ప్రమాదవశాత్తూ కాలు జారి బాహుదా నదిలో పడి గల్లంతైన డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు.
మదనపల్లె (చిత్తూరు) : ప్రమాదవశాత్తూ కాలు జారి బాహుదా నదిలో పడి గల్లంతైన డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన చిత్తూరు మదనపల్లె మండలం నిమ్మనపల్లెలో మంగళవారం చోటుచేసుకుంది. మండలంలోని కొండయ్యగారిపల్లికి చెందిన సోమశంకర్(19) మదనపల్లెలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
ఈ క్రమంలో మంగళవారం కళాశాలకు వెళ్లడానికి నిమ్మనపల్లె వద్ద బస్సు ఎక్కేందుకు బాహుదా నదిని దాటే క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన స్థానికులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. సమీపంలోని ముదోల్‌మర్రి గ్రామంలోని ఇసుక దిబ్బల వద్ద మృతదేహమై కనిపించాడు.