20న ఫీజు పోరుబాట : బీజేపీ | bjp fees porubata on december 20th in telangana | Sakshi
Sakshi News home page

20న ఫీజు పోరుబాట : బీజేపీ

Published Sun, Dec 18 2016 7:07 PM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM

20న ఫీజు పోరుబాట : బీజేపీ - Sakshi

20న ఫీజు పోరుబాట : బీజేపీ

హైదరాబాద్: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న ఫీజు పోరుబాట నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేతలు ప్రకటించారు.

ఆదివారం కూకట్‌పల్లి బీజేపీ కార్యాలయంలో మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మాధవరం కాంతారావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థులు కడుపులు మాడ్చుకుని పోరాటం చేశారని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం విద్యార్థులకు ఫీజుల బకాయిలు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. 14 లక్షల మంది విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.2090 కోట్లు చెల్లించకుండా కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఫీజు పోరుబాట విజయవంతం చేయాలని బీజేపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement