jntu Hyderabad
-
ఒక్క క్లిక్‌తో టీజీ పీజీఈసెట్ రిజల్ట్.. డైరెక్ట్ లింక్ ఇదే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీజీఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్టీయూహెచ్లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి ఫలితాలను చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 20,626 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయగా, జూన్ 10 నుంచి 13 వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. కేవలం నాలుగు రోజుల్లోనే ఫలితాలు విడుదల చేశారు.టీజీ పీజీఈసెట్ ఫలితాలు రిజల్ట్ కోసం క్లిక్ చేయండి -
HYD: జేఎన్టీయూలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఫోర్త్ ఇయర్ చదువుతున్న మేఘనా రెడ్డి బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల ప్రకారం.. జేఎన్టీయూలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఫోర్త్ ఇయర్ చదువుతున్న మేఘన బుధవారం.. సీఎస్ఆర్ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే, మేఘనా రెడ్డి.. అనారోగ్య సమస్యల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో కూడా మేఘనా రెడ్డి.. మానసికంగా ఇబ్బందులకు కావడంతో అందుకు తగిన ట్రీట్మెంట్ కూడా తీసుకున్నట్టు సమాచారం. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
‘బ్రాండెడ్’ బెస్ట్: రంగు నీళ్లన్నీ శానిటైజర్లు కాదు
సాక్షి, సిటీబ్యూరో: మెరిసేదంతా బంగారం కాదన్న చందంగా మారింది శానిటైజర్ల పరిస్థితి. కోవిడ్ మహామ్మారి విజృంభిస్తోన్న ప్రస్తుత తరుణంలో ప్రతీ ఒక్కరికీ ఇప్పుడు తరచూ చేతులను శానిటైజర్‌తో శుభ్రపరచుకోవడం దినచర్యగా మారింది. ఇదే తరుణంలో బహిరంగ మార్కెట్లో అందమైన డబ్బాలు, బాటిళ్లలో ప్యాక్‌చేసి..తీరైన లేబుల్స్ అంటించి విక్రయిస్తోన్న రంగునీళ్లన్నీ శానిటైజర్లు కావని జేఎన్టీయూ, బిట్స్‌పిలానీ తాజా పరిశోధనలో స్పష్టమైంది. లేబుల్స్‌పై పేర్కొన్న విధంగా ఇవన్నీ సరైన ప్రమాణాల ప్రకారం సిద్ధం చేసినవి కావని..వీటితో చేతులపై ఉన్న వైరస్, బ్యాక్టీరియా ఆనవాళ్లు అంత త్వరగా నశించవని ఈ పరిశోధన తేటతెల్లం చేసింది. ప్రధానంగా వీటిల్లో ఇథైల్ ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండడం, ఇతర ప్రమాణాలను పాటించకపోవడంతోనే ఈ అనర్థాలు తలెత్తుతున్నాయని పరిశోధకులు స్పష్టంచేశారు. పరిశోధనలో తేలింది ఇదీ.. ► బహిరంగ మార్కెట్లో దొరికే పలు రకాల బ్రాండ్ల శానిటైజర్లను సేకరించి..నగరంలోని జేఎన్టీయూహెచ్, బిర్లా ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, పిలానీ (హైదరాబాద్ క్యాంపస్) పరిశోధకులు తమ ప్రయోగశాలల్లో వాటి నాణ్యతను పరీక్షించారు. ► పలు లోకల్ మేడ్ శానిటైజర్లలో ఇథైల్ ఆల్కహాల్ 95 శాతం ఉందంటూ లేబుల్‌పై ప్రకటించారు. కానీ వీటిల్లో కేవలం ఆల్కహాల్ 50 శాతానికి మించ లేదని తమ పరిశోధనలో తేలిందని జేఎన్టీయూహెచ్ పరిశోధకులు ప్రొఫెసర్ బిందు తెలిపారు. ► తాము ఆయా శానిటైజర్లను గ్యాస్ క్రోమాటోగ్రఫీ విధానంలో పరీక్షించామని పేర్కొన్నారు. మరికొన్నింటిలో కేవలం 5 శాతం మాత్రమే ఇథైల్ ఆల్కహాల్ ఉందని స్పష్టంచేశారు. ► ఆయా శానిటైజర్లు వైరస్, బ్యాక్టీరియాలను ఎలా నిరోధిస్తున్నాయన్న అంశంపైనా మైక్రోబయాలజికల్ విశ్లేషణ జరిపామని...వీటిల్లోనూ ఆయా లోకల్‌మేడ్ శానిటైజర్లు నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయని తెలిపారు. ► మరికొన్నింటిలో ఇథనాల్, ఐసో ప్రొపనాల్ మోతాదు కూడా సరైన ప్రమాణాల్లో కలపకపోవడంతో బ్యాక్టీరియా, వైరస్‌లను నిరోధించలేవని స్పష్టమైందన్నారు. నాణ్యత చూసి కొనండి బహిరంగ మార్కెట్లో దొరికే శానిటైజర్లలో బ్రాండెడ్‌వి, నాణ్యమైనవి చూసి కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతీ ఒక్కరూ వివిధ పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లడం అనివార్యమైన తరుణంలో వినియోగించే శానిటైజర్ నాణ్యత ప్రమాణాల ప్రకారం ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. లేకుంటే కోవిడ్ ముప్పు రావొచ్చని హెచ్చరించారు. విక్రయాలు ఫుల్..నాణ్యత నిల్ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లు, వీధి వ్యాపారులు, కిరాణా దుకాణాలు, మెడికల్ షాపులు ఇలా అన్ని ప్రదేశాల్లోనూ ‘మూడు మాస్కులు..ఆరు శానిటైజర్లు’ అన్న చందంగా వ్యాపారం సాగుతోంది. ప్రతి రోజు రూ.కోట్లలో విక్రయాలు జరుగుతున్నాయి. ప్రస్తుత తరుణంలో వీటితయారీ సంస్థలకు సైతం పీసీబీ సులభంగా అనుమతులు జారీచేస్తోంది. ఇదే సమయంలో కొందరు కుటీర పరిశ్రమగా ఇళ్లు, పురాతన షెడ్లలో నాసిరకం శానిటైజర్లు తయారీచేసి విక్రయిస్తున్నారు. వీటి నాణ్యతే ప్రశ్నార్థకంగా మారింది. చదవండి: కరోనా రోగులకు ఇక సహజ వాయువే! -
ఎంటెక్: పాత కోర్సులకు కత్తెర.. 7 కొత్త కోర్సులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్తగా పలు ఎంటెక్ కోర్సులు ప్రవేశపెట్టేందుకు జేఎన్టీయూ చర్యలు చేపట్టింది. గతేడాది కొత్త కోర్సుల్లో ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నిం గ్, డేటా సైన్స్ వంటి ప్రధాన సబ్జెక్టులతోనే కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇవ్వగా, ఈసారి వాటి సంఖ్య పెంచి 7 రకాల కొత్తకోర్సులు చేపట్టేందుకు అవకాశం కల్పించింది. ఈ జాబితాలో.. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ)లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, సైబర్ సె క్యూరిటీ.. సివిల్ ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ ఎయిడెడ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్.. ఈసీఈలో ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ వీఎల్ఎస్ఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మైక్రో ఎల్రక్టానిక్స్ అండ్ వీఎల్ఎస్ఐ డిజైన్.. మెకా నికల్లో మెకట్రానిక్స్ పీజీ కోర్సులు ఉన్నాయి. కొన్ని కాంబినేషన్లకు కత్తెర! గతేడాది బీటెక్ కంప్యూటర్ సైన్స్‌లో (సీఎస్ఈ) సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సీఎస్ఈ నెట్వర్క్స్ కోర్సులకు జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు జారీ చేసింది. అయితే ఈసారి (2021–22లో) బీటెక్ సీఎస్ఈలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెరి్నంగ్, మెకానికల్‌లో ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్‌కు అనుబంధ గుర్తిం పు ఇస్తామని ప్రకటించింది. ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్‌ను ప్రత్యేక కోర్సులుగా ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ కోర్సులకు కాలేజీల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవచ్చని జేఎనీ్టయూ వెల్లడించింది. అయితే గతేడాది బీటెక్‌లో ఇచి్చన సీఎస్ఈ నెట్వర్క్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇస్తారా, లేదా? అన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. పాత వివరాలతోనే.. రాష్ట్రంలోని వృత్తి, సాంకేతిక విద్యా కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీ చేసేందుకు నిర్వహించే ‘ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల (ఎఫ్ఎఫ్సీ)’తనిఖీలు ఈసారి నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. గత ఏడాది కరోనా ఎఫెక్ట్‌తో తనిఖీలు చేయలేదు. ప్రస్తుతం కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. రెండేళ్ల కిందటి తనిఖీలు, గతేడాది కాలేజీలు అందజేసిన డాక్యుమెంట్ల పరిశీలన, తాజాగా అందజేసే అఫిడవిట్ల ఆధారంగానే అనుబంధ గుర్తింపు జారీ చేసేందుకు యూనివర్సిటీలు కసరత్తు చేస్తున్నాయి. మే మొదటి లేదా రెండో వారంలో ‘అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)’నుంచి కాలేజీలకు, కోర్సులకు అనుమతులు లభించనున్నాయి. ఆ వెంటనే రాష్ట్ర యూనివర్సిటీలు ఆయా కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీ కోసం దరఖాస్తులు స్వీకరించనున్నాయి. మరోవైపు ఈసారి ఇంకో 12 వరకు ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. చదవండి: ఆ రెండు సబ్జెక్టులు రాకుంటే.. ఇంజనీరింగ్‌లో సాధ్యమేనా?! -
హైదరాబాద్: జేఎన్టీయూ వద్ద విద్యార్థుల ఆందోళన
-
ఈసెట్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఈసెట్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 31న రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 6 వరకు మరో సెషన్లో పరీక్ష ఉండనుంది. కంప్యూటర్ ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తున్నట్లు జేఎన్టీయూ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 52, ఏపీలో నాలుగు పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. -
టెక్నికల్ కళాశాలల్లో బయోమెట్రిక్
సాక్షి, సిటీబ్యూరో: జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ (హైదరాబాద్)పరిధిలోని ఇంజినీరింగ్, ఫార్మసీ విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని వర్సిటీ భావిస్తోంది. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని గతంలోనే అన్ని యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఎంటెక్, ఎంఈ, ఎం–ఫార్మసీ వంటి పీజీ కోర్సులకు అధ్యాపకులతో పాటు విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు అమలు చేస్తుండగా, అదే తరహాలో బీటెక్, బీఈ, బీ–ఫార్మసీ కోర్సుల్లోనూ అమలు చేసేందుకు జేఎన్టీయూహెచ్ సిద్ధమవుతోంది. అయితే, ఇంజినీరింగ్ కోర్సుల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో యంత్రాలు సమకూర్చుకోవడం ఇబ్బందిగా మారుతుందని గతంలో ఈ నిర్ణయాన్ని వాయిదా వేశారు. దీని అనుకూలంగా తీసుకున్న కొన్ని కళాశాలలు విద్యార్థులు తరగతులకు సరిగా హాజరు కాకున్నా కాలేజీకి వస్తున్నట్టుగానే చూపుతున్నారు. దీనికి చెక్ పెట్టాలంటే బయోమెట్రిక్ విధానం తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని జేఎన్టీయూహెచ్ నిర్ణయించింది. దీంతో త్వరలో యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో బయోమెట్రిక్ విధానం త్వరలో అమల్లోకి రానుంది. ఒక్కో యంత్రంలో 100 మంది ఇంజినీరింగ్, ఫార్మసీ విద్యార్థులు, అధ్యాపకులకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని కావడంతో చాలా కళాశాలలు వెనుకడుగు వేస్తున్నాయి. ఒక యంత్రం నిర్వాహణకు నెలకు రూ.800 వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు వాపోతున్నాయి. దీనివల్ల కళాశాలలపై ఆర్థిక భారం పడుతుందంటున్నారు. జేఎన్టీయూహెచ్ అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలు 160, బీఫార్మసీ కళాశాలు మరో 70 ఉన్నాయి. వీటి పరిధిలో 2.70 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఒక్కో యంత్రంలో 100 మంది హాజరు మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి 2500కు పైగా బయోమెట్రిక్ యంత్రాలను సమకూర్చుకోవాలి. దీనికోసం జేఎన్టీయూహెచ్ తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ సహాయం తీసుకోనున్నట్లు సమాచారం. పర్యవేక్షణ మరింత సులువు విద్యార్థుల హాజరు వివరాలు జేఎన్టీయూహెచ్, తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఈ–పాస్ విధానానికి అనుసంధానం చేయనున్నారు. దీని ద్వారా బయోమెట్రిక్ హాజరు ద్వారా కళాశాల ప్రిన్సిపల్‌తో పాటు జేఎన్టీయూ, ఉన్నత విద్యామండలి అధికారుల వరకు ఆన్లైన్లో అధ్యాపకులు, విద్యార్థుల హాజరును సులువుగా పర్యవేక్షించగలరు. డాష్‌బోర్డ్ ద్వారా ఎప్పటికప్పుడు ఆయా కళాశాలల్లో నమోదవుతున్న హాజరు తెలుసుకోవచ్చు. యూనివర్సిటీ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు కళాశాలలను సందర్శించకుండానే ఏ రోజుకారోజు అక్కడి హాజరు పరిస్థితిని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్ పొందాలంటే ప్రతి విద్యార్థికి 75 శాతం హాజరు తప్పనిసరి. కానీ ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో చేరుతున్న చాలామంది విద్యార్థులు తరగతులకు సరిగ్గా హాజరు కావడం లేదు. స్కాలర్షిప్కు 75 శాతంగా చూపించేందుకు విద్యార్థులు అయాకళాశాలలు డిమాండ్ చేసిన డబ్బును మట్టుజెపుతున్నారు. ఇలా హాజరు శాతం సరిచేయటానికి ఒక్కో విద్యార్థి నుంచి రూ.4 వేలనుంచి రూ.5 వేలకు పైగా(అవసరాన్ని బట్టి) వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బయోమెట్రిక్ విధానం అమల్లోకి వస్తేప్రైవేటు కళాశాలల దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. -
ప్రజల సహకారంతోనే జపాన్, సింగపూర్ అభివృద్ధి..
సాక్షి, హైదరాబాద్ : కుకట్పల్లి జేఎన్టీయూ యునివర్శిటీ ఆడిటోరియంలో స్వచ్ఛ పాఠశాల, స్వచ్ఛ కమ్యూనిటీ కార్యక్రమాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ బోంతు రామ్మోహన్, విద్యాశాఖ కార్యదర్శి డా. బి జనార్దనరెడ్డి, మున్సిపల్ శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి మాట్లాడుతూ.. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో ప్రతి విద్యార్థి పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యాసంస్థలు తమ సంస్థ ఆవరణంలో పరిశుభ్రత పాటించాలని.. తడి, పొడి చెత్తను వేరు చేయటంతో పాటు టాయిలెట్స్ క్లీనింగ్‌లో కూడా శుభ్రత పాటించాలని పిలుపునిచ్చారు. అలాగే ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అపరిశుభ్రత వల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి విద్యార్థులు తెలుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం ఇరవై తొమ్మిది లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, వారిలో ప్రతిరోజు ముప్పై శాతం మంది అనారోగ్య కారణాలతో స్కూల్‌కు హాజరు కావడం లేదని తెలిపారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా పాఠశాలల పరిశుభ్రతకు పాధాన్యతను ఇస్తున్నాయని అన్నారు. అందుకే పాఠశాలలు, కళాశాలలలో విద్యా ప్రమాణాలతో పాటు పరిశుభ్రత కూడా అవసరమని, చెత్త లేకుండా చేయడంతో పాటు ప్లాస్టీక్ వినిమోగాన్నికూడా తగ్గించాలని ఆయన పేర్కొన్నారు. కాగా మేయర్ బోంతు రామ్మోహన్ కూడా మాట్లాడుతూ.. పాఠశాల, కళాశాలల విద్యార్థులు వారి ఇంటి పరిపరాలను శుభ్రంగా ఉండేలా చుసుకోవాలని అన్నారు. విద్యార్థులు ఎవరైతే పరిశుభ్రత పట్ల చక్కటి అవగాహన కలిగి ఉంటారో వారు తమని తాము స్వచ్ఛ అంబాసిడర్లుగా భావించుకుంటూ ఆయా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. స్వచ్ఛత పాటించకపోవడం వల్లే నగరంలో దోమలు వ్యాప్తి చెందుతాయని అన్నారు. హైదరాబాద్ నగరంలో దాదాపు కోటి మందికి పైగా జనాభా ఉందని, జీహెచ్ఎంసీ తరపున ఇరవై వేల మంది మున్సిపాలిటి సిబ్బంది ఉన్నారని ఆయన వెల్లడించారు. అలాగే వీరితో పాటు ప్రజలు కూడా స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టాలని, జపాన్, సింగపూర్ వంటి దేశాలలో అభివృద్ది ప్రజల సహకారంతోనే జరిగిందని పేర్కొన్నారు. నగరంలో జీహెచ్ఎమ్సీ మాత్రమే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతుందని, ఇళ్లలోని చెత్తను నాలల్లో వేసి నిర్లక్ష్యంగా వ్వవహరించోద్దని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉంటూ ఇతురులలో కూడా ఛైతన్యం తీసుకురావాలని ఆయన సూచించారు. -
హైదరాబాద్‌లో కజాక్ ప్రొఫెసర్ల బృందం పర్యటన
సాక్షి, హైదరాబాద్ : విద్య, వైద్య రంగాల్లో పరస్పర సహకారం అందించుకునేందుకు భారత్, కజికిస్తాన్ ముందుకు వచ్చాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ కజికిస్తాన్ ప్రెసిడెంట్ ఫ్రొఫెసర్ అల్హనోవ్, డైరెక్టర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ పార్ట్నర్షిప్ ప్రొఫెసర్ అస్సన్తో కూడిన ప్రొఫెసర్ల బృందం సోమవారం హైదరాబాద్‌లో పర్యటించింది. వీరితో పాటు అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆఫ్ కజికిస్తాన్ భారత అధికార ప్రతినిధి డాక్టర్ బి.వవ్య సునీతరాజ్, నియో సీఈఓ డాక్టర్ బీవీకే రాజ్ ఉన్నారు. ఈ బృందం జేఎన్టీయూ హైదరాబాద్, ఉస్మానియా యూనిర్సిటీల వైస్ చాన్స్లర్లను అలాగే జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కలిసింది. కజికిస్తాన్లో మొత్తం 3 వేలమంది భారతీయ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తుండగా.. ఒక్క తెలంగాణ నుంచే 600 మంది వైద్య విద్యార్థులు ఉన్నారు. ఈ క్రమంలో వీరి కలయిక మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. వీరి మధ్య వైద్య, విద్య ఆరోగ్య సంరక్షణకు సంబంధించి అనేక అంశాలు చర్చకు వచ్చాయి. కజాక్ లోని తెలంగాణ వైద్య విద్యార్థుల ప్రయోజనం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని బృంద సభ్యులకు మంత్రి హామి ఇచ్చారు. అలాగే కజికిస్తాన్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తెలంగాణ విద్యార్థులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించే ఆలోచనలు కూడా చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని, ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని కజికిస్తాన్ రాజధాని ’ఆస్తానా‘ నగరంగా అంతర్జాతీయ స్థాయిలో తీర్చి దిద్దేందుకు సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎస్.రామచంద్రంతో పాటు, జేఎన్టీయూలో వీసీ, ప్రొఫెసర్ ఎ.వేణుగోపాల్ రెడ్డి, ప్రిన్సిపల్స్, డైరెక్టర్లతో సమావేశమైన బృంద సభ్యులు. ఆర్ట్స్, సైన్స్, టెక్నాలజీ, మేనేజ్ మెంట్ కోర్సుల్లో కజికిస్తాన్ లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు.. ఉస్మానియా తో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు ప్రొఫెసర్ అల్హనోవో వెల్లడించారు. ఇందుకు ఉస్మానియా వీసీ, జేఎన్టీయూ వీసీ వేణుగోపాల్ రెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. అలాగే ఫ్యాకల్టీలను కూడా ఎక్స్ఛేంజ్ చేసుకోవాలనే నిర్ణయానికి కూడా వచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద అంతరిక్ష పరిశోధన కేంద్రమైన బైక నోర్ కాస్మోడ్రామ్ లో అధ్యయనం చేసేందుకు ఉస్మానియా అధ్యాపక బృందాన్ని కజికిస్తాన్ ప్రతినిధి బృందం ఆహ్వానించింది. -
ఎవరికి ఎక్కువ హెచ్1బీ వీసాలంటే....
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలో హెచ్1 బీ వీసా సాధించిన విద్యార్థుల్లో ఎక్కడ చదువుకున్న వారు ఎక్కువగా ఉన్నారని అడిగితే ముంబైలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లేదా హైదరాబాద్‌లోని బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అన్న సమాధానం తరచుగా వస్తుంది విద్యార్థుల నుంచి స్కాలర్ల నుంచి. ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్ కార్యాలయం నుంచి సేకరించిన వివరాలను పరిశీలిస్తే అవాక్కవుతాం. 2017 సంవత్సరానికి అమెరికా మొత్తం 85 వేల హెచ్1 బీ వీసాలను విడుదల చేయగా, అందులో 20 వేల వీసాలు భారతీయ విద్యార్థులకు లభించాయి. వాటిలో ఏకంగా 850 వీసాలు చెన్నైలోని అన్నా యూనివర్శిటీ విద్యార్థులకు రాగా, 747 వీసాలు హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్శిటీకి లభించాయి. మనం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి 63 వీసాలు రాగా, బిర్లా యూనివర్శిటీకి 61 వీసాలు వచ్చాయి. దీనివల్ల ఎక్కువ వీసాలు వచ్చిన యూనివర్శిటీలే ఐఐటీ, ఐఐఎంలకన్నా విద్యా ప్రమాణాల్లో ముందున్నాయని అనుకుంటే పొరపాటు. ఏడాదికి ఐఐటీ విద్యార్థులు 12వేల మందికన్నా తక్కువ మంది హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటే అన్నా యూనివర్శిటీ చెందిన వారు దాదాపు రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారు. లాటరీ ద్వారా వీసాలను ఎంపిక చేస్తారు కనుక, ఎక్కువ విద్యార్థులున్న యూనివర్శిటీకి ఎక్కువ వీసాలు లభించే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఎక్కువ వీసాలు సాధించిన విద్యార్థుల జాబితాలో దేశంలోని ఐఐటీలు మొదటి 25 స్థానాలకు ఆక్రమించడం విశేషమే. -
జేఎన్టీయూహెచ్లో ర్యాగింగ్?
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో జూనియర్లపై సీనియర్ విద్యార్థులు వేధింపులకు (ర్యాగింగ్) పాల్పడుతు న్న ఘటనలపై పలు ఫిర్యాదులు అందడంతో పది మంది విద్యార్థులపై అధికారులు వేటు వేసినట్లు సమాచారం. పది రోజుల క్రితం జూనియర్స్ ఉండే కిన్నెర హాస్టల్‌కు మంజీరా హాస్టల్లో ఉండే బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థులు వెళ్లి ర్యాగింగ్ చేసినట్లు తెలిసింది. దీనిపై అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రిన్సిపాల్ గోవర్ధన్ విచారణ కమిటీని నియమించారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బుధవారం సస్పెన్షన్ వేటు వేశారు. హాస్టల్ వసతి నుంచి ఏడాది పాటు, తరగతులకు హాజరుకాకుండా వారం పాటు సస్పెన్షన్ విధించినట్లు తెలిసింది. ఈ విషయమై ప్రిన్సిపాల్ గోవర్ధన్‌ను వివరణ కోరగా ఆయన స్పందించలేదు. కాగా, గతేడాది ర్యాగింగ్‌కు పాల్పడిన ఇద్దరు సీనియర్ విద్యార్థులను కళాశాల నుంచి సస్పెండ్ చేశారు. -
నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ల్యాబ్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ సెంటర్ ఫర్ స్పేషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో కొత్తగా ఏర్పాటు చేసిన గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్) ప్రయోగశాలను వైస్‌చాన్స్‌లర్ వేణుగోపాల్‌రెడ్డి, నోవాటెల్ సాఫ్ట్వేర్ డైరెక్టర్ మైఖెల్ కినాహాన్‌లు గురువారం ప్రారంభించారు. జేఎన్టీయూహెచ్, హెక్సాగన్ కేపబిలిటీ సెంటర్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ప్రకృతి వనరుల నిర్వహణలో ఉపగ్రహ ఆధారిత నావిగేషన్‌లో విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించేందుకు నూతన ప్రయోగ శాల ఉపయోగపడుతుందని వీసీ అన్నారు. సహాజ వనరుల డేటా ప్రాసెసింగ్, విశ్లేషణతో పాటు వాటిని సద్వినియోగం చేసుకునే దిశగా మెరుగైన పరిశోధనలకు ఊతమిస్తుందన్నారు. విద్యార్థులకు శిక్షణ, ఇంటర్న్‌షిప్‌తో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. జేఎన్టీయూహెచ్లోని స్పేషియల్ ఇన్ఫర్మే షన్ టెక్నాలజీ విభాగం విద్యా ర్థులతో పాటు జియో ఇన్ఫ ర్మాటిక్స్ విభాగాలకు చెందిన విద్యార్థులందరూ కొత్త ల్యాబ్ సేవలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూ హెచ్ రెక్టార్ ఎన్వీ రమణరావు, రిజిస్ట్రార్ ఎన్.యాదయ్య, నోవాటెల్ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ బల్లవ్ ముంద్రా, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ శ్రీనివాస్, ఐఎస్టీ విభాగం అధిపతి జయశ్రీ, సీఎస్‌ఐటీ విభాగం డైరెక్టర్ రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఇంజనీరింగ్ ‘లక్ష’ణమే!
లోపాల కాలేజీలకు ‘గుర్తింపు’ ఇవ్వబోమన్న జేఎన్టీయూహెచ్ అందుబాటులో ఉండే సీట్లు సుమారు లక్ష లోపే కళాశాలల సంఖ్య 130కే పరిమితమయ్యే అవకాశం రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య ఇక స‘లక్ష’ణం కానుంది. పుట్టెడు లోపాలతో నడుస్తున్న కాలేజీలకు ఇక పూర్తిస్థాయిలో చెక్ పడనుంది. సరిదిద్దుకోవడానికి అవకాశమిచ్చినా పట్టించుకోని కళాశాలలపై వేటు పడనుంది. అలాంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ‘గుర్తింపు’ ఇవ్వకూడదన్న జేఎన్టీయూహెచ్ నిర్ణయంతో కాలేజీలు, సీట్ల సంఖ్యలో భారీగా కోత పడనుంది. మొత్తంగా కాలేజీలు 130కి, సీట్ల సంఖ్య లక్షలోపుకే పరిమితం కానుంది. ఇక వెంటపడి సీట్లు కట్టబెట్టే పరిస్థితి పోయి.. ఇంజనీరింగ్ సీట్లకు కొంతవరకు పోటీ పెరిగే అవకాశముంది. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఇంజనీరింగ్ కాలేజీలతోపాటు సీట్ల సంఖ్య భారీగా తగ్గిపోనుంది. కాలేజీల సంఖ్య 130 వరకు పరిమితం కానుండగా... సీట్ల సంఖ్య కూడా లక్షలోపే ఉండే అవకాశం ఉంది. గత ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించి మరీ ప్రవేశాలకు అనుమతి పొందిన 143 కాలేజీల్లో... 90 శాతం కాలేజీలకు 2015-16 ప్రవేశాల కోసం అనుబంధ గుర్తింపు లభించే పరిస్థితి కనిపించడం లేదు. వాటిల్లోని పదుల సంఖ్యలో కాలేజీలకు మాత్రమే అనుమతులు వచ్చే అవకాశం ఉంది. అది కూడా ఆయా కాలేజీలు మళ్లీ తనిఖీల సమయం నాటికి తమ కాలేజీల్లో ఫ్యాకల్టీని పక్కాగా నియమించి, సదుపాయాలు కల్పిస్తేనే. ప్రస్తుతం ఆ 143 కాలేజీల్లో 80కి పైగా కాలేజీలు సీట్ల తగ్గింపు కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయి. ఇక గత ఏడాది ప్రవేశాలు చేపట్టిన మరో 144 కాలేజీల్లో ఇప్పటికే 30 వరకు కాలేజీలు ప్రథమ సంవత్సరంలో తక్కువ సంఖ్యలో చేరిన విద్యార్థులను ఇతర కాలేజీల్లోకి బదలాయించాయి. మరో 30 కాలేజీలు ప్రస్తుత విద్యా సంవ త్సరంలో లోపాలతో నడుస్తుండడంతో అనుబంధ గుర్తింపు లభించే పరిస్థితి కనిపించడం లేదు. దీనికితోడు చాలా కాలేజీలు సీట్ల తగ్గింపునకు దరఖాస్తు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మొత్తానికి 2015-15 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య 130కి, సీట్ల సంఖ్య లక్ష వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. ఇక గత ఏడాది ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో పరీక్ష రాసినవారు 1,26,071 మంది కాగా.. ఈసారి వారి సంఖ్య 1.30 లక్షల వరకే ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో 287 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వాటిల్లో 1,80,425 సీట్లున్నాయి. అందులో కన్వీనర్ కోటాలో 1,14,291 సీట్లు ఉన్నాయి. అయితే గత ఏడాది యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చిన 144 కాలేజీల్లోని 85,021 సీట్లనే ప్రవేశాల కౌన్సెలింగ్‌లో చేర్చారు. ఇందులో కన్వీనర్ కోటాలో 68,516 సీట్లు అందుబాటులో ఉండగా... 55,925 మంది విద్యార్థులు మాత్రమే కాలేజీల్లో చేరారు. దీంతో కన్వీనర్ కోటాలోనే 13 వేల వరకు సీట్లు మిగిలిపోయాయి. ఇక 10 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒక్కో దాంట్లో 50 మందిలోపే విద్యార్థులు చేరారు. ఒక కాలేజీలోనైతే ఒక్కరూ చేరలేదు. ఇక పదిమందిలోపే విద్యార్థులు చేరిన కాలేజీలు రెండున్నాయి. వంద మందిలోపే విద్యార్థులు చేరిన కాలేజీల సంఖ్య 21 కావడం గమనార్హం. దీంతో దాదాపు 30 కాలేజీల యాజమాన్యాలు తమ కాలేజీల్లో చేరిన విద్యార్థులను ఇతర కాలేజీల్లో బదిలీ చేసేశాయి. ఫలితంగా ఆయా కాలేజీల్లో ప్రథమ సంవత్సరం కోర్సు నిలిచిపోయింది. అక్రమాలు ఇక బట్టబయలు.. కాలేజీల్లో సదుపాయాలు, అక్రమాలు, అవకతవకల చరిత్ర ఇకపై బహిరంగం కానుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ప్రత్యేక వెబ్సైట్లో అన్ని కాలేజీల సమగ్ర వివరాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచుతామని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించగా... కాలేజీల్లో సదుపాయాలు, ఫ్యాకల్టీపై నిపుణుల కమిటీలు చేసిన తనిఖీల నివేదికలను కూడా హైదరాబాద్ జేఎన్టీయూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. 2014-15 ప్రవేశాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 143 కాలేజీల్లో ప్రవేశాలకు అనుమతి ఇచ్చినా... ఇటీవల నిపుణుల కమిటీ నివేదికల తరువాత వాటి కి అనుబంధ గుర్తింపు ఇవ్వబోమని జేఎన్టీయూహెచ్ స్పష్టం చేసింది. ఆయా కాలేజీల్లో లోపాలు ఎక్కువగా ఉన్నందున 2015-16 విద్యా సంవత్సరంలోనూ అనుబంధ గుర్తింపు లభించడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో చాలా కాలేజీలు పూర్తిగా ప్రవేశాలకు దూరంకానున్నాయి. అవకాశమిచ్చినా.. లోపాల కారణంగా గత ఏడాది 143 కాలేజీలకు జేఎన్టీయూహెచ్ అఫిలియేషన్ ఇవ్వలేదు. దాంతో అవి సుప్రీంకోర్టుకు వెళ్లి ప్రవేశాలకు అనుమతి పొందాయి. నవంబర్‌లో వాటికి కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు. కానీ ఆ తర్వాత కూడా ఆయా కాలేజీలు లోపాలను సవరించుకోలేకపోయాయి. ఇటీవల నిపుణుల కమిటీలు చేసిన తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. ముఖ్యంగా అధ్యాపకుల సంఖ్య బాగా తక్కువగా ఉండడాన్ని అధికారులు గుర్తించారు. లోపాల పుట్టలు.. చాలా ఇంజనీరింగ్ కాలేజీల్లో సరైన సంఖ్యలో అధ్యాపకులు లేరు. ఉన్నవారిలోనూ చాలా మందికి సరైన అర్హతలు కూడా లేవు. ఇక ఇంజనీరింగ్ ప్రాక్టికల్స్ కోసం అవసరమైన ల్యాబ్‌లు, లైబ్రరీలు సరిగా లేవు. అంతేకాదు సరైన మౌలిక సౌకర్యాలూ లేకపోవడం గమనార్హం. ఇక తనిఖీల సందర్భంగా ఒక్కో అధ్యాపకుడినే చాలా కాలేజీల్లో చూపించడం వంటి బాగోతమూ బయటపడింది. 21 కాలేజీల్లో వంద మందిలోపే.. రాష్ట్రంలో 287 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వాటిల్లో 1,80,425 సీట్లున్నాయి. అందులో కన్వీనర్ కోటాలో 1,14,291 సీట్లు ఉన్నాయి. అయితే గత ఏడాది యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చిన 144 కాలేజీల్లోని 85,021 సీట్లనే ప్రవేశాల కౌన్సెలింగ్‌లో చేర్చారు. ఇందులో కన్వీనర్ కోటాలో 68,516 సీట్లు అందుబాటులో ఉండగా... 55,925 మంది విద్యార్థులు మాత్రమే కాలేజీల్లో చేరారు. దీంతో కన్వీనర్ కోటాలోనే 13 వేల వరకు సీట్లు మిగిలిపోయాయి. ఇక 10 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒక్కో దాంట్లో 50 మందిలోపే విద్యార్థులు చేరారు. ఒక కాలేజీలోనైతే ఒక్కరూ చేరలేదు. ఇక పదిమందిలోపే విద్యార్థులు చేరిన కాలేజీలు రెండున్నాయి. వంద మందిలోపే విద్యార్థులు చేరిన కాలేజీల సంఖ్య 21 కావడం గమనార్హం. దీంతో దాదాపు 30 కాలేజీల యాజమాన్యాలు తమ కాలేజీల్లో చేరిన విద్యార్థులను ఇతర కాలేజీల్లో బదిలీ చేసేశాయి. ఫలితంగా ఆయా కాలేజీల్లో ప్రథమ సంవత్సరం కోర్సు నిలిచిపోయింది. -
ఆ కాలేజీల కథ కంచికేనా..?
ఖమ్మం: ప్రభుత్వం అనుకున్నంత పనిచేసింది. హైదరాబాద్ జేఎన్టీయూ, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల అధికారులు విస్తృత తనిఖీలు చేశారు. జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలల స్థితిగతులపై ఓ నివేదిక అందజేశారు. ఆ నివేదిక జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలల కొంపముంచింది. సౌకర్యాలు, ఫ్యాకల్టీ, ల్యాబ్స్, తగినంత మంది విద్యార్థులు లేరనే కారణంతో నూతన విద్యాసంవత్సరానికి పలు కళాశాలలను రెన్యూవల్ చేయకుండా నిలిపివేశారు. అడ్మిషన్ల కోసం వెబ్ ఆప్షన్ మొదలైన రోజునే ఈ చేదువార్త విన్న ఇంజనీరింగ్ కళాశాలల యాజామాన్యాలు హైదరాబాద్‌కు పరుగులు తీశారు. గత సంవత్సరం అన్ని సజావుగా సాగితేనే సగం సీట్లు కూడా నిండలేదు. ఇప్పుడు కళాశాలల పునరుద్ధరణ చేయకపోవడం ఆయా కాలేజిల యాజమాన్యాలకు కంటిమీద కునుకులేకుండా పోయింది. ‘వందల కోట్ల రూపాయలు వెచ్చించి కళాశాలలు కట్టుకున్నాం. నిర్వహణ కోసం ప్రతియేటా లక్షల రూపాయలు అప్పు చేస్తున్నాం. ఇప్పుడు చెప్పాపెట్టకుండా పునరుద్ధరణ చేయకపోతే ఎలా? కళాశాలలను నమ్ముకొని జీవిస్తున్న వందలాదిమంది ఉద్యోగుల జీవితాలు వీధినపడ తాయి. విద్యార్థుల భవిష్యత్ కూడా అగమ్యగోచరంగా మారుతుంది. కాబట్టి మాకు వెసులుబాటు కల్పిం చాలి..’ అంటూ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నాయని సమాచారం. కొంపముంచిన తనిఖీ అధికారులు ఓవైపు ఎంసెట్ కౌన్సెలింగ్‌పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య వైరం నడుస్తుండగానే జిల్లాలోని కళాశాలల స్థితిగతులపై అధికారులు తనిఖీ చేశారు. కఠినంగా వ్యవహరించక తప్పదని..ఎక్కడా ఉపేక్షించేది లేదని వారు ఆనాడే తేల్చి చెప్పారు. వారి వ్యవహారశైలిని చూసి ఆయా కళాశాల యాజమాన్యం ఖంగుతింది. తనిఖీ సమయంలో వారు ప్రదర్శించిన దూకుడునే ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాలల పునరుద్ధరణ విషయంలోనూ చూపించారు. జిల్లాలోని సగానికి తక్కువ కళాశాలలకు మాత్రమే నిబంధనల మేరకు వసతులు, ఇతర సౌకర్యాలు, ఫ్యాకల్టీ, ల్యాబ్స్, ఉద్యోగుల నియామకం, వేతనాలు, క్రీడా మైదానాలు ఉన్నాయని తేల్చారు. మిగతా వాటిలో ఇవేవీ లేవని నిర్ధారించారు. ఈ నివేదిక ఆధారంగా జిల్లాలోని 23 ఇంజినీరింగ్ కళాశాలలకు గాను కేవలం తొమ్మిదింటిని మాత్రమే రెన్యూవల్ చేశారు. వెబ్ ఆప్షన్‌కు అనుమతించారు. జిల్లాలోనే సగానికి పైగా కళాశాలలు పునరుద్ధరణకు నోచుకోక అయోమయస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని 13వేల పైచిలుకు సీట్లుకు గాను ఏడువేల సీట్లకు గండిపడేలా ఉంది. అదను చూసి దెబ్బతీశారు.. అసలే కళాశాలల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు పలు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు నానా తంటాలు పడుతుంటే తీరా వెబ్ఆప్షన్లు మొదలైన రోజునే రెన్యూవల్ చేయడంలేదని ప్రభుత్వం ప్రకటించడంతో ఆయా కళాశాలల యాజమాన్యాల పరిస్థితి ‘మూలిగే నక్కపై తాటిపండు పడిన చందం’గా మారింది. గత సంవత్సరం తొలిదఫా ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ముగిసేనాటికి కేవలం 3,722 సీట్లు మాత్రమే నిండాయి. కనీస సంఖ్యలో విద్యార్థులను చేర్పించుకునేందుకు కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొన్ని కళాశాలలైతే విద్యార్థులకు ఎదురు డబ్బులు ఇచ్చి మరీ కాలేజీలో చేర్చుకున్నట్లు సమాచారం. దీనిని దృష్టిలో పెట్టుకొని పలు కళాశాలల యాజమాన్యాలు ఇంటర్ ఫలితాలు వచ్చిన నాటి నుండే విద్యార్థుల వేటలో పడ్డాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాకుండా బీహార్ తదితర రాష్ట్రాల నుంచీ విద్యార్థులను చేర్పించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఇప్పటికే లక్షలాది రూపాయలు వెచ్చించారు. ఈ పరిస్థితిలో కళాశాలలు రెన్యూవల్స్ కాకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. మలివిడత కౌన్సెలింగ్ నాటికైనా రెన్యూవల్స్ చేయించుకునేందుకు కళాశాలల యాజమాన్యాలు హైదరాబాద్‌లో ఉండి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికే ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కళాశాలలకు అనుమతి ఇచ్చేది లేదని ప్రకటించడం యాజమాన్యాలకు ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి పరిస్థితిలో ఇంజనీరింగ్ కళాశాలల భవితవ్యం ఏవిధంగా ఉంటుందో అని జిల్లాలో చర్చనీయాంశమైంది.