్రణ విధించాలని సూచించారు. ♦సముద్ర తీరంలో, నది ఒడ్డున, చెరువుల పక్కన నిర్మించే భారీ భవనాలు భవిష్యత్తులో వరద ముంచెత్తడానికి, తద్వారా ప్రాణ నష్టానికి కారణమవుతాయని వివరించారు. ♦ అన్నింటికంటే ముఖ్యంగా మితిమీరిన నగరీకరణ, పట్టణీకరణ అనేవి ప్రమాద హేతువులేనని తేల్చిచెప్పారు. ♦ అడ్డూ అదుపూ లేకుండా నగరాలు, పట్ట ణాలు విస్తరిస్తున్నాయి. వర్షం పడితే అవి చెరువుల్లా మారుతుండడం మనం కళ్లారా చూస్తూనే ఉన్నాం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘ముంచు’కొస్తున్న సముద్రం
సాక్షి, అమరావతి: సముద్ర నీటిమట్టాలు ఏటా పెరుగుతున్నాయని నాసా తాజాగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 2021–22లో 0.27 సెం.మీ మేర పెరిగిన సముద్రజలాలు తీరంలో అలజడిని సృష్టించాయని పేర్కొంది. సముద్రజలాలు కొద్దిగా పెరిగినా తీరం వెంబడి ఆవాసాలు ఏర్పరుచుకున్న వారికి ఆందోళన కలిగిస్తుందని వెల్లడించింది. ఉపగ్రహాల ద్వారా సముద్రజలాలపై నాసా చేసిన అధ్యయన నివేదికను ఇటీవల వెల్లడించడంతోపాటు గత 30 సంవత్సరాల సముద్ర మట్టాలను విశ్లేషించింది. 1993 నుంచి ఇప్పటివరకు సముద్ర జలాల మట్టం 9.1 సెం.మీ పెరిగిందని పేర్కొంది. గతేడాదిలో 0.27 సెం.మీ పెరిగిన సముద్ర జలాలు ఇకపై ఏడాదికి సగటున 0.66 సెం.మీ చొప్పున పెరిగి 2050 నాటికి మొత్తం 17.82 సెం.మీకు చేరుతుందని వెల్లడించింది. సముద్రాలపై ‘ఎల్‌నినో’ తీవ్రప్రభావం చూపడం, వాతావరణ మార్పులతో ఇలాంటి పరిస్థితి తలెత్తుతోందని, పెరుగుతున్న గ్రీన్హౌస్ వాయువులు, వాయుకాలుష్యం వంటివాటిని తగ్గించుకోకపోతే తీరప్రాంతాల్లో నివసించే ప్రజలకు కష్టాలు తప్పవని హెచ్చరించింది. సముద్ర నీటిమట్టం పెరుగుదలను పరిశీలించేందుకు అమెరికా–ఫ్రెంచ్ ప్రభుత్వాలు సంయుక్తంగా 1993లో ‘టోపెక్స్ మిషన్’ను చేపట్టాయి. ప్రత్యేక రాడార్లతో సముద్ర ఉపరితలంపైకి మైక్రోవేవ్ తరంగాలని పంపించి కచ్చితమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. వేగంగా కరుగుతున్న అంటార్కిటిక్ మంచు వాతావరణ మార్పులకు, సముద్ర మట్టం పెరుగుదలకు మానవ తప్పిదాలే ప్రధాన కారణమని నాసా విశ్లేషించింది. పరిమితికి మించిన కాలుష్యకారక వాయువుల కారణంగా వాతావరణంలో వేడి పెరిగి మంచు ప్రాంతాలు కరిగిపోయి హిమనీ నదాల్లో నీరు పెరుగుతోందని గుర్తించింది. వేసవి ఉష్ణోగ్రతలకు 2022లో అంటార్కిటిక్ ఖండంలోని మంచు పలకలు సాధారణ సగటు కంటే ఎక్కువగా కరిగిపోయినట్టు పేర్కొంది. దీనికి గ్రీన్‌ల్యాండ్ ఐస్ ప్యాక్ కరిగి అదనపు నీరు తోడవడంతో సముద్ర మట్టాలు వేగంగా పెరిగినట్లు ప్రకటించింది. అర మీటర్ మునిగింది.. గతేడాది పెరిగిన సముద్ర జలాలతో మియామి, న్యూయార్క్, బ్యాంకాక్, షాంఘై, లిమా (పెరూ), కేప్‌టౌన్‌తో పాటు అనేక తీర ప్రాంతాలు అర మీటర్ మేర నీటమునిగినట్టు నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ పెరుగుదల కష్టాలను కనీసం 800 మిలియన్ల మంది ఎదుర్కొంటారని వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా దేశస్తుల్లో సగం మందికి పైగా తీరప్రాంతాల్లోనే ఉన్నారు. ప్రధాన సీపోర్టులు, వినోద ప్రాంతాలు, ఇతర సౌకర్యాలు తీరంలోనే ఉన్నాయి. సముద్ర మట్టం పెరిగితే వీటిపై తీవ్రంగా ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఈ ముంపు ప్రభావం అడవులు, వన్యప్రాణుల పైన కూడా పడుతుందని హెచ్చరిస్తున్నారు. నాసా వెల్లడించిన అంశాలు వాతావరణాన్ని ఏ స్థాయిలో కలుషితం చేస్తున్నామో.. గ్రీన్హౌస్ వాయువులను ఏస్థాయిలో విడుదల చేస్తున్నామో హెచ్చరికగా పేర్కొన్నారు. నాసా లెక్కల ప్రకారం 2050 నాటికి సముద్ర మట్టం 17.82 సెం.మీ పెరిగితే.. 300 నుంచి 500 మీటర్ల మేర తీర ప్రాంతం సముద్ర గర్భంలో కలిసిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రమాదకరంగా పైపైకి.. శరవేగంగా పెరుగుతున్న సముద్ర మట్టాలు
వాతావరణ మార్పులు, తద్వారా నానాటికీ పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ప్రపంచాన్ని నానాటికీ ప్రమాదపుటంచులకు నెడుతున్నాయి. వీటి దుష్పరిణామాలను 2022 పొడవునా ప్రపంచమంతా చవిచూసింది. ఆస్ట్రేలియా మొదలుకుని అమెరికా దాకా పలు దేశాల్లో ఒకవైపు కార్చిచ్చులు, మరోవైపు కనీవినీ ఎరగని వరదలు, ఇంకోవైపు తీవ్ర కరువు పరిస్థితులు, భరించలేని వేడి గాలుల వంటివి జనానికి చుక్కలు చూపాయి. ఆర్కిటిక్ బ్లాస్ట్ దెబ్బకు ఇంగ్లండ్‌తో పాటు పలు యూరప్ దేశాలు గత 40 ఏళ్లలో ఎన్నడూ కనీవినీ ఎరగనంతటి చలి, మంచు వణికించాయి. ఆ వెంటనే అమెరికాపై విరుచుకుపడ్డ బాంబ్ సైక్లోన్ ‘శతాబ్ది మంచు తుపాను’గా మారి దేశమంతటినీ అతలాకుతలం చేసి వదిలింది. 2023లో కూడా ఇలాంటి కల్లోలాలు, ఉత్పాతాలు తప్పవని పర్యావరణ నిపుణులు ఇప్పటినుంచే హెచ్చరిస్తుండటం మరింత కలవరపెడుతోంది. వీటికి తోడు మరో పెను సమస్య చడీచప్పుడూ లేకుండా ప్రపంచంపైకి వచ్చిపడుతోంది. అదే... సముద్ర మట్టాల్లో అనూహ్య పెరుగుదల! ప్రపంచవ్యాప్తంగా అన్ని తీర ప్రాంతాల్లోనూ ఈ ప్రమాదకర పరిణామం చోటు చేసుకుంటోంది. ముఖ్యంగా మధ్యదరా ప్రాంతంలో సముద్ర మట్టాలు మరీ ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న వైనాన్ని తాజా అధ్యయనం ఒకటి వెలుగులోకి తెచ్చింది. ఇదిప్పుడు పర్యావరణవేత్తలందరినీ కలవరపెడుతోంది! 20 ఏళ్లలో 8 సెంటీమీటర్లు! సముద్ర మట్టాల్లో పెరుగుదల తాలూకు దుష్పరిణామాలు మధ్యదరా తీర ప్రాంతాల్లో కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా గత రెండు దశాబ్దాల్లో ఇటలీలోని అమ్లాఫీ తీరం వద్ద సముద్ర మట్టం స్పెయిన్‌లోని కోస్టా డెల్‌సోల్‌తో పోలిస్తే రెండింతలు పెరిగినట్టు పరిశోధకులు తేల్చారు. ‘‘మధ్యదరా పరిధిలో కూడా ఇతర ప్రాంతాలతో పోలిస్తే అడ్రియాటిక్, ఎజియన్, లెవంటైన్ సముద్రాల తీర ప్రాంతాల్లో నీటి మట్టం 20 ఏళ్లలో ఏకంగా 8 సెంటీమీటర్లకు పైగా పెరిగింది. పైగా ఈ పెరుగుదల రేటు ఇటీవలి కాలంలో బాగా వేగం పుంజుకుంటుండటం మరింత ప్రమాదకర పరిణామం’’ అని వారు వెల్లడించారు! తమ అధ్యయనంలో భాగంగా అలలు, ఆటుపోట్ల గణాంకాలతో పాటు మంచు కరిగే రేటుకు సంబంధించి ఉపగ్రహ ఛాయాచిత్రాలు తదితరాలను లోతుగా విశ్లేషించారు. 1989 తర్వాత నుంచీ మధ్యదరా సముద్ర మట్టం శరవేగంగా పెరుగుతోందని తేల్చారు. పరిశోధన ఫలితాలు అడ్వాన్సింగ్ అర్త్ స్పేస్ సైన్సెస్ జర్నల్ తాజాగా ప్రచురితమయ్యాయి. అతి సున్నిత ప్రాంతం నిజానికి మధ్యదరా ప్రాంతం వాతావరణ మార్పులపరంగా ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒకటి. వరదలు, క్రమక్షయం వంటివాటి దెబ్బకు ఇప్పటికే ఈ ప్రాంతంలోని ప్రపంచ వారసత్వ కట్టడాల్లో ఏకంగా 86 శాతం దాకా లుప్తమయ్యే ముప్పును ఎదుర్కొంటున్నాయి. 2022 మొదట్లో జరిగిన మరో అధ్యయనం కూడా ఇలాంటి ప్రమాదకరణ పరిణామాలనే కళ్లకు కట్టింది. మధ్యదరాతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా సముద్రమట్టాలు గతంలో భావించిన దానికంటే చాలా వేగంగా పెరుగుతున్నాయన్న చేదు వాస్తవాన్ని వెల్లడించింది. గ్రీన్లాండ్ బేసిన్లో పరుచుకున్న అపారమైన మంచు నిల్వలు గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఊహాతీత వేగంతో కరిగిపోతుండటం ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. దానివల్ల అపారమైన పరిమాణంలో నీరు సముద్రాల్లోకి వచ్చి చేరుతోందని వివరించింది. అంతేకాదు, గ్రీన్లాండ్ మంచు ఇదే వేగంతో కరగడం కొనసాగితే 2100 కల్లా ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు ప్రస్తుతం ఊహిస్తున్న దానికంటే ఏకంగా ఆరు రెట్లు ఎక్కువగా పెరిగిపోతాయని కూడా హెచ్చరించింది. పెను ప్రమాదమే...! సముద్ర మట్టాలు పెరిగితే సంభవించే దుష్పరిణామాలు అన్నీ ఇన్నీ కావు... ► తీర ప్రాంతాలు ముంపుకు గురవుతాయి ► చిన్న చిన్న ద్వీప దేశాలు ఆనవాళ్లు కూడా మిగలకుండా సముద్రంలో కలిసిపోతాయి ► షికాగో మొదలుకుని ముంబై దాకా ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీరాల్లో అలరారుతున్న అతి పెద్ద నగరాలు నీట మునుగుతాయి ► వందలాది కోట్ల మంది నిర్వాసితులవుతారు. ► ఇది ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద ఆర్థిక, సామాజిక సమస్యగా పరిణమిస్తుంది ► సముద్రపు తాకిడి నుంచి ప్రధాన భూభాగాలకు రక్షణ కవచంగా ఉండే చిత్తడి నేలలతో కూడిన మడ అడవులు అంతరిస్తాయి ► వాటిలో నివసించే పలు జీవ జాతులు అంతరించిపోయే ప్రమాదముంది ► నేల క్రమక్షయానికి లోనవుతుంది. సాగు భూమి పరిమాణమూ తగ్గుతుంది ► భారీ వర్షాలు, అతి భారీ తుఫాన్ల వంటివి పరిపాటిగా మారతాయి – సాక్షి, నేషనల్ డెస్క్ -
కళింగ పట్నం వద్ద కోతకు గురైన సముద్రం
సాక్షి, శ్రీకాకుళం: భారీగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని వంశధార నది సముద్రం వైపు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద నీరు భారీగా సాగర సంగమం వద్ద కలుస్తుండడంతో సముద్రం 50 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో ఇసుక దిబ్బలు కోతకు గురవడంతో పాటు కళింగపట్నం బీచ్‌లో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన జిరాఫీ, ఏనుగు, ఒంటె బొమ్మలు ఆనవాలు లేకుండా కొట్టుకుపోయాయి. మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం ఇంకా కొనసాగుతుండడంతో చేపల వేటపై నిషేదంతో పాటు కళింగ పట్నం పోర్టు వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. -
గ్రీన్‌ల్యాండ్‌లో మంచు కనుమరుగు కానుందా?
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా ఉత్పన్నమ వుతున్న కర్బనవాయువులు ఇదే వేగంతో పెరుగుతుంటే ఈ శతాబ్దం ముగిసేలోపే గ్రీన్‌ల్యాండ్‌లోని 4.5 శాతం మంచుకొండలు కరిగిపోయే ప్రమాదం ఉందని తాజా పరిశోధన వెల్లడించింది. దానితోపాటు సముద్ర మట్టాలు 13 అంగుళాల మేర పెరిగే అవకాశం ఉందని ఆ నివేదిక హెచ్చరించింది. ఉద్గారాలను తగ్గించకపోతే 3000 సంవత్సరం కల్లా గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు పూర్తిగా కరిగే అవకాశం ఉందని అమెరికాలోని అలస్కా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఆండీ ఆష్వాండెన్ తెలిపారు. గ్రీన్‌ల్యాండ్‌లో 6,60,000 చదరపు కిలోమీటర్ల మేర మంచు పరచుకొని ఉంది. ఈ మంచుకొండల కింద ఉన్న ప్రాంతాల పరిస్థితులపై ఆయన అధ్యయనం చేశారు. దాదాపు 500 రకాల విభిన్న పరిస్థితులను అంచనా వేశారు. వీటిని అంచనా వేసే క్రమంలో పెద్ద మంచు పర్వతాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. వాటి నుంచి కరుగుతున్న హిమ శాతాన్ని కలిపి ఈ మేరకు అంచనాలు వేశారు. 1991, 2015 మధ్య సంవత్సరానికి 0.02 శాతం చొప్పున సముద్రమట్టం పెరిగిందని అన్నారు. గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు పర్వతాలను కూడా పరిగణలోకి తీసుకొని పరిశోధన చేసిన మొదటి నివేదిక ఇదే కావడం గమనార్హం. నగరాలకు ముంపు తప్పదు... ఇప్పుడు ఉన్న కర్బన ఉద్గార శాతం ఇలాగే కొనసాగితే 3000 సంవత్సరం కల్లా సముద్రమట్టం 24 అడుగులు పెరుగుతుందని హెచ్చరించారు. దీనివల్ల సముద్రపు ఒడ్డున ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెలస్, న్యూ ఓర్లాన్స్ వంటి నగరాలు సముద్రంలో మునగడం ఖాయమన్నారు. కర్బన వాయువులు పెరగకుండా జగ్రత్తలు తీసుకుంటే సముద్ర మట్టం కేవలం 6.5 అడుగులు మాత్రమే పెరిగే అవకాశం ఉందన్నారు. -
సాగరం కబళిస్తోంది!!
వేగంగా పెరుగుతున్న సముద్ర మట్టాలు ♦ 19012010 మధ్య 19 సెంటీమటర్లు పెరుగుదల ♦ 2100 నాటికి 1 మీ. నుంచి 7 మీ. పెరిగే అవకాశం ♦ దేశ దేశాల్లో తీర ప్రాంతాలు నీటమునిగే ప్రమాదం ♦ భారత్తూర్పు తీరానికి ముంపు ముప్పు అధికం ♦ కోల్‌కతా, విశాఖ నగరాలు వందేళ్లలో నీటి పాలు ♦ ఆంధ్రప్రదేశ్తీరమంతా సముద్రంలో మునిగే అవకాశం ♦ ముంబై మహానగరానికి పొంచివున్న భారీ ముంపు నిర్విరామంగా ఎగసిపడే సాగర కెరటాలు నెమ్మది నెమ్మదిగా భూభాగాన్ని కబళిస్తున్నాయి. భూవాతావణం వేడెక్కేకొద్దీ సముద్రమట్టం వేగంగా పెరుగుతోంది. 1901 నుండి ఇప్పటివరకూ దాదాపు 20 సెంటీమీటర్ల మేర సముద్ర మట్టం పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పెరుగుదల వేగం ఇటీవలి కాలంలో పెరిగిందని.. ఈ శతాబ్దం ముగిసే సరికి సముద్ర మట్టం ఒక అడుగు నుంచి ఒక మీటరు వరకూ పెరగవచ్చునని.. ధృవప్రాంతాల్లో మంచుదుప్పటి కరిగిపోతే ఏడు మీటర్ల వరకూ కూడా పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దానివల్ల తీర ప్రాంతాలు చాలా వరకూ సముద్రంలో మునిగిపోతాయని.. ఆ ప్రాంత ప్రజలకు చాలా కష్టనష్టాలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో సుదీర్ఘ భారత తీరానికీ.. అందులోనూ లోతట్టు ప్రాంతమైన తూర్పు తీరానికి ఎక్కువ ముప్పు పొంచివుందని అప్రమత్తం చేస్తున్నారు. 2100 నాటికి సముద్ర మట్టాలు ఎలా పెరుగుతాయి, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అనే దానిపై ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు సాగుతున్నాయి. ఆ అధ్యయనాల సారాంశమిదీ... మామూలుగా సముద్రమట్టాలు స్థిరంగా ఉంటాయని మనం భావిస్తాం. కానీ భూగోళం చరిత్రను చూస్తే సముద్రమట్టాల్లో పెనుమార్పులు సంభవించిన విషయం స్పష్టమవుతుంది. భూగోళం దాదాపు లక్ష సంవత్సరాల విరామాలతో మంచు యుగం నుంచి మంచు యుగానికి పయనించింది. చివరి మంచు యుగం పతాకస్థాయిలో ఉన్నపుడు ఉత్తర అమెరికా ఖండం అత్యధిక భాగం మంచుతో నిండివుండేది. అప్పుడు సముద్ర మట్టం ఇప్పటికన్నా 400 అడుగులు తక్కువగా ఉండేది. ప్రస్తుతం మనం మంచు యుగాల మధ్య ఉష్ణ కాలంలో ఉన్నాం. అంటే.. ఇప్పుడు సముద్రమట్టాలు వేగంగా పెరుగుతూపోతాయి. ఆ తర్వాత మళ్లీ తగ్గడం మొదలవుతాయి. కానీ మానవ కల్పిత వాతావరణ మార్పు ఈ చక్రాన్ని మారుస్తోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గతంలో సముద్రమట్టాల్లో మార్పులు చాలా నెమ్మదిగా సంభవించేవని, కొన్ని వేల ఏళ్లు పట్టేదని.. కానీ ఇప్పుడు భూతాపం పెరుగుతుండటం సముద్రమట్టాలు వేగంగా పెరుగడానికి కారణమవుతోందని వారు వివరిస్తున్నారు. వేగంగా పెరుగుతున్న సముద్రమట్టాలు... భూతాపం పెరగడం వల్ల ధృవాల్లో మంచుదుప్పట్లు కరుగుతుండడం, వాతావరణం వేడెక్కడం వల్ల సముద్ర జలాలు కూడా వేడెక్కి వ్యాకోచించడం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గ్లేసియర్లు కరుగుతుండటం వంటి పరిణామాల వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. 19012010 మధ్య ప్రపంచ వ్యాప్తంగా సముద్ర మట్టం సగటున 19 సెంటీమీటర్ల మేర పెరిగినట్లు వాతావరణ మార్పుపై ప్రపంచ సంఘం ఐదో అంచనా నివేదిక ఇటీవవల వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం.. 19012010 మధ్య కాలంలో ఏడాదికి సగటున 1.7 మిల్లీమీటర్ల చొప్పున సముద్ర మట్టం పెరిగినట్లు భావించవచ్చు. అయితే.. నిజానికి 19712010 మధ్య ఈ పెరుగుదల సగటున ఏడాదికి 2.0 మిల్లీమీటర్లుగా ఉంటే.. 19932010 మధ్య ఏడాదికి 3.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. అంటే.. గత రెండు దశాబ్దాల్లో సముద్రం మట్టం వేగంగా పెరిగినట్లు తేటతెల్లమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అలల కొలతల నివేదికలు, ఉపగ్రహాల పరిశీలనల ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించారు. ఇతర సముద్రాలతో పోలిస్తే 2003 నుండి ఉత్తర హిందూ మహాసముద్ర మట్టం రెండు రెట్లు ఎక్కువగా పెరిగిందని జర్నల్ ఆఫ్ జియోఫిజికల్ రీసెర్చ్ మేగజీన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం వెల్లడించింది. అంతకుముందు దశాబ్ద కాలంలో ఈ పెరుగుదల చాలా తక్కువగా ఉంది. ఉపగ్రహాల ద్వారా రెండున్నర దశాబ్దాల పాటు సేకరించిన సముద్ర ఉపరితల కొలతల సమాచారాన్ని విశ్లేషించి యూనివర్సిటీ ఆఫ్ హవాయి సీ లెవల్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ నిర్థారణకు వచ్చారు. సముద్రమట్టాల పెరుగుదల వల్ల ఇప్పటికే బంగ్లాదేశ్‌లో నాలుగో వంతు భూభాగం మునిగింది. చైనా, ఫిలిప్పీన్స్లలోని తీరప్రాంతాలు మునిగాయి. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా వద్ద రివర్ డెల్టా సుందర్వన్మడ అడవులు మునిగిపోయాయి. వందేళ్లలో విశాఖ సగం మునుగుతుంది..! ఈ శతాబ్దం చివరి నాటికి అంటే.. 2100 నాటికి ప్రపంచ వ్యాప్తంగా సముద్ర మట్టం కనిష్టంగా 28 సెంటీమీటర్ల నుంచి గరిష్టంగా 98 సెంటీమీటర్ల వరకూ పెరగవచ్చునని ఐపీసీసీ అంచనా. గ్రీన్ల్యాండ్మంచుదుప్పటి పూర్తిగా కరిగిపోయినట్లయితే సముద్ర మట్టం ఏకంగా 7 మీటర్లు పెరుగుతుంది. అదే జరిగితే లండన్నగరం సముద్రంలో మునుగుతుంది. సముద్ర మట్టం ఒక మీటరు పెరిగితే భారత తీరంలో 13,973 చదరపు కిలోమీటర్ల భూభాగం సముద్రంలో మునిగిపోతుందని.. అదే నీటి మట్టం ఆరు మీటర్లు పెరిగితే 60,497 చదరపు కిలోమీటర్ల భూమి సముద్రం పాలవుతుందని ఇటీవల జర్నల్ ఆఫ్ త్రెటెన్డ్ టాక్సా మేగజీన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం చెప్తోంది. ఆ అధ్యయనం ప్రకారం.. సముద్ర మట్టం ఒక మీటరు మేర పెరిగితే అంధ్రప్రదేశ్‌లోని గోదావరి కృష్ణా మడఅడవుల ప్రాంతం ముప్పావు భాగానికి పైగా మునిగిపోతుంది. పశ్చిమబెంగాల్లోని సుందరవనాలు సగానికి పైగా మునిగిపోతాయి. సముద్ర మట్టం ఆరు మీటర్లకు పైగా పెరిగితే గోదావరి కృష్ణా మడఅడవులు, సుందరవన్ మడఅడవులతో పాటు గుజరాత్‌లోని రాణ్ అఫ్ కచ్ చిత్తడి నేలలు సగానికి పైగా సముద్రగర్భంలో చేరతాయి. చిలికా సరస్సు, పులికాట్ సరస్సు సహా ఏడు రక్షిత ప్రాంతాలు సగానికి పైగా నీట మునుగుతాయి. సముద్రమట్టం పెరుగుదల వల్ల 2050 నాటికి భారత దేశంలో 4 కోట్ల మంది జనాభాకు ముప్పుగా పరిణమిస్తుందని ఐక్యరాజ్యసమితి పర్యావరణ నివేదిక గత ఏడాది హెచ్చరించింది. అందులోనూ ముంబై, కోల్‌కతా నగరాల ప్రజలకు ముంపు ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొంది. ఇక రాబోయే వందేళ్లలో దేశంలోని కోల్‌కతా, ముంబై, కొచ్చిన్, విశాఖపట్నం తదితర తీరప్రాంత నగరాలు సముద్ర ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని వాతావరణ, సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భారత తీర ప్రాంతాల్లోని పెద్ద నగరాల్లోకెల్లా కోల్‌కతా వద్ద సముద్రమట్టం ఎక్కువగానే కాదు.. వేగంగానూ పెరుగుతోంది. అక్కడ సముద్రమంట్టం పెరుగుదల 5.74 మిల్లీమీటర్లుగా నమోదైంది. అందువల్ల మిగిలిన అన్ని నగరాలకంటే ఎక్కువగా కోల్‌కతా నగరం దెబ్బతింటుంది. ఆ తర్వాత దెబ్బతినే పెద్ద నగరాల్లో కొచ్చిన్ రెండో స్థానంలో ఉంది. అక్కడ సముద్రమట్టం ఏటా 1.75 మిల్లీమీటర్ల ఎత్తు పెరుగుతోంది. ఇక 1.25 మిల్లీమీటర్ల పెరుగుదలతో ముంబై మహా నగరం మూడో స్థానంలో ఉంటోంది. ఆంధ్రప్రదేశ్‌లోని తీర నగరం విశాఖపట్నంలో సముద్రమట్టం 1.09 మిల్లీమీటర్ల మేర పెరుగుతోంది. ఇది దేశంలో సముద్ర ముంపు ప్రమాదమున్న నాలుగో నగరం. మొత్తంమీద ప్రిసైస్ రీజనల్ క్లైమేట్ మోడల్ సూచిక ప్రకారం భారతదేశపు సముద్రమట్టాలు సంవత్సరానికి సగటున 1.30 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతున్నాయి. భూతాపం 2 డిగ్రీలు పెరిగినట్టయితే సముద్ర కెరటాలు 4.7 మీటర్లకు పెరిగే అవకాశం ఉంది. అదే భూతాపం 4 డిగ్రీలు పెరిగితే సముద్రం 9 మీటర్ల వరకు ఎగస్తుంది. తూర్పు తీరానికే ముప్పు ఎక్కువ... భారతదేశంపై