entrence exam
-
నేడు ఆర్జీయూకేటీ సెట్
నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న నాలుగు ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఆదివారం ఆర్జీయూకేటీ సెట్ నిర్వహిస్తున్నారు. ప్రవేశ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. మొత్తం 75,283 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని.. పరీక్ష నిర్వహణకు ఏపీలో 467, తెలంగాణలో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తామని.. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఫలితాలను అక్టోబర్ 4న మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేస్తారని పేర్కొన్నారు. కోవిడ్ వల్ల 10వ తరగతి పరీక్షలు జరగనందున.. ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీకి ఆర్జీయూకేటీ సెట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. దరఖాస్తు చేసిన మొత్తం అభ్యర్థుల్లో 40,555 మంది బాలురు, 34,728 మంది బాలికలున్నారని తెలిపారు. ట్రిపుల్ ఐటీల్లో ఇంక్యుబేషన్ సెంటర్లు.. వచ్చే ఏడాదిలోగా నూజివీడు, శ్రీకాకుళం, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ఆర్జీయూకేటీ చాన్సలర్ కేసీ రెడ్డి తెలిపారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అనేక కంపెనీల్లో ఉద్యోగాలు సాధించి.. మంచి ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. 2008–14 బ్యాచ్‌కు చెందిన జి.విద్యాధరి సివిల్ సర్వీసెస్‌లో 211వ ర్యాంకు, అలాగే 2012వ బ్యాచ్‌కు చెందిన చీమల శివగోపాల్‌రెడ్డి 263వ ర్యాంకు సాధించారని తెలిపారు. ఇడుపులపాయ, నూజివీడులో సోలార్ పవర్ ప్లాంట్లు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. వీటివల్ల ఏడాదికి రూ.కోటికి పైగా నిధులు ఆదా అవుతున్నాయని తెలిపారు. శ్రీకాకుళంలో కూడా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే అనలాగ్ డివైజెస్ కంపెనీ ఈ ఏడాది 50 మంది విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌కు ఎంపిక చేసుకుందని చెప్పారు. మెంటార్లను రెగ్యులర్ చేయడానికి అవకాశం లేదని.. 4 ట్రిపుల్ ఐటీల్లో 400 వరకు లెక్చరర్ పోస్టులున్నాయని, వారిని ఆ పోస్టుల్లో నియమిస్తామని తెలిపారు. సమావేశంలో ఆర్జీయూకేటీ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ కె.సామ్రాజ్యలక్ష్మి, సెట్ కన్వీనర్ డి.హరినారాయణ, నూజివీడు డైరెక్టర్ జి.వి.ఆర్.శ్రీనివాసరావు సెట్ కో–కనీ్వనర్ ఎస్.ఎస్.ఎస్.వి.గోపాలరాజు, ఏఓ భానుకిరణ్, డీన్ అకడమిక్స్ దువ్వూరి శ్రావణి పాల్గొన్నారు. -
పిజి లా సెట్ ప్రవేశ పరీక్ష
-
ప్రవేశ పరీక్షలు రాసేదెలా?
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఇంటర్ విద్యార్థులకు టెన్షన్ పెరిగిపోతోంది. కరోనా మూలంగా ఇంకా కాలేజీలే మొదలు కాలేదు... అప్పుడే ఏడునెలల విలువైన కాలం గడిచిపోయింది. మరోవైపు ఎంట్రన్స్ ఎగ్జామ్స్, వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్నాయి. దాంతో రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ చదివే దాదాపు 3 లక్షల మంది విద్యార్థులకు ప్రవేశ పరీక్షల భయం పట్టుకుంది. ప్రత్యక్ష బోధన లేక, డిజిటల్/ఆన్లైన్ బోధన అర్థంకాక తలపట్టుకుంటున్న విద్యార్థులను... ఒక్కొక్కటిగా ప్రవేశపరీక్షల నోటిఫికేషన్ల జారీ షురూ కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే జేఈఈ మెయిన్ నోటిఫికేషన్ జారీ, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావడంతో తమ చదువులెలా? అన్న ఆవేదనలో విద్యార్థులు పడ్డారు. ప్రత్యక్ష బోధన లేని ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలే కాదు.. ఎంసెట్ వంటి రాష్ట్ర ప్రవేశ పరీక్షల్లోనైనా నెగ్గుకు రాగలుగుతామా? అన్న భయం వారిని వెంటాడుతోంది. ఏపీ విద్యార్థుల నుంచే ప్రధాన పోటీ జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్, నీట్ వంటి జాతీయ పరీక్షలకు సిద్ధం కావాలన్నా, ఎంసెట్ లాంటి రాష్ట్ర స్థాయి పరీక్షలు రాయాలన్న ప్రత్యక్ష బోధన ఉండాల్సిందేనని అధ్యాపకులే చెబుతున్నారు. రాష్ట్రంలో సెపె్టంబర్ 1 నుంచి ఆన్లైన్/ డిజిటల్ బోధన చేపట్టినా ఫలితం అంతంతేనంటున్నారు. విభజన చట్టం ప్రకారం విద్యా సంస్థల్లోని ఓపెన్ కోటా 20% సీట్లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పోటీ పడతారు. ఎంసెట్‌లో తీవ్ర పోటీ ఉంటుంది. హైదరాబాద్‌లో టాప్ కాలేజీ లు ఎక్కువగా ఉండటంతో ఏపీ విద్యార్థులు తెలం గాణ ఎంసెట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఏపీలో నవంబర్ 2 నుంచే ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది. దాదాపు 30% సిలబస్ కూడా పూర్తయినట్లు ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. తెలంగాణతో పోలిస్తే ప్రిపరేషన్ మెరుగ్గా ఉంది కాబట్టి ఓపెన్ కోటాలో ఏపీ విద్యార్థులకు ఎక్కువ శాతం సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. వార్షిక పరీక్షలూ కష్టమే రాష్ట్రంలో సెపె్టంబర్ 1 నుంచి ఆన్లైన్/డిజిటల్ విద్యా బోధన ప్రారంభమైంది. అయితే విద్యార్థులంతా డిజిటల్ పాఠాలను వినడం లేదని అధ్యాపకులే చెబుతున్నారు. టీశాట్‌లో వీడియోపాఠాలు ప్రసారం చేస్తున్నా విద్యార్థులకు అర్థం కావడం లేదని, ఆన్లైన్లో అందుబాటులో ఉంచిన వీడియో పాఠాలపై అనుమానాలు వస్తే నివృత్తి చేసుకునే అవకాశం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడతున్నారు. మొత్తానికి 50 శాతం మంది విద్యార్థులు అంతంతగానే పాఠాలు నేర్చుకునే పరిస్థితి నెలకొనగా, 30 శాతం మంది విద్యార్థులు అసలు పాఠాలే వినడం లేదని ఆన్లైన్/డిజిటల్ బోధనను పర్యవేక్షిస్తున్న లెక్చరర్లు చెబుతున్నారు. మరోవైపు వచ్చే ఏప్రిల్‌లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను నిర్వహించేలా ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు అకడమిక్ కేలండర్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వీడియో పాఠాలు అర్థంకాక, కొంత మంది పాఠాలే వినలేని పరిస్థితుల్లో వార్షిక పరీక్షలు ఎలా రాస్తారన్న ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొంది. నిర్ణయం తీసుకునేదెప్పుడు? ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులను ఎలాగోలా పాస్ చేసినా, ఇంటరీ్మడియట్ విషయంలో ప్రత్యక్ష బోధన లేకుండా ఎలా ముందుకు సాగాలన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. అంతేకాదు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్షలు రాసి, మెరుగైన ర్యాంకులు సాధిస్తేనే వివిధ వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలను పొందగలుగుతారు. అయితే ప్రత్యక్ష విద్యా బోధన లేకుండా విద్యార్థులు ఎలా ప్రవేశ పరీక్షలకు సిద్ధం అవుతారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయినా నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. కాలేజీలు తెరిచేందుకు గతంలోనే ప్రతిపాదనలను పంపించినా వాటికి మోక్షం లభించకపోవడంతో ఇంటర్‌బోర్డు, ఇంటరీ్మడియట్ విద్యాశాఖ చేతులు ముడుచుకొని కూర్చోవాల్సి వస్తోంది. పాఠాలు అర్థం కావడం లేదు కెమిస్ట్రీ సబ్జెక్టుకు సంబంధించిన అధ్యాపకులు టీవీలో ఏకధాటిగా చెబుతూ వెళ్తుండటం, చెప్పింది అర్థం కాకపోవడం ఇబ్బంది కలిగిస్తోంది. నోట్స్ రాసుకునే సమయం ఇవ్వడం లేదు. టీవీలో పాఠం వింటూ వేగంగా నోట్స్ రాసుకోవడమే తప్ప.. తిరిగి వారిని డౌట్లు అడిగే వీలు లేదు. – మనీష, ఇంటర్ ద్వితీయ సంవత్సరం, నయాబజార్ కళాశాల, ఖమ్మం అనుమానాలు నివృత్తి చేసుకునే అవకాశం లేదు ఆన్లైన్లో పాఠాలు వింటున్నా. అయితే క్లాస్‌రూమ్‌లో వింటున్న అనుభూతి.. డౌట్ వస్తే అధ్యాపకులను అడిగి నివృత్తి చేసుకునే వెసులుబాటు లేదు. డిజిటల్ క్లాసులు వేగంగా కొనసాగుతున్నాయి. పాఠం అర్థమైందో..లేదో తెలుసుకునే అవకాశం అధ్యాపకులకు లేదు. – ఉష, బైపీసీ, ద్వితీయ సంవత్సరం, నయాబజార్ కళాశాల, ఖమ్మం వన్‌వే బోధనతో లాభం లేదు మొదట్లో 80 శాతం మంది పాఠాలు విన్నారు. ఇప్పుడది చాలా వరకు తగ్గిపోయింది. నెట్వర్క్, ఇతరత్రా సమస్యలతో వినడం లేదు. ఆన్లైన్/ డిజిటల్ బోధన ప్రత్యక్ష బోధనకు ప్రత్యామ్నాయం కాదు. విద్యార్థి– అధ్యాపకుల మధ్య ఉన్న అనుబంధం లేకుండా పోయింది. వన్‌వే వల్ల విద్యార్థుల్లో నేర్చుకోవాలనే ఆసక్తి పోయింది. –కృష్ణకుమార్, ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపాళ్ల సంఘం అధ్యక్షుడు విద్యార్థులకు తీవ్ర నష్టం ఇంటర్లో ప్రత్యక్ష విద్యా బోధనపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలి. లేదంటే రాష్ట్ర విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ప్రత్యక్ష బోధనకు డిజిటల్ బోధన సాటిరాదు. డిజిటల్ బోధన వల్ల విద్యార్థులకు పాఠాలు అర్థం అయ్యేది అంతంతే. ప్రత్యక్ష బోధన లేకుండా విద్యార్థులకు పరీక్షల నిర్వహణ కష్టమే. – డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు -
నేడే ‘నీట్’
సాక్షి, హైదరాబాద్ : వైద్య విద్య ప్రవేశాల నిమిత్తం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) ఆదివారం దేశ వ్యాప్తంగా జరగనుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. అయితే అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచే పరీక్షాకేం ద్రాల్లోకి అనుమతిస్తారు. ఎవరు ఎప్పుడు పరీక్షాకేంద్రానికి రావాలో ముందేవారికి మెసేజ్‌లు పంపించారు. కరోనా నేపథ్యంలో ఎక్కువమంది ఒకేసారి రాకుండా నివారించాలనేది ఉద్దే శం. జ్వరం ఉందో లేదో ప్రవేశద్వారం వద్ద ఒక్కో అభ్యర్థిని పరిశీలించి లోపలికి అనుమతిస్తారు. అభ్యర్థులు తమ వెంట లోపలికి తీసుకెళ్లేందుకు మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు, నీళ్ల బాటిళ్లనుఅనుమతిస్తారు. తెలంగాణ నుంచి ఈ ఏడాది 55,800 మంది నీట్‌కు హాజరు కానున్నారు. ఒక్కో గదిలో కేవలం 12 మంది ఉండేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏర్పాట్లు చేసింది. భౌతిక దూరం పాటించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి నీట్ రాసే విద్యార్థులకు డ్రెస్‌కోడ్ విధించారు. సంప్రదాయ దుస్తులతో హాజరయ్యేవారు(బురఖా వంటివి) ఓ గంట ముందే పరీక్షా కేంద్రా లకు హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్థుల హాల్ టికెట్లో మూడు పేజీలుంచి, పాటించాల్సిన నియమ నిబంధనలను వివరించారు. తమ ఆరోగ్య పరిస్థితిని వివరించే సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం కూడా ఉంచారు. నీట్ ఫలితాలు వచ్చే నెల రెండోవారంలో వస్తాయని ఎన్టీఏ ప్రకటించింది. -
ఈసెట్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఈసెట్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 31న రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 6 వరకు మరో సెషన్లో పరీక్ష ఉండనుంది. కంప్యూటర్ ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తున్నట్లు జేఎన్టీయూ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 52, ఏపీలో నాలుగు పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. -
సెట్స్ దరఖాస్తులు 4,68,271
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు (సెట్స్) రాసేందుకు 4.68 లక్షల మందికిపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎంసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, ఈసెట్, పీజీఈసెట్, పీఈసెట్, లాసెట్, పాలీసెట్‌కు ఈనెల 10తో దరఖాస్తు గడువు ముగిసిపోగా, ఆ తరువాత నుంచి ఆలస్య రుసుముతో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు ఆయా సెట్స్‌కు 4,68,271 మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా ఎంసెట్‌కు 2,21,505 మంది దరఖాస్తు చేసుకోగా, ఆ తరువాత పాలీసెట్‌కు 64,454 మంది, ఐసెట్‌కు 55,012 మంది దరఖాస్తు చేసుకున్నారు. 3 వరకు ఎంసెట్ హాల్‌టికెట్ల డౌన్లోడ్ జూలై 6–9 తేదీల మధ్య నిర్వహించే ఎంసెట్‌కు గతేడాది కంటే ఈసారి ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది 2.17 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఈసారి 2,21,505 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఇంజనీరింగ్ కోసం 1,42,645 మంది, అగ్రికల్చర్ కోసం 78,565 మంది, రెండింటి కోసం 295 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. విద్యార్థులు ఈ నెల 30 నుంచి వచ్చే నెల 3 వరకు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. జూలై 1న 250 కేంద్రాల్లో పాలీసెట్ పదో తరగతి ఉత్తీర్ణులై.. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జూలై 1న పాలీసెట్ 2020 ప్రవేశపరీక్షను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) కార్యదర్శి యూవీఎస్ఎన్ మూర్తి వెల్లడించారు. విద్యార్థులు ఫీజు చెల్లించినప్పుడే హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 250 కేంద్రాల్లో జరిగే పాలీసెట్‌కు 38,404 మంది బాలురు, 26,050 మంది బాలికలు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలను ఒకరోజు ముందే వెళ్లి చూసుకోవాలని సూచించారు. జూలై 4న ఈసెట్ పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసుకున్న విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు (లేటరల్ ఎంట్రీ) ఉద్దే శించిన ఈసెట్‌ను జూలై 4న నిర్వహించేందుకు అన్ని ఏర్పా ట్లు చేసినట్లు ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. ఆన్లైన్లో పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు తమ వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. కాగా, జూలై 1 నుంచి 4 వరకు నిర్వహించే పీజీఈసెట్ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు ఇప్పటికే చర్యలు చేపట్టామని పీజీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కుమార్ వెల్లడించారు. విద్యార్థులు ఈ నెల 30 వరకు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. జూలై 5 నుంచి ఎడ్‌సెట్ హాల్‌టికెట్లు జూలై 15న నిర్వహించే ఎడ్‌సెట్ కోసం జూలై 5 నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ మృణాళిని తెలిపారు. ఇక పీఈసెట్‌కు హాజరయ్యేందుకు 5,457 మంది దరఖాస్తు చేసుకున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ చెప్పారు. ఈసారి స్కిల్టెస్టును రద్దు చేశామని, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టు మాత్రమే ఉంటుందని, త్వరలోనే తేదీని ఖరారు చేస్తామని తెలిపారు. జూలై 13న జరిగే ఐసెట్‌కు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 30 నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి తెలిపారు. జూలై 2 నుంచి లాసెట్ హాల్‌టికెట్లు లాసెట్‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో పురుషులే ఎక్కువగా ఉన్నారు. మొత్తంగా 28,805 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 20,575 మంది పురుషులే. ఈసారి న్యాయవిద్య కోర్సుల్లో చేరేందుకు ఐదుగురు ట్రాన్స్జెండర్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ముగ్గురు మూడేళ్ల న్యాయవిద్య కోర్సులో చేరేందుకు, ఇద్దరు ఐదేళ్ల కోర్సులో చేరేందుకు దరఖాస్తు చేసినట్లు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీబీరెడ్డి తెలిపారు. జూలై 10న నిర్వహించే లాసెట్ కోసం.. 2వ తేదీనుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. -
జూలైలో ‘నీట్’?
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వైద్య ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే ‘నీట్’పరీక్షను వచ్చే జూలైలో నిర్వహించాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) సూత్రప్రాయంగా నిర్ణయించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రకాల అర్హత పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇటు ఈ నెల 3న జరగాల్సిన నీట్ పరీక్ష కూడా వాయిదా పడింది. దీంతో నీట్ ఎప్పుడు నిర్వహిస్తారా అన్న దానిపై విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. జూలై నాటికి పరిస్థితులు కుదుటపడితే ఆ నెలలో నీట్ నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల 16 రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య విశ్వవిద్యాలయాల వైస్‌చాన్స్‌లర్లతో ఎంసీఐ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. మరోవైపు కరోనా నేపథ్యంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌కు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ (ఏఐహెచ్‌ఎస్‌యూ) లేఖ రాసింది. చదవండి: ఈ ఏడాది చివరికల్లా టీకా! ఆన్లైన్ తరగతులు.. హాజరు సమస్య బోర్డు ఆఫ్ గవర్నర్‌కు రాసిన లేఖలో ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఆన్లైన్ తరగతులు, పరీక్షల నిర్వహణ కష్టతరంగా మారిందని ఏఐహెచ్‌ఎస్‌యూ తెలి పింది. విద్యా సంవత్సరం ప్రారం భం కాబోతుండటం, పరీక్షలు, తరగతుల నిర్వహణ ఎలా చేపట్టాలన్న దానిపై లేఖలో ప్రస్తావించారు. ప్రధానంగా ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నా హాజరు శాతాన్ని పర్యవేక్షించడం కష్టతరం అవుతోందని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్లో ఆన్లైన్ హాజరును కూడా పరి గణనలోకి తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా ఇది సుదీర్ఘకాలం సాగే ప్రక్రియ కాబట్టి క్లాసు రూం తరగతుల నిర్వహణలోని నిబంధనల్లో మార్పులు తెచ్చే విధంగా చట్ట సవరణ చేయాలని విజ్ఞప్తి చేశారు. వైరస్ కారణంగా యూజీ, పీజీ మెడికల్ పరీక్షల నిర్వహణకు అంతరాయం కలిగింది. దీంతో కొన్ని విశ్వవిద్యాలయాల పరిధిలోని విద్యార్థులు తమకు ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు పంపాలని డిమాండ్ చేస్తున్నారని ఎంసీఐ దృష్టికి తీసుకొచ్చారు. ఇక పరీక్షల నిర్వహణను పర్యవేక్షించే పరిశీలకులను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చే పరిస్థితి ప్రస్తుతం లేదని పేర్కొన్నారు. వీలైతే ఇతర యూనివర్సిటీల నుంచి, లేకుంటే యూనివర్సిటీ అనుబంధ కాలేజీల నుంచి, అది సాధ్యం కాకుంటే యూనివర్సిటీలోని ఇంటర్నల్ ఎగ్జామినర్లను అనుమతించాలని లేఖలో కోరారు. -
అన్ని ఎంట్రెన్స్ టెస్టులు వాయిదా
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రవేశ పరీక్షలను ఉన్నత విద్యా మండలి అధికారికంగా వాయిదా వేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఆదివారం ప్రకటించింది. వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించాల్సిన ఉమ్మడి ప్రవేశ పరీక్షలను (సెట్స్) వాయిదా వేసినట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. లాక్‌డౌన్‌ను ఈనెల 30వ తేదీ వరకు పొడగించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా వచ్చే నెల 5వ తేదీ వరకు ఆయా సెట్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ముందస్తు షెడ్యూలు ప్రకారం మే 2వ తేదీన ఈసెట్, 4, 5, 7, 9, 11 తేదీల్లో ఎంసెట్, మే 13 నుంచి పీఈసెట్, మే 20, 21 తేదీల్లో, 23వ తేదీన ఎడ్‌సెట్, 27వ తేదీన లాసెట్, 28నుంచి 31వ తేదీ వరకు పీజీ ఈసెట్ నిర్వహించాల్సి ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో వాటన్నింటిని వాయిదా వేస్తున్నట్లు వివరించారు. మళ్లీ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వాన్ని సంప్రదించి తదుపరి ప్రకటన చేస్తామన్నారు. -
కేవలం 29 సబ్జెక్టులకే పరీక్షలు
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12 తరగతులకు సంబంధించిన పరీక్షల వివరాలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ బుధవారం వెల్లడించారు. ఆయా తరగతుల్లో అతి ముఖ్యమైన 29 సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు పెట్టేలా సీబీఎస్ఈకి మంత్రి రమేశ్ సూచించారు. పరీక్షలు పెట్టదగ్గ సమయం వచ్చినప్పుడు పరీక్షలు ఉంటాయని అయితే అది కేవలం ఆ 29 సబ్జెక్టులకు మాత్రమే ఉంటాయన్నారు. మిగిలిన సబ్జెక్టులకు పరీక్షలుగానీ, మార్కులుగానీ ఉండవని తెలిపారు. 1–8 క్లాసుల విద్యార్థులు ప్రమోట్! కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో 1–8 తరగతులు చదువుతున్న విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలంటూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)కి సూచించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా బుధవారం వెల్లడించారు. ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పొడిగింపు కొత్త తేదీలు ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ).. వివిధ ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువును పొడిగించింది. కొన్నింటిని ఈనెల 30 వరకు, కొన్ని పరీక్షలకు వచ్చే నెల 15, 16, 31 తేదీల వరకు గడువును పెంచింది. మార్చి 31తో ముగిసిన నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జేఈఈ దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 30 వరకు పొడిగించారు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ పీహెచ్డీ, ఎంబీఏ ప్రవేవేశాలకు నిర్వహించాల్సిన అడ్మిషన్ టెస్టు దరఖాస్తుల స్వీకరణ గడువు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, జేఎన్‌యూ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువు కూడా ఈనెల 30 వరకు పొడిగించారు. యూజీసీ నెట్ (జూన్) దరఖాస్తుల గడువును మే 16కి పొడిగించారు. సీఎస్ఐఆర్ నెట్ దరఖాస్తుల గడువు మే 15కి, ఆల్ఇండియా ఆయుష్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్టు (ఏఐఏపీజీఈటీ) దరఖాస్తు గడువును మే 31కి పెంచారు. -
ఏప్రిల్ 19న ఓపెన్ యూనివర్సిటీ అర్హత పరీక్ష
లాలాపేట: డా. బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2020–21 విద్యా సంవత్సరానికి వివిధ డిగ్రీ కోర్సుల్లో (బీఏ, బీకాం, బీఎస్సీ) చేరడానికి ఏప్రిల్ 19న రాష్ట్ర వ్యాప్తంగా అర్హత పరీక్షను (ఎలిజబిలిటీ టెస్టు) నిర్వ హించనుంది. ఈ మేరకు యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిలర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దునుకు వేలాద్రి, డా. పర్వతం వెంకటేశ్వర్లు, డా. బాల్‌రెడ్డి, సాయిబాబా, సత్యానందం తదితరులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎటువంటి విద్యార్హత లేక పోయినా ఈ సంవత్సరం జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఈ పరీక్ష రాయవచ్చన్నారు. తెలంగాణ ఆన్లైన్, ఏపీ ఆన్లైన్ సెంటర్ల ద్వారా ఏప్రిల్ 4 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9959850497, 9000729590 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. -
పాలిసెట్–2019 నోటిఫికేషన్ జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్–2019 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి బుధవారం జారీ చేసింది. ఇదివరకే పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులతోపాటు ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పాలిసెట్ రాయవచ్చని పేర్కొంది. ఈ నెల 14 నుంచి వచ్చే నెల 4వ తే దీ సాయంత్రం 5 గంట ల వరకు ఆన్లైన్లో (ఠీఠీఠీ.ఞౌ yఛ్ఛ్టి్టట. nజీఛి.జీn) దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. విద్యార్థులు రూ.400 ఫీజు చెల్లించాలని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే రూ.250 ఫీజు చెల్లించి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చని పేర్కొంది. టీఎస్ ఆన్లైన్, మీ సేవ కేంద్రాల్లో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల ని సూచించింది. ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 16న ఉదయం 11 నుంచి మధ్యా హ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్ 24న ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొంది. అనంతరం వెబ్ ఆప్షన్లు తీసుకొని ప్రవేశాలు చేపడతామని, పూర్తి స్థాయి షెడ్యూలును తరువాత ప్రకటిస్తామని వివరించింది. వివరాలను తమ వెబ్సైట్లో పొందవచ్చని తెలిపింది. ఇదీ షెడ్యూలు.. 14–3–2019 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం 4–4–2019 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు 16–4–2019 ప్రవేశ పరీక్ష 24–4–2019 ఫలితాలు -
80 సీట్లు.. 8113 దరఖాస్తులు
కాగజ్‌నగర్: ఉమ్మడి జిల్లాలోని కాగజ్‌నగర్ పట్టణంలో గల జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశానికి తీవ్ర పోటీ నెలకొంది. జాతీయ విద్యావిధానం అనుసరించి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి ఈసారి గతంలో పోల్చితే కాస్త తక్కువ పోటీ ఉంది. 2019– 20 విద్యా సంవత్సరానికి సంబంధించి మొత్తం 80 సీట్లు ఉండగా ఏకంగా 8113 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన ఒక్కో సీటుకు 101 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. నవోదయలో ఒక్కసారి సీటు సాధించారంటే చాలు 12వ తరగతి వరకు ఉన్నత ప్రమాణాలతో కూడిన అధునాతన విద్య, సంస్కృతి, సాంప్రదాయ విలువలు, సాహసోపేత కృత్యాలు, క్రీడలు, పౌష్టికాహారంతోపాటు సమున్నత శిక్షణ లభిస్తాయి. ఈ నేపథ్యంలో సాధారణంగానే పోటీ అధికంగా ఉంటుంది. ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థుల ఓఎంఆర్ షీట్లను ఢిల్లీకి పంపిస్తారు. అక్కడే సీబీఎస్ఈలో విద్యార్థుల ఎంపిక జరుగుతోంది. గ్రామీణ విద్యార్థులకు ప్రాధాన్యం.. కాగజ్‌నగర్ నవోదయ విద్యాలయంలో ఇప్పటి వరకు 25 బ్యాచ్‌లు నిర్వహించారు. ప్రస్తుతం 26వ బ్యాచ్ కొనసాగుతుండగా 480 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కాగా నవోదయలో ప్రవేశానికి గ్రామీణ విద్యార్థులకు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఇందులో 75 శాతం గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు, 25 శాతం పట్టణ ప్రాంతాల విద్యార్థులకు, 3 శాతం దివ్యాంగులకు రిజర్వు చేశారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, మిగతా ఖాళీలు ఓపెన్ కేటగిరిలో ఎంపిక చేస్తారు. బాలికలు 33 శాతం, బాలురు 77 శాతం రిజర్వేషన్‌తో ఎంపిక జరుగుతుంది. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ, నేపాలీగారో భాషలలో పరీక్షలు నిర్వహిస్తుండడం విశేషం. తగ్గిన దరఖాస్తులు.. నవోదయలో 6వ తరగతిలో 80 సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించగా 8113 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో సీటుకు 101 మంది పోటీ పడుతున్నా దరఖాస్తులు ఈసారి తక్కువగానే వచ్చాయి. 2018– 19 సంవత్సరానికి 12,421 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి దాదాపు 4వేల దరఖాస్తులు తగ్గాయి. అప్పుడు ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించగా ఈసారి కేవలం ఆన్లైన్ ద్వారానే స్వీకరించారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన ఆన్లైన్ సెంటర్లు లేకపోవడంతో దరఖాస్తులు తక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి వచ్చిన 8113 దరఖాస్తుల్లో ఆదిలాబాద్ జిల్లా నుంచి 1998, నిర్మల్ నుంచి 2046 మంది, మంచిర్యాల నుంచి 2094 మంది, కుమురం భీం జిల్లా నుంచి 1995 దరఖాస్తులు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 32 పరీక్ష కేంద్రాలు.. ప్రవేశ పరీక్ష నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 32 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్, ఉట్నూర్ బ్లాక్‌లలో 8 కేంద్రాలు, నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, భైంసా బ్లాక్‌లలో 8 పరీక్ష కేంద్రాలు, మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేట, చెన్నూర్, మందమర్రి బ్లాక్‌లలో 8 కేంద్రాలు, కుమురం భీం జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, సిర్పూర్(టి) బ్లాక్‌లలో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 100 మార్కుల పరీక్షలో 50 ప్రశ్నలు, 50 మార్కులు మెంటల్ ఎబిలిటీపై, 25 ప్రశ్నలు, 25 మార్కులు, అర్థమెటిక్‌పై, 25 ప్రశ్నలు, 25 మార్కులు భాషా నైపుణ్యంపై పరీక్ష ఉంటుంది. 2న 9వ తరగతికి పరీక్ష.. కాగజ్‌నగర్ నవోదయలో 9వ తరగతిలో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ సీట్ల భర్తీ కోసం ఫిబ్రవరి 2న ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందుకు సైతం తీవ్ర పోటీ నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 275 మంది విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. 2న విద్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ చక్రపాణి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్‌టికెట్లు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రతిభ ఆధారంగానే ఎంపిక విద్యార్థుల ప్రతిభ ఆధారంగానే నవోదయ విద్యాయంలో ప్రవేశాలకు ఎంపిక జరుగుతోంది. ప్రవేశ పరీక్ష పారదర్శకంగా నిర్వహిస్తాం. విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి అపోహలను నమ్మవద్దు. విద్యార్థుల ఎంపిక ఢిల్లీలోని విద్యాలయ సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది. అయితే గతేడాదికంటే ఈసారి దరఖాస్తులు చాలా తగ్గాయి. ఈఏడాది కేవలం ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ చేపట్టడంతో వేలల్లో సంఖ్య తగ్గింది. – చక్రపాణి, ప్రిన్సిపల్ -
కొనసాగుతున్న ఐసెట్ పరీక్ష
హైదరాబాద్ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరేందుకు ఐసెట్ ప్రవేశ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ జరిగే ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 1,42,464 మంది అభ్యర్థులు హాజరు అవుతున్నారు. ఇందుకోసం అధికారులు 263 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా ఐసెట్ పరీక్షకు సెట్- బి ప్రశ్నాపత్రంను అధికారులు శుక్రవారం ఉదయం ఎంపిక చేశారు. ఈనెల 26న ఐసెట్ కీ విడుదల చేస్తారు. జూన్ 9వ తేదీన ఐసెట్ ఫలితాలు