సాక్షి, ధర్భంగా : గర్ల్స్ హాస్టల్‌లో జూనియర్ విద్యార్థినులపై ర్యాంగింగ్‌కు దిగిన సీనియర్ విద్యార్థినులపై దర్భంగా మెడికల్ కాలేజ్ తీవ్ర చర్యలు తీసుకుంది. ర్యాగింగ్‌లో పాల్గొన్న మొత్తం 54 విద్యార్థినులపై రూ. 25 వేలు జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నవంబర్ 25 లోపు చెల్లించాలని, లేకపోతే ఆరు నెలల పాటు వారిపై సస్పెన్షన్ వేటు వేస్తామని యాంటి ర్యాగింగ్ కమిటీ నోడల్ ఆఫీసర్ రాధారమణ్ ప్రసాద్ సింగ్ స్పష్టం చేశారు.
కాలేజ్‌లో విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే రూ. 25 వేల నుంచి లక్ష రూపాయల వరకూ జారిమానా విధించవచ్చని ఆయన చెప్పారు. మొదటిసారి సాధారణ జరిమానా విధించామన్న ఆయన.. మరోసారి ఇటువంటి ఘటనలు జరిగితే పరిణాలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. ఈ నెల 11న కొత్తగా చేరిన విద్యార్థులను సీనియర్లు హాస్టల్‌లో ర్యాగింగ్ చేసినట్లు ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన తెలిపారు.
#Bihar: 54 students of girls hostel in Darbhanga Medical College fined Rs 25,000 each for allegedly ragging juniors pic.twitter.com/8Cm1Ce51bM
— ANI (@ANI) 19 November 2017
Comments
Please login to add a commentAdd a comment