ర్యాగింగ్‌పై మంత్రి గంటా ఆగ్రహం
Published Sat, Sep 2 2017 12:50 PM | Last Updated on Tue, Sep 12 2017 1:39 AM
నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు ఐఐఐటిలో ర్యాగింగ్ ఘటన వార్తలపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జీయూకేటీ డైరెక్టర్‌తో ఆయన మాట్లాడి ర్యాగింగ్ నిరోధానికి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ర్యాగింగ్‌కు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ర్యాగింగ్ ఘటనలను ఏమాత్రం సహించవద్దని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. ర్యాగింగ్ ఘటనలు, తీసుకొన్న చర్యలపై నివేదిక పంపాలని ఆదేశించారు. పవిత్రమైన విద్యాలయాల్లో ర్యాగింగ్‌ను సహించేది లేదని మంత్రి గంటా స్పష్టం చేశారు.
Advertisement
Advertisement