అనంతపురం అర్బన్ : ఇంట్లో ఎవరూ లేని సమయంలో డిగ్రీ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అనంతపురం పట్టణంలోని వేణుగోపాల్ నగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక వీరుగంటి వీధిలో నివాసముంటున్న నందిని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడింది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.