అనంతపురం న్యూసిటీ : అనంతపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదివే జె.మహేశ్(20) బీఎస్సీ విద్యార్థి రైలు కింద పడి శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైలు వెళ్లే సమయంలో దూరడంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మరణించినట్లు చెప్పారు. మృతుని జేబులో పరిశీలించగా హాల్ టికెట్ లభ్యమైందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.