
ర్యాగింగ్ నిరోధానికి చర్యలు చేపట్టండి
ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ర్యాగింగ్ నిరోధానికి చర్యలు చేపట్టాలని యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. ర్యాగింగ్ నిరోధానికి చర్యలు చేపట్టని కాలేజీలపై కఠిన చర్యలు చేపడతామన్నారు. హాస్టళ్లు ఉన్న కాలేజీలు, వర్సిటీల్లో రక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
ర్యాగింగ్‌పై సీనియర్ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని, అవసరమైతే తొలి ఏడాదిలో చేరిన విద్యార్థులకు వేరుగా నివాస వసతి కల్పించాలని సూచించారు. బాలికల హాస్టళ్లల్లో మహిళా అధ్యాపకులు, బాలుర హాస్టళ్లలో పురుష అధ్యాపకులు రాత్రి వేళల్లో నిద్రించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.