sv arts college
-
ఎస్వీఆర్ట్స్ కళాశాలలో ర్యాగింగ్
తిరుపతి: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై మొదటి సంవత్సర విద్యార్థులు క్యాంపస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రెండో సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి... ఆర్ట్స్ కళాశాలలోని శ్రీ వాస్తవ వసతి గృహంలో ఉంటున్న జూనియర్ విద్యార్థులు మెస్‌కు షార్ట్‌లు వేసుకొని వెళ్తున్నారు. దీంతో సీనియర్లు జోక్యం చేసుకొని మెస్‌కు షార్ట్ వేసుకొని రావొద్దని హెచ్చరించారు. అయినా జూనియర్లలో మార్పు రాకపోవడంతో బుధవారం గట్టిగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సీనియర్, జూనియర్ల మధ్య గొడవ జరిగింది. ఈ సందర్బంలో సీనియర్లు, జూనియర్లపై చేయి చేసుకున్నారు. దీంతో మనస్థాపానికి గురైన ఇద్దరు విద్యార్థులు క్యాంపస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఒక విద్యార్థిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. -
ఆధిక్యంలో దూసుకుపోతున్న సుగుణమ్మ
తిరుపతి: తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ ఆధిక్యంలో దూసుకపోతున్నారు. కాంగ్రెస్ ప్రత్యర్థి శ్రీదేవిపై సుమారు 67,366 ఓట్లకు పైగా మెజార్టీతో ముందంజలో ఉన్నారు. మొత్తం 19 రౌండ్లలో ఇప్పటివరకూ 11 రౌండ్ల లెక్కింపు పూర్తయినట్లు సమాచారం. ఇక దాదాపు ప్రతీరౌండ్ లోనూ టీడీపీ వెయ్యి వోట్లకు పైగా దక్కించుకుంటూ దూసుకుపోతోంటే,, కాంగ్రెస్ మాత్రం100 ఓట్లకు మాత్రమే పరిమితమవుతోంది. కాగా సుగుణమ్మ లక్ష ఓట్లతో గెలుపొందుతామని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం గత ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లను సాధిస్తామనే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం నగర ప్రజలు తమకు ఓట్లు వేసి ఉంటారనే నమ్మకంతో ఉన్నారు. -
నేడే ఉప ఎన్నిక కౌంటింగ్
- లక్ష ఓట్లతో గెలుస్తామని టీడీపీ ధీమా - గతంలో కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని కాంగ్రెస్ ఆశలు - ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ - 14 టేబుళ్లు, 19 రౌండ్లలో లెక్కింపు సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికల ఫలితం సోమవారం తేలనుంది. కౌంటింగ్‌కు సంబంధించి ఇప్పటికే ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీరబ్రహ్మయ్య వెల్లడించారు. 14 టేబుళ్లు, 19 రౌండ్లలో లెక్కంపు పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో 2,94,781 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కేవలం 1,47,153 మంది అంటే 49.92 శాతం మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలైన ఓట్లలో పురుషులు 78,238 మంది, మహిళలు 68,915 మంది ఉన్నారు. ఎన్నికల బరిలో 13 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ లక్ష ఓట్లతో గెలుపొందుతామని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం గత ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లను సాధిస్తామనే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం నగర ప్రజలు తమకు ఓట్లు వేసి ఉంటారనే నమ్మకంతో ఉన్నారు. కౌంటింగ్‌కు భారీ ఏర్పాట్లు.. కౌంటింగ్‌కు సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రతి టేబుల్ వద్ద సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లను మాత్రమే అనుమతిస్తారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. లెక్కింపు కేంద్రంలోకి సెల్ఫోన్లను అనుమతించరు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ గోపినాథ్ జెట్టి తెలిపారు. ఎన్నికల పరిశీలకులు డాక్టర్ హర్షదీప్ కాంబ్లే కౌంటింగ్‌ను పర్యవేక్షించనున్నారు. -
రోడ్డెక్కిన ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులు
-
రోడ్డెక్కిన ఎస్వీయూ ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులు
తిరుపతి : శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ విద్యార్థులు రోడ్డెక్కారు. హాజరు శాతం తక్కువ ఉందంటూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్స్‌పల్ అధిక మొత్తం డబ్బులు కట్టాలంటూ వేధిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. సమైక్య ఉద్యమం, ఇతర కారణాల వల్ల తాము కళాశాలకు హాజరుకాలేకపోయామని ఎంత చెప్పినా ప్రిన్సిపల్ వినడంలేదని ఫీజు చెల్లించాల్సిందేనని పేద విద్యార్థులపై ఒత్తిడి తెవడంపై వారు నిరసనకు దిగారు. ఫీజును రద్దు చేయాలని, హాల్ టికెట్లను వెంటనే జారీ చేయాలంటూ విద్యార్థులు శనివారం ఉదయం నుంచి ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.