ఈసెట్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల | TS ECET 2020 Schedule Released From JNTUH | Sakshi
Sakshi News home page

ఈసెట్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల

Published Sat, Aug 29 2020 7:25 PM | Last Updated on Sat, Aug 29 2020 7:33 PM

TS ECET 2020 Schedule Released From JNTUH - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఈసెట్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 31న రెండు సెషన్‌లలో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 6 వరకు మరో సెషన్‌లో పరీక్ష ఉండనుంది. కంప్యూటర్ ఆన్‌లైన్‌ ద్వారా పరీక్ష నిర్వహిస్తున్నట్లు జేఎన్టీయూ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 52, ఏపీలో నాలుగు పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement