‘నలుగురు అబ్బాయిలను ముద్దు పెట్టుకున్నా’ | Jithendra Kumar Kissing Experience With 4 Boys While Ragging | Sakshi
Sakshi News home page

నిజంగానే అబ్బాయికి ముద్దు పెట్టా: హీరో

Published Tue, Feb 11 2020 8:38 AM | Last Updated on Tue, Feb 11 2020 8:47 AM

Jithendra Kumar Kissing Experience With 4 Boys While Ragging - Sakshi

కొత్త కథలతో ముందుకు వచ్చే బాలీవుడ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా తాజాగా నటించిన చిత్రం ‘శుభ్‌ మంగళ్‌ జ్యాద సావధాన్‌’. ఇద్దరు అబ్బాయిల మధ్య ప్రేమ అన్నకాన్సెప్ట్‌తో ఈ సినిమా సాగుతుంది. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా పెళ్లి మండపంలో హీరో సహనటుడు జితేంద్ర కుమార్‌ను అందరి ముందే ముద్దాడటం వంటి సీన్లు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయితే ఆన్ స్క్రీన్‌పై మాత్రమే కాకుండా నిజజీవితంలోనూ ఇలాంటి అనుభవం ఎదురైందంటూ వారి గతాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేశారు ఖురానా, జితేంద్ర.(‘గే’ పాత్రలో కనిపించనున్న స్టార్‌ హీరో!)


ఆయుష్మాన్‌ మాట్లాడుతూ.. ట్రూత్‌ అండ్‌ డేర్‌ ఆట ఆడుతున్న సమయంలో అబ్బాయిని కిస్‌ చేయాలని టాస్క్‌ ఇచ్చారన్నాడు. దీంతో ధైర్యంగా ముందుకు వచ్చి తోటివాడిని ముద్దుపెట్టుకున్నానని చెప్పుకొచ్చాడు. ఇక సహనటుడు జితేంద్ర మాట్లాడుతూ.. కాలేజీలో ర్యాగింగ్‌ ద్వారా తనకు చేదు అనుభవం జరిగిందన్నాడు. ‘ఇంజనీరింగ్‌ చదువుతున్న సమయంలో ఓరోజు నన్ను పిలిచి నలుగురు అబ్బాయిలకు ముద్దు పెట్టాలని ఒత్తిడి చేశారు. ఇప్పుడంటే ర్యాగింగ్‌పై నిషేధం ఉంది కానీ ఆ సమయంలో ర్యాగింగ్‌ రక్కసి రాజ్యమేలుతోందని, దీంతో వాళ్లు చెప్పింది చేయక తప్పలేద’ని వాపోయాడు. కాగా కామెడీ అండ్‌ రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఔను.. వాళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement