ర్యాగింగ్: దెబ్బలు తట్టుకోలేక పీఎస్‌లోకి
హైదరాబాద్: నగరశివార్లలోని ఓ పాలిటెక్నిక్ కాలేజీలో ర్యాగింగ్ పేట్రేగిపోయింది. సీనియర్ల ర్యాగింగ్ ఆకృత్యాలను తట్టుకోలేని ఓ విద్యార్థి పోలీస్ స్టేషన్‌కు పరుగుతీసిన ఘటన ఎల్‌బీనగర్‌లో చోటుచేసుకుంది. ఎల్‌బీనగర్ లింగజోడుకు చెందిన గిరిధర్ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని టీడీఆర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఫస్టియర్ చదువుతున్నాడు. గురువారం సాయంత్రం బీబీనగర్ నుంచి హైదరాబాద్‌కు కాలేజీ బస్సులో ఇంటికి బయలు దేరిన గిరిధర్‌ను ఫైనలియర్ విద్యార్థులు సమీర్, నరసింహా, నరసింహా గౌడ్‌లు ర్యాగింగ్ పేరుతో చితకబాదారు.
దెబ్బలు తట్టుకోలేని గిరిధర్ బస్సు ఎల్బీనగర్‌కు చేరుకోగానే పోలీస్‌స్టేషన్‌లోకి పరుగు తీశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు గాయపడ్డ గిరిధర్‌ను సమీప ఆసుపత్రికి తరలించారు. సీనియర్ల కోసం గాలిస్తున్నారు. సీనియర్లు వంగబెట్టి దెబ్బలు కోట్టే గేమ్ తనతో ఆడారని, రూ.500 ఇస్తే వదిలేస్తామన్నారని గిరిధర్ సాక్షికి తెలిపాడు. బీబీనగర్ నుంచి ఉప్పల్ వరకు కొట్టారని, డబ్బులు ఇవ్వకుంటే రోజు ఇలానే కొడుతామని బెదిరించినట్లు గిరిధర్ చెప్పుకొచ్చాడు.