'ర్యాగింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు' | stern action on ragging, says vishkukumar raju | Sakshi
Sakshi News home page

'ర్యాగింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు'

Published Wed, Sep 2 2015 11:33 AM | Last Updated on Mon, Jul 23 2018 6:55 PM

'ర్యాగింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు' - Sakshi

'ర్యాగింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు'

నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు.

హైదరాబాద్: నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. విద్యాలయాల్లో ర్యాగింగ్ నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ... ర్యాగింగ్ అనే పెనుభూతం బారిన పడి రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకోవడం దారుణం అన్నారు.

ఈ ఘటనపై అధికార, విపక్ష పార్టీలు రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటనలు జరిగాయా, లేదా అనే దాని గురించి విద్యార్థులందరినీ విచారించాలని సూచించారు. రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై హోంమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని సమగ్ర దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ర్యాగింగ్ పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement