అనంతపురం జిల్లాలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేగింది.
సాక్షి, గుంతకల్లు: అనంతపురం జిల్లాలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేగింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న నందిని అనే విద్యార్థినిని సీనియర్ విద్యార్థులు వేధిస్తుండటంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇది గుర్తించిన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.