
రోడ్డెక్కిన ఎస్వీయూ ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులు
తిరుపతి : శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ విద్యార్థులు రోడ్డెక్కారు. హాజరు శాతం తక్కువ ఉందంటూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్స్‌పల్ అధిక మొత్తం డబ్బులు కట్టాలంటూ వేధిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. సమైక్య ఉద్యమం, ఇతర కారణాల వల్ల తాము కళాశాలకు హాజరుకాలేకపోయామని ఎంత చెప్పినా ప్రిన్సిపల్ వినడంలేదని ఫీజు చెల్లించాల్సిందేనని పేద విద్యార్థులపై ఒత్తిడి తెవడంపై వారు నిరసనకు దిగారు. ఫీజును రద్దు చేయాలని, హాల్ టికెట్లను వెంటనే జారీ చేయాలంటూ విద్యార్థులు శనివారం ఉదయం నుంచి ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.