జేఎన్‌టీయూ: అనంతపురం నగరం పరిధిలోని ఓ ప్రవైటు ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ర్యాగింగ్ కలకలం రేగింది. బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థులు ఇద్దరు , మొదటి సంవత్సరం విద్యార్థి పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో మొదటి సంవత్సరం విద్యార్థి ప్రతిఘటించాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయడంతో ఆ ఇద్దరు విద్యార్థులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రుల సమక్షంలోనే వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ర్యాగింగ్ చేస్తే వచ్చే దుష్పరిణామాలు ఎలా ఉంటాయో వివరించారు. ర్యాగింగ్ నిరోధానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు కోరుతున్నారు.