సాక్షి, హైదరాబాద్: జేఎన్‌టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో జూనియర్లపై సీనియర్ విద్యార్థులు వేధింపులకు (ర్యాగింగ్) పాల్పడుతు న్న ఘటనలపై పలు ఫిర్యాదులు అందడంతో పది మంది విద్యార్థులపై అధికారులు వేటు వేసినట్లు సమాచారం. పది రోజుల క్రితం జూనియర్స్ ఉండే కిన్నెర హాస్టల్‌కు మంజీరా హాస్టల్‌లో ఉండే బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థులు వెళ్లి ర్యాగింగ్ చేసినట్లు తెలిసింది. దీనిపై అధికారులకు ఫిర్యాదులు అందాయి.
దీంతో ప్రిన్సిపాల్ గోవర్ధన్ విచారణ కమిటీని నియమించారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బుధవారం సస్పెన్షన్ వేటు వేశారు. హాస్టల్ వసతి నుంచి ఏడాది పాటు, తరగతులకు హాజరుకాకుండా వారం పాటు సస్పెన్షన్ విధించినట్లు తెలిసింది. ఈ విషయమై ప్రిన్సిపాల్ గోవర్ధన్‌ను వివరణ కోరగా ఆయన స్పందించలేదు. కాగా, గతేడాది ర్యాగింగ్‌కు పాల్పడిన ఇద్దరు సీనియర్ విద్యార్థులను కళాశాల నుంచి సస్పెండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment