Wrong calls
-
వాట్సాప్‌లో రాంగ్ కాల్స్ వస్తున్నాయా? జరభద్రం గురూ..!
భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా స్కామ్ చేసేవారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఒకప్పుడు సాధారణ కాల్స్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు అమాయక ప్రజలను మోసం చేసి డబ్బు గల్లంతు చేసేవారు. అయితే ఇప్పుడు వారు ట్రెండ్ మార్చేసి వాట్సాప్ కాల్స్ ద్వారా మోసం చేయడం ప్రారంభించేసాఋ. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా ఫిర్యాదులు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల కొంత మంది స్కామర్లు వాట్సాప్ ద్వారా అంతర్జాతీయ నెంబర్స్ నుంచి కాల్స్ చేస్తున్నారు. దేశం కోడ్ +84 నుంచి వాట్సాప్ కాల్స్ వస్తున్నాయని కంప్లైంట్స్ వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారులను మోసం చేయడానికి స్కామర్లు కనిపెట్టిన ఓ కొత్త మార్గమే వాట్సప్ కాల్స్. +84 అనేది వియాత్నం దేశం కోడ్ కాగా, +62 అనేది ఇండోనేషియా కోడ్, ఇక్కడ మరో నెంబర్ +223 (ఇది మాలి కోడ్). ఈ కోడ్స్ కలిగిన నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి. వినియోగదారుడు ఇప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైపోయింది. ఈ నెంబర్స్ నుంచి వస్తున్న కాల్స్ నిజంగా ఆదేశం నుంచి వస్తున్నాయా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి మోసాలకు పాల్పడే వ్యక్తులు ఆన్లైన్లో వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ నెంబర్ (VoIP) కొనుగోలు చేస్తారని ఒక నివేదిక వెల్లడించింది. @WhatsApp I'm receiving spam calls. Please take stringent action. Atleast alert suspected #spam pic.twitter.com/BgxaJ2WKfd — I Bichewar (@IBichewar) April 11, 2023 ఈ స్పామ్ కాల్స్ గురించి V4WEB సైబర్ సెక్యూరిటీ వ్యవస్థాపక డైరెక్టర్ 'రితేష్ భాటియా' మాట్లాడుతూ.. VoIP నెంబర్ కొనుగోలు చేయడం చాలా సులభమని, ఆయా దేశాల నుంచే వాట్సాప్ యాక్టివేట్ చేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపాడు. ఈ విధంగా యాక్టివేట్ చేసుకున్న తరువాత ప్రపంచంలో ఉన్న ఏ వినియోగదారునినైనా లక్ష్యంగా చేసుకోవచ్చని వివరించారు. @Cyberdost @TRAI these are two missed calls which I got on WhatsApp. Look like scammers.. 35minutes ago is today on 11th April. I blocked them and reported as spam on WhatsApp. Why are we seeing so many missed calls from these criminals. @BlrCityPolice pic.twitter.com/znQ1PL9HHa — Kuchkaamkaro (@Dheren14873751) April 11, 2023 ఇలాంటి రాంగ్ కాల్స్ చాలా మందికి వచ్చాయి, ఇప్పటికీ వస్తూనే ఉన్నాయని కొంత మంది సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. అంతర్జాతీయ నెంబర్ నుంచి వచ్చే వాట్సప్ కాల్స్ మోసపూరితమైనవి కావున ఎవరూ వాటిని రిసీవ్ చేయవద్దని సలహా ఇస్తున్నాము. ఇలాంటి వాటిని నిలువరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేటెస్ట్ టెక్నాలజీ, డేటా సైన్టిస్టులు, సంబంధిత నిపుణులను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయని, భవిష్యత్తులో ఇలాంటి కాల్స్ రాకుండా చూడటానికి చర్యలు జరుగుతున్నట్లు వాట్సాప్ ప్రతినిథి వెల్లడించారు. Getting lots of Whatsapp audio spam calls recently. Anybody else facing the same problem? +84 38 341 6618 is the recent one. — Pradeep 🇮🇳 (@nameisvp) April 10, 2023 ఇటీవల ఈ స్పామ్ కాల్స్ గురించి వివరిస్తూ.. ట్విట్టర్లో శ్రేయన్ష్ జైన్ అనే వ్యక్తికి ఒక ఇంటర్నేషనల్ కాల్ వచ్చిందని, అందులో ప్రిసిల్లా బారెట్ అనే పేరుతో HRగా పరిచయం చేసుకున్నారని, ఆ తరువాత పార్ట్ టైమ్ ఉద్యోగం చేయవచ్చని.. దీనికి యూట్యూబ్ వీడియోను లైక్ చేయాలనీ, ఒక్కో లైక్‌కు రూ. 50 వస్తుందని, ఇలా మీరు రోజుకి రూ. 10,000 కంటే ఎక్కువ సంపాదించవచ్చని చెప్పినట్లు తెలిపాడు. ఇదీ చదవండి: నిండా పాతికేళ్లు కాలేదు రూ. 100 కోట్లు సంపాదన - అతనేం చేస్తున్నాడో తెలుసా? ఇలాంటి మోసాలకు ఎవరూ బలి కాకుండా ఉండాలంటే రాంగ్ నెంబర్ నుంచి వచ్చే వాట్సాప్ కాల్స్ స్వీకరించవద్దని తెలియజేస్తున్నాము. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
రాంగ్ కాల్ రోమియోలు.. మెసేజ్‌లు, ఫొటోలు
కావలికి చెందిన దేవి (పేరు మార్చాం)కి చెందిన ఫోన్ నంబరుకు నెల రోజులుగా వాట్సాప్‌లో ఓ నంబరు నుంచి అసభ్యకరమైన సందేశాలు వస్తున్నాయి. మెసేజ్‌లతో పాటు అశ్లీల వీడియోలు, ఫొటోలు పంపిస్తున్నాడు. ఆ మెసేజ్‌లు చూసి ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెంది వాట్సాప్ మేసేజ్‌ల వేధింపులపై కావలి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించకపోవడంతో మెసేజ్‌లు కొనసాగుతున్నాయి. నెల్లూరు నగరంలోని భక్తవత్సలనగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఫోన్ నంబర్‌కు వాట్సాప్‌లో అసభ్యకరమై సందేశాలు వచ్చాయి. దీంతో ఆమె తన కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు ఆమెనే అనుమానించి వేధించడం ప్రారంభించారు. నువ్వు వాడికి తెలియకపోతే నీ నంబరు ఎలా తెలుస్తుంది.. నీకెలా అంత ధైర్యంగా పంపిస్తాడంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు. సంతోషంగా సాగిపోతున్న ఆమె కుటుంబంలో కలతలు చోటు చేసుకోవడంతో ఆమె మానసికంగా నరకాన్ని చవిచూస్తోంది. ఎవరో చేసిన తప్పుకు ఆమె శిక్ష అనుభవిస్తోంది. సాక్షి, నెల్లూరు: మహిళలకు ఇంటా.. బయటే కాదు.. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలోనూ భద్రత లేకుండా పోతోంది. సంతోషంగా సాగిపోతున్న కుటుంబాల్లో రాంగ్ కాల్ చిచ్చు రగులుతోంది. కాపురాలు కూలిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. పోకిరీలు మహిళలను టార్గెట్ చేసి వారిని లొంగదీసుకునేందుకు ‘మిస్డ్ కాల్’ వలలు విసురుతున్నారు. మహిళల అభద్రతాభావాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఫేక్ ఐడీలతో సిమ్‌లు సేకరిస్తున్నారు. ఏదొక నంబర్లకు కాల్ చేస్తున్నారు. ఎవరిదో మిస్డ్ కాల్ వచ్చిందని తిరిగి చేస్తే.. అది మహిళ గొంతు అయితే రాంగ్ కాల్ వచ్చిందంటూ మాటలు కలుపుతున్నారు. ఆ నంబర్లకు వాట్సాప్ ఆప్షన్ ఉంటే.. దానికి అశ్లీల ఫొటోలు, వీడియోలు పంపిస్తున్నారు. వీరి మెసేజ్‌లకు ఎవరైనా తిరిగి రెస్పాండ్ అయితే.. ఆ మెసేజ్‌లను అడ్డం పెట్టుకునిబ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఫోన్ నంబర్ల ఆధారంగా వాట్సాప్, ఫేస్‌బుక్‌లోని కుటుంబ సభ్యులతో ఉన్న ఫొటోలు సేకరించి, వాటి ద్వారా అశ్లీల వీడియోలు, ఫొటోలుగా మార్ఫింగ్ చేసి వారికే పంపించి ఆర్థికంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై చాలా వరకు పోలీస్స్టేషన్లకు వెళ్లడం లేదు. వీలైనంత వరకు సిమ్ నంబర్లు మార్చేసుకోవడం, ఖాతాలను బ్లాక్ చేసుకోవడం చేస్తున్నారు. కూలిపోతున్న కాపురాలు.. కుటుంబాల్లో కలతలు రాంగ్ కాల్ రోమియోలు చేష్టలకు కొన్ని కుటుంబాల్లో కలతలు చోటు చేసుకుంటుంటే.. మరి కొన్ని కాపురాలు కూలిపోతున్నాయి. ఇందుకు ఉదాహరణే.. నెల్లూరు భక్తవత్సలనగర్ ప్రాంతానికి చెందిన మహిళ ఉదంతం. ఇంకా వెలుగుచూడని ఘటనలు ఎన్నో ఉన్నాయి. అశ్లీల వీడియోలు, చిత్రాలతో మహిళలను మానసికంగా కుంగిపోయేలా చేస్తున్నారు. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలోకి నెట్టేస్తున్నారు. కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్తే ఎక్కడ అపార్థం చేసుకుంటే.. ఏ పరిస్థితులకు దారి తీస్తాయో అనే భయంతో కుమిలిపోతున్నారు. ఈ పోకిరీల వలలో పడి కొందరు మహిళలు మోసపోయి జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. వేధించడానికి ఆయుధంగా.. తమను ఇబ్బంది పెట్టిన మహిళలను వేధించడానికి కూడా కొందరు ఆయుధంగా వాడుకుంటున్నారు. కావలి మహిళకు పంపుతున్న మెసేజ్‌లు చూస్తుంటే.. ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టడానికే అన్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల ఆమె భూవివాదం విషయంలో నెల్లూరుకు చెందిన ఓ టీడీపీ నేతతో పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఇలాంటి మెసేజ్‌లు రావడంతో ఆ చోటా టీడీపీ నేతే తనను టార్గెట్ చేసి, వాట్సాప్‌లో అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలు పంపిస్తున్నట్లు అనుమానిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలీసులకు చెప్పినా.. మహిళల భద్రత విషయంలో ఇప్పటికే ఎన్నో చట్టాలు ఉన్నాయి. దేశంలోనే ఎక్కడ లేని విధంగా దిశ చట్టాన్ని తీసుకువచ్చింది. కానీ మహిళలపై ఇలాంటి వేధింపుల విషయంలో పోలీసులు ఏ మాత్రం కఠిన చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా కావలికి చెందిన దేవి వాట్సాప్‌లో వేధింపుల విషయంలో గత డిసెంబర్ 10న ఫిర్యాదు చేసింది. కానీ స్థానిక పోలీసులు విచారణ కూడా చేపట్టకపోగా ఆ నంబర్‌ను బ్లాక్ చేసుకోమని ఉచిత సలహా ఇచ్చారు. పోలీసుల ప్రవర్తన వల్ల మహిళలు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయలేకపోతున్నారు. ఏటా మహిళలపై వేధింపుల ఫిర్యాదులు తగ్గుతున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నా వాస్తవంగా పోలీసుల తీరుపై నమ్మకం లేక వెలుగులోకి తేలేకపోతున్నారు. -
ఓ ఊరిని గడగడలాడించిన వెల్డర్..!
సిటీకి చెందిన ఓ వెల్డర్ మెదక్ జిల్లాలోని ఓ గ్రామాన్ని హడలెత్తించాడు. అక్కడి మాజీ సర్పంచ్ సహా 15మంది పెద్ద మనుషులను భయాందోళనకు గురిచేశాడు. సెకండ్‌హ్యాండ్ సెల్‌ఫోన్ కొనుగోలు చేసిన అతడు.. అందులో దొరికిన సిమ్‌కార్డును వేసి బెదిరింపుల పర్వానికి దిగాడు. అసలు ఎందుకీ పని చేశాడని పోలీసులు విచారించగా ఆసక్తికరమైన అంశం వెలుగుచూసింది. సదరు గ్రామానికి చెందిన ఇతగాడి భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లగా, అక్కడి పెద్ద మనుషులు ఆమెకు మద్దతుగా నిలిచారు. దీనికే పగ పెంచుకున్న వెల్డర్ వారందరినీ ముప్పుతిప్పలు పెట్టాడు. సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ వెల్డర్ మెదక్ జిల్లాలోని ఓ ఊరిని గడగడలాడించాడు... ఇతడి ఫోన్ బారినపడిన వారిలో ఆ ప్రాంతానికి చెందిన మాజీ సర్పంచ్‌తో దాదాపు 15 మంది పెద్ద మనుషులు ఉన్నారు... కొన్ని నెలల పాటు వారికి నరకం ‘వినిపించాడు’.. తనతో గొడవపడిన భార్యకు ఆ ఊరంతా మద్దతుగా నిలవడమే ఇందుకు కారణం...చివరకు అతను దీన్‌దయాళ్‌నగర్‌లో ఉన్న సమీప బంధువునూ టార్గెట్‌గా చేసుకున్నాడు... ఈ కేసు దర్యాప్తు చేసిన సనత్‌నగర్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి సోమవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. సనత్‌నగర్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తన భార్యకు వత్తాసు పలికారనే... సనత్‌నగర్ ఠాణా పరిధిలోని దీన్‌దయాల్‌నగర్‌లో ఉంటున్న కె.విజయ్ కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి స్థానికంగా ఉన్న ఇంజినీరింగ్ కంపెనీలో వెల్డర్‌గా పని చేస్తున్నాడు. అతను మెదక్ జిల్లా, అల్లాదుర్గ్ సమీపంలోని గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకే వీరి మధ్య స్పర్థలు తలెత్తడంతో విజయ్ భార్యను వేధించడం మొదలెట్టాడు. దీంతో ఆమె తన గ్రామానికి చెందిన పెద్దల మధ్య పంచాయితీ పెట్టింది. అప్పటి సర్పంచ్, పెద్ద మనుషులు పలుమార్లు అతడిని పిలిపించి మాట్లాడారు. అయినా అతడి వ్యవహారశైలిలో మార్పు రాకపోవడంతో మరోసారి పిలిచి గట్టిగా మందలించారు. దీంతో విజయ్ ఆ గ్రామంలో ఉన్న నాటి సర్పంచ్‌తో పాటు పెద్దలపై కక్షకట్టాడు. దొరికిన సిమ్‌కార్డు వాడేసుకుని... ఈ గ్రామానికి చెందిన వారిపై ఎలా కక్ష తీర్చుకోవాలని ఆలోచిస్తున్న విజయ్‌కి కొన్నాళ్ల క్రితం సనత్‌నగర్ ప్రాంతంలో ఓ సిమ్‌కార్డు దొరికింది. దీనిని తనకు అనువుగా మార్చుకోవాలనుకున్న అతను ఓ సెకండ్‌హ్యాండ్ ఫోన్ ఖరీదు చేశాడు. ఇందులో ఆ సిమ్‌కార్డు వేసి తన ‘పని’ ప్రారంభించాడు. తన భార్య ఊరికి చెందిన మాజీ సర్పంచ్‌తో పాటు పెద్ద మనుషుల ఫోన్ నెంబర్లను సేకరించాడు. వాటికి కాల్స్ చేస్తూ తొలుత మహిళ మాదిరిగా మాట్లాడేవాడు. ఆపై అసలు గొంతుతో మాట్లాడుతూ చెప్పనలవి కాని భాషలో దూషించేవాడు. ఎవరైనా ఫోన్లు ఎత్తకపోతే వారికి సంక్షిప్త సందేశాలు పంపేవాడు. విజయ్ దెబ్బకు ఆ గ్రామానికి చెందిన దాదాపు 15 మంది హడలెత్తిపోయారు. ఏ వేళలో పడితే ఆ వేళలో ఫోన్లు మోగడం, ఎత్తితే అన్ని భాషల్లోనూ దూషణలు వినిపించడంతో ఓ దశలో ఏం చెయ్యాలో పాలుపోక అవస్థలు పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో విజయ్ టార్చర్‌ను భరించారు. సమీప బంధువు ఫిర్యాదుతో... ఇదిలా ఉండగా సనత్‌నగర్ ప్రాంతానికే చెందిన విజయ్ సమీప బంధువు కూడా ఓ దశలో అతడికి టార్గెట్‌గా మారాడు. రాజకీయ పార్టీల కోసం తిరగకుండా పద్దతిగా ఉండమని మందలించిన పాపానికీ అతడి పైనా విజయ్ ‘ఫోన్ కట్టాడు’. సమీప బంధువుతో పాటు అతడి భార్య, ఇద్దరు