సముద్ర మట్టం పెరుగుదల ప్రభావం గురించి ఇటీవల రాజ్యసభలో ఒక సభ్యుడు ప్రశ్న వేయగా.. కేంద్ర భూగోళశాస్త్రాల శాఖ మంత్రి జవాబు ఇచ్చారు. ఈ అంశంపై అనేక అధ్యయనాలు నిర్వహిస్తున్నామని.. సముద్ర మట్టం పెరుగుదల ప్రభావం పశ్చిమ తీరం కన్నా.. లోతట్టు ప్రాంతంలో ఉన్న తూర్పు తీరం మీద ఎక్కువగా ఉంటుందని, తీర ప్రాంతాలు వరద ముంపుకు గురవడం పెరుగుతుందని పేర్కొన్నారు. గత పాతికేళ్ల అధ్యయనం ప్రకారం భారత తీర ప్రాంతం కోతకు గురయ్యే స్వభావం 38.5 శాతంగా ఉందన్నారు. ఈ కోతను అరికట్టడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం సాంకేతిక సహకారం అందిస్తోందని వివరించారు. ఉన్న మంచంతా కరిగిపోతే..? మన భూగోళం మీద ప్రస్తుతం దాదాపు యాబై లక్షల ఘనపు మైళ్ల మంచు ఉంది. అది మొత్తం కరిగిపోతే సముద్రమట్టం 230 అడుగుల మేర పెరుగుతుంది. ఇందులో అత్యధిక మంచు అంటార్కిటికా, గ్రీన్ల్యాండ్లలోనే కేంద్రీకృతమై ఉంది. భారతదేశం కన్నా రెట్టింపు పరిమాణంలో విస్తరించి ఉన్న అంటార్కిటికా మొత్తాన్నీ ఒక మైలు మందం ఉన్న మంచు దుప్పటి కప్పి ఉంది. అది కరిగిపోతే సముద్ర మట్టం 200 అడుగులు పెరుగుతుంది. అందులో చాలా మంచు ప్రస్తుతానికి స్థిరంగానే ఉన్నప్పటికీ.. పశ్చిమ అంటార్కిటికా మంచు దుప్పటి కూలిపోయే దశకు చేరుకుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది కరిగి సముద్రంలో కలిస్తే సముద్ర మట్టం 11 అడుగులు పెరుగుతుంది. ఇక గ్రీన్‌ల్యాండ్‌లో విస్తరించివున్న మంచు మొత్తం కరిగితే 23 అడుగుల మేర సముద్ర మట్టం పెరుగుతుంది. ఇది వేగంగా కరిగిపోతుండటం ఆందోళనకరంగా మారింది. అంటార్కిటికా, గ్రీన్ల్యాండ్లు కాకుండా మిగతా మంచు అంతా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో గల గ్లేసియర్లు, మంచు కొండల్లో ఉంది. భూతాపం పెరుగుతున్న కొద్దీ ఆ మంచు కూడా కరగడం పెరుగుతోంది. భూమి మీదున్న మంచు మొత్తం కరిగిపోతే చాలా దేశాల సముద్ర తీర ప్రాంతాలు మునిగిపోతాయి. వాటి రూపురేఖలు మారిపోతాయి. కొన్ని దేశాలకు దేశాలే.. అందులోనూ సముద్రాల మధ్య ఉండే ద్వీప దేశాలు నీటిపాలవుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మంచంతా కరిగిపోయి సముద్ర మట్టం పెరిగిపోతే వివిధ ఖండాల రూపురేఖలు ఎలా మారతాయో అంచనాలతో మ్యాపులు తయారు చేశారు. అందులో ఆసియా ఖండం మ్యాపు ఇది. దీనిప్రకారం.. చైనాలో అరవై కోట్ల మంది నివసించే ప్రాంతం నీట మునుగుతుంది. 16 కోట్ల మంది జనాభా గల బంగ్లాదేశ్ మొత్తం సముద్రగర్భంగా మారుతుంది. భారతదేశ తీర ప్రాంతాన్ని చాలా వరకూ సముద్రం కబళిస్తుంది. గుజరాత్ సగమే మిగులుతుంది. అది కూడా ఒక దీవిగా మారుతుంది. పశ్చిమ తీరం కన్నా తూర్పు తీరం ఎక్కువగా మునిగిపోతుంది. కోల్‌కతా నుంచి కన్యాకుమారి వరకూ చాలా ప్రాంతం అదృశ్యమవుతుంది. పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు చాలా వరకూ నీటిపాలవుతాయి. భూమి కూడా నిస్సారమవుతుంది..! చివరి మంచు యుగం పది వేల ఏళ్ల కిందట ముగిసింది. అప్పుడు సముద్ర మట్టాలు పెరగడం మొదలైనపుడు భూమి మీద కేవలం 50 లక్షల మంది మనుషులు మాత్రమే ఉన్నారు. వాళ్లు సముద్ర తీరాల వెంట భారీ నగరాల్లో నివసించలేదు. కాబట్టి సముద్రమట్టాల పెరుగుదల ఇంతవరకూ మానవాళి మీద తీవ్ర ప్రతికూల ప్రభావమేమీ చూపలేదు. కానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సముద్ర తీరాల్లో భారీ నగరాలు నిర్మితమయ్యాయి. కోట్లాది మంది తీర ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. సముద్రమట్టం నాలుగు అడుగులు పెరిగితే ఒక్క భారతదేశంలోనే 50 వేల మంది జీవితాలు ముంపుబారిన పడతాయి. సముద్ర మట్టాల పెరుగుదల వల్ల తీర ప్రాంతాలు మునగడమే కాదు.. తుఫానులు భూభాగంలోకి మరింత దూరం చొచ్చుకురావడం, తీర ప్రాంతాలకు దగ్గరగా ఉన్న సారవంతమైన పంటభూముల కిందకు ఉప్పునీరు చేరి అవి నిరుపయోగంగా మారడం వంటి పరినామాలూ సంభవిస్తాయి. సముద్రమట్టం పెరగడానికి కారణాలేమిటి..? కరుగుతున్న మంచుఖండాలు: భూగోళం ఉష్ణోగ్రత పెరగడాన్ని భూతాపం (గ్లోబల్‌వార్మింగ్)గా అభివర్ణిస్తున్నారు. భూగోళం ఉష్ణోగ్రత పారిశ్రామికీకరణ ముందు నాటికన్నా ఇప్పడు 1 డిగ్రీ సెల్సియస్పెరిగింది. దీనివల్ల ధృవప్రాంతాల్లోని మంచు ఖండాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న గ్లేసియర్లు కరుగుతూ ఆ నీరు సముద్రాల్లోకి వచ్చి చేరుతోంది. వాతావరణంలో కర్బన శాతం పెరగడం ఇప్పటి రీతిలోనే కొనసాగితే.. ప్రస్తుతం 14.5 డిగ్రీల సెల్సియస్‌గా ఉన్న సగటు ఉష్ణోగ్రత కొన్నేళ్లలో 27 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగే అవకాశం ఉందని.. దానివల్ల భూమి మీద ఉన్న మంచు మొత్తం పూర్తిగా కరిగిపోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే సముద్ర మట్టం 230 అడుగుల మేర పెరుగుతుంది. అయితే.. భూమి మీదున్న మంచంతా కరిగిపోవడానికి మరో ఐదు వేల సంవత్సరాల సమయం పడుతుందని ఇంకొందరు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరుగుతున్న సముద్రజలాలు..: మన ఇంట్లో పొయ్యి మీద కాచే నీళ్లు మరుగుతున్నప్పుడు అవి పైపైకి ఎగసిరావడం మనకు తెలుసు. అలాగే భూ వాతావరణం వేడెక్కడం వల్ల సముద్ర జలాలు కూడా వేడెక్కడం పెరుగుతోంది. వాతావరణ మార్పు వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతలో 90 శాతాన్ని సముద్ర జలాలే స్వీకరిస్తున్నాయి. ఫలితంగా.. థర్మామీటర్లో పాదరసం వేడికి వ్యాకోచించినట్లుగానే సముద్ర జలాలు కూడా వేడికి వ్యాకోచిస్తున్నాయి. దానివల్ల కూడా ఆ జలాలు పైకి ఎగసివస్తున్నాయి. సముద్ర మట్టాల పెరుగుదలలో మూడో వంతు కారణం ఇదేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనినే ‘థర్మల్ఎక్స్పాన్షన్’ అని వ్యవహరిస్తున్నారు. నివారించడానికి ఏం చేయాలి..?: ఇప్పటికే భారీ మొత్తంలో కర్బనవాయువులు వాతావరణంలో చేరిపోయాయి.. వాటిని తగ్గించడం దాదాపు అసాధ్యం. ప్రస్తుత పారిశ్రామిక రంగం పరిస్థితులను బట్టి ఈ వాయువులు ఇంకా పెరగడం ఖాయం. అంటే మున్ముందు మంచు కరగడం, సముద్ర మట్టాలు పెరగడం అనివార్యం. కాకపోతే.. ఆ పెరుగుదల వేగాన్ని తగ్గించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అందుకోసం ముఖ్యంగా భూతాపం పెరగకుండా చర్యలు చేపట్టాలి. వాతావరణంలో కర్బన వాయువుల విడుదలను తగ్గించాలి. అడవులు, చెట్లు విరివిగా పెంచాలి. పారిశ్రామిక వ్యర్థాల వల్ల సముద్రంలో సైటో ప్లాంగ్టన్ మొక్కలు చనిపోకుండా చూడాలి. (సాక్షి నాలెడ్జ్సెంటర్)