Degree student died
-
ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థుల దాడి.. డిగ్రీ స్టూడెంట్ మృతి
సాక్షి, మంచిర్యాల: ర్యాగింగ్ను నివారించటానికి ప్రభుత్వాలు, విద్యాసంస్థల వంటివి ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎక్కడోచోట ర్యాగింగ్ ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో సీనియర్ విద్యార్థులు రెచ్చిపోతున్నారు. జూనియర్ విద్యార్థులపై పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణలో ర్యాగింగ్ భూతం మళ్లీ జడలు విప్పుతోంది. తాజాగా ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థులు దాడి చేయడంతో డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మందమర్రి మండలం పొన్నారం గ్రామంలో ఎస్సీ హాస్టల్లో కామెర ప్రభాస్ అనే విద్యార్థి బీకాం కంప్యూటర్స్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం రాత్రి సమయంలో తోటి విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడ్డారు. వేధిస్తూ, దాడి చేయడంతో డిగ్రీ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. -
డిగ్రీ విద్యార్థిని బలవన్మరణం
జడ్చర్ల : వార్షిక పరీక్ష ఫీజు చెల్లించలేదని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని కోడ్గల్లో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సత్యమ్మ, శేఖర్ దంపతుల కూతురు అలివేలు(19) జడ్చర్లలోని బీఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతుంది. అయితే శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కూతురిని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనై శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే డిగ్రీ వార్షిక పరీక్ష ఫీజు చెల్లించలేకే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే అలివేలు ఆత్మహత్యకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ బాలరాజుయాదవ్ తెలిపారు. -
ఆర్థిక ఇబ్బందులు తాళలేక డిగ్రీ విద్యార్థిని మృతి
పాశర్లపూడి వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య రాజోలు : ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల తలెత్తున్న గొడవలతో మనస్తాపానికి గురై కడలి గ్రామానికి చెందిన అప్పారి భవాని (19) పాశర్లపూడి వైనతేయ గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై లక్ష్మణరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భవాని మామిడికుదురు దీప్తి కళాశాలలో బీఏ చదువుతోంది. శనివారం ఉదయం కళాశాలకు వెళ్లిన భవాని పాశర్లపూడి వెళ్లి బోడసకుర్రు వంతెన మీద నుంచి గోదావరిలో దూకింది. దీంతో స్థానికులు భవాని కళాశాల గుర్తింపు కార్డు ద్వారా కళాశాలకు, బంధువులకు సమాచారం ఇచ్చారు. భవాని మృతదేహాన్ని వెలికి తీసి రాజోలు ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. భవాని తండ్రి సత్యనారాయణ, తల్లి మహలక్ష్మి ఆర్థిక ఇబ్బందుల వల్ల తరచూ గొడవ పడుతుండేవారని, దీంతో భవాని మానసికంగా ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్సై వివరించారు. -
విషజ్వరంతో డిగ్రీ విద్యార్థిని మృతి
వేమునపల్లి (ఆదిలాబాద్) : విషజ్వరంతో డిగ్రీ విద్యార్థిని మృతిచెందింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా వేమునపల్లి మండలం నిల్వాల్ గ్రామంలో గురువారం జరిగింది. వివరాల ప్రకారం.. నిల్వాల్ గ్రామానికి చెందిన ఎస్. శిల్ప(20) కరీంనగర్లోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలో గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇది గుర్తించిన తల్లిదండ్రులు మెరుగైన వైద్యం కోసం ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది.