తిరుపతి: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై మొదటి సంవత్సర విద్యార్థులు క్యాంపస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రెండో సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి... ఆర్ట్స్ కళాశాలలోని శ్రీ వాస్తవ వసతి గృహంలో ఉంటున్న జూనియర్ విద్యార్థులు మెస్‌కు షార్ట్‌లు వేసుకొని వెళ్తున్నారు. దీంతో సీనియర్లు జోక్యం చేసుకొని మెస్‌కు షార్ట్ వేసుకొని రావొద్దని హెచ్చరించారు.
అయినా జూనియర్లలో మార్పు రాకపోవడంతో బుధవారం గట్టిగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సీనియర్, జూనియర్ల మధ్య గొడవ జరిగింది. ఈ సందర్బంలో సీనియర్లు, జూనియర్లపై చేయి చేసుకున్నారు. దీంతో మనస్థాపానికి గురైన ఇద్దరు విద్యార్థులు క్యాంపస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఒక విద్యార్థిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
ఎస్వీఆర్ట్స్ కళాశాలలో ర్యాగింగ్
Published Wed, May 24 2017 7:17 PM | Last Updated on Tue, Sep 5 2017 11:54 AM
Advertisement