పోలీస్‌స్టేషన్‌లో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
Published Sat, Jul 9 2016 4:07 PM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
లక్కిరెడ్డిపల్లె: వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లెలో డిగ్రీ విద్యార్థి పోలీస్ స్టేషన్‌లోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలు.. లక్కిరెడ్డిపల్లె మండలం పాలెంగొల్లపల్లి గ్రామానికి చెందిన జగన్నాథనాయుడు రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం జగన్నాథనాయుడు, అతని స్నేహితుల మధ్య గొడవైంది. దాంతో ప్రత్యర్థి వర్గానికి చెందిన విద్యార్థులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరించారు. కేసు లేకుండా ఉండాలంటే రూ. 30 వేలతో రాజీ కుదుర్చుకోవాలన్నారు.
ఈ వ్యవహారమంతా లక్కిరెడ్డిపల్లె పోలీస్ స్టేషన్ లో జరిగింది. దాంతో మనస్థాపానికి గురైన జగన్నాథనాయుడు వాస్మోల్ తాగి స్టేషన్‌లోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన పోలీసులు అతణ్ణి స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్‌కు తరలించారు.
Advertisement
Advertisement