ర్యాగింగ్‌తో భవిత నాశనం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం):
ర్యాగింగ్‌కు విద్యార్థులు దూరంగా ఉండాలని, లేకుంటే భవిత నాశనమవుతుందని వక్తలు ఉద్బోధించారు. స్థానిక ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ కళాశాలలో యాంటీ రాగింగ్‌పై అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథి, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కళాశాల డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ పి.సాంబశివరావు మాట్లాడుతూ విద్యార్థులందరూ స్నేహభావంతో మెలగాలన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరంగా కఠిన శిక్షలు ఉన్నాయన్నారు. భవిష్యత్తు దెబ్బతింటుందన్నారు. అసోసియేట్ డీన్ పి.జయరామిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్ పట్ల అవగాహన పెంచుకోకుంటే జరిగే నష్టాలను వివరించారు.విద్యార్థులకు సమస్యలు తలెత్తినప్పుడు ముందుగా తమ తల్లిదండ్రులు, అధ్యాపకులు, తర్వాత పోలీసు వారిని సంప్రదించి సమస్యకు పరిష్కారం చూసుకోవాలని వన్‌టౌన్ ఎస్సై పి.ఆనంద్ సూచించారు. జీవీ నాగేశ్వరరావు, మురళీమోహన్ పాల్గొన్నారు.
గురుపూజోత్సవం
వ్యవసాయ కళాశాలలో జరిగిన గురుపూజోత్సవంలో ముఖ్య అతిథి పి. సాంబశివరావు మాట్లాడుతూ విద్యార్థులు గురువులు అందించే నాణ్యమైన విద్యను ఆకళింపు చేసుకోవాలన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.