పోకిరీల రాంగ్‌కాల్స్ ఓ డిగ్రీ విద్యార్థిని బలిగొన్నాయి.
పాపన్నపేట: పోకిరీల రాంగ్‌కాల్స్ ఓ డిగ్రీ విద్యార్థిని బలిగొన్నాయి. వివరాలు... మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లికి చెందిన మెట్టు నారాయణ రెండో కుమార్తె మెదక్‌లోని శ్రీనివాస్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫస్టియర్ చదువుతోంది. రెండు నెలలుగా ఆమె సెల్‌కు రాంగ్‌కాల్స్ వస్తున్నాయి. సిమ్ మార్చినా వాటి బెడద తగ్గలేదు. దీంతో కలత చెందిన రాధిక గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుంది.