
సాక్షి, అనంతపురం: సరైన వసతులుండవనే కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చేర్పించడానికి ఓ వైపు తల్లిదండ్రులు వెనకడుగువేస్తుంటే.. మరోవైపు సరైన పర్యవేక్షణ లేని కారణంగా జిల్లాలోని ఓ పాఠశాలలో ర్యాగింగ్ జరిగింది. ఈ ఘటన కదిరి మండలం కళాసముద్రంలో గల గురుకుల పాఠశాలలో గురువారం వెలుగుచూసింది. అయిదో తరగతి విదార్థులపై టెన్త్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. సీనియర్ల వెకిలి చేష్టలకు భయపడి ముగ్గురు విద్యార్థులు టీసీ తీసుకుని వెళ్లిపోయినట్టు తెలిసింది. కాగా, ఘటనపై ఇంతవరకు విద్యాశాఖ అధికారులెవరూ స్పందించక పోవడం గమనార్హం.