కుమారులకు ఫోన్లు చేస్తూ తిట్టడం మొదలెట్టాడు. ఈ బాధ భరించలేక అతను గత నెలలో సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సందర్భంలోనూ ఇతడి వెన్నంటే వచ్చిన విజయ్... ఠాణా నుంచి బయటకు రాగానే ‘నా మీద పోలీసులకు ఫిర్యాదు చేసి వస్తున్నావా? నీ అంతు చూస్తా’ అంటూ బెదిరింపు ఎస్సెమ్మెస్ పంపాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోన్ నెంబర్ ఆధారంగా ఆరా తీయగా అది కర్నూలుకు చెందిన వ్యక్తి పేరుతో ఉన్నట్లు తేలింది. అతడి సంప్రదించగా తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. దీంతో సాంకేతికంగా ముందుకు వెళ్లిన అధికారులు నిందితుడు విజయ్‌గా గుర్తించారు. సోమవారం నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. విచారణ నేపథ్యంలో తన సమీప బంధువు తనను పార్టీ మారమంటూ ఒత్తిడి చేయడంతోనే కక్షకట్టానంటూ చెప్పుకొచ్చాడు. -
నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి : శివస్వామి
టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ శైవక్షేత్రంపై దాడులు చేస్తున్నారు శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి విజయవాడ : ప్రభుత్వం నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి చెప్పారు. దేవాలయాల కూల్చివేతను నిరసిస్తూ ధర్మపరిరక్షణ సమితి ఆధ్వర్యాన విజయవాడ ధర్నాచౌక్‌లో చేపట్టిన రిలేనిరాహారదీక్ష శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించి మద్దతు ప్రకటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. టీడీపీకి చెందిన తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ పది రోజులుగా శైవక్షేత్రంపై దాడులుచేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. తాను వ్యతిరేకంగా మాట్లాడుతున్నానంటూ శైవక్షేత్రానికి రూ.80 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్డు పనులను అర్ధాంతరంగా నిలిపివేశారని చెప్పారు. అధికారం ఉందికదా అని ఏం చేసినా ఫర్వాలేదని ఎమ్మెల్యే విర్రవీగుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని ఇబ్బందులు వచ్చిన హిందూ ధర్మపరిరక్షణకు వెనుకడుగు వేసిది లేదని తేల్చిచెప్పారు. నెలరోజులు గడిచినా దేవాలయాల కూల్చివేతపై మఠాధిపతులు, పీఠాధిపతులకు మంత్రుల కమిటీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అమలు కాలేదన్నారు. ప్రభుత్వానికి మరో రెండు రోజులు గడువిస్తున్నామని, ఈలోగా సమస్య పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని శివస్వామి స్పష్టంచేశారు. శనివారం నగరంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే పుష్కరాలకు ఆధ్యాత్మిక సేవల సహాయ నిరాకరణ చేస్తామని హెచ్చరించారు. రిలేనిరాహారదీక్షలో ధర్మపరిరక్షణ సమితి అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు పి.వి.స్వామి నాయుడు, మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
డిగ్రీ విద్యార్థిని ప్రాణం తీసిన రాంగ్ కాల్స్
పాపన్నపేట: పోకిరీల రాంగ్‌కాల్స్ ఓ డిగ్రీ విద్యార్థిని బలిగొన్నాయి. వివరాలు... మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లికి చెందిన మెట్టు నారాయణ రెండో కుమార్తె మెదక్‌లోని శ్రీనివాస్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫస్టియర్ చదువుతోంది. రెండు నెలలుగా ఆమె సెల్‌కు రాంగ్‌కాల్స్ వస్తున్నాయి. సిమ్ మార్చినా వాటి బెడద తగ్గలేదు. దీంతో కలత చెందిన రాధిక గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుంది.