గుంటూరు (మాచర్ల) : మాచర్ల మండలం విజయపురిసౌత్ గ్రామంలోని ఏపీ గురుకుల కళాశాల సమీపాన ఉన్న ఓ గ్రౌండ్‌లో శుక్రవారం ఉదయం తోటి స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ఓ విద్యార్థికి తీవ్రగుండెపోటు వచ్చింది. సదరు విద్యార్థిని దగ్గర్లోని కమలానెహ్రు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ విద్యార్థి శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు. చనిపోయిన విద్యార్థి పి.వెంకటేశ్(20) ఆంధ్రప్రదేశ్ గురుకుల కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతని స్వస్థలం శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం చెన్నాపురం గ్రామం.