వేమునపల్లి (ఆదిలాబాద్) : విషజ్వరంతో డిగ్రీ విద్యార్థిని మృతిచెందింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా వేమునపల్లి మండలం నిల్వాల్ గ్రామంలో గురువారం జరిగింది. వివరాల ప్రకారం.. నిల్వాల్ గ్రామానికి చెందిన ఎస్. శిల్ప(20) కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది.
ఈ క్రమంలో గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇది గుర్తించిన తల్లిదండ్రులు మెరుగైన వైద్యం కోసం ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది.
విషజ్వరంతో డిగ్రీ విద్యార్థిని మృతి
Published Thu, Aug 27 2015 5:05 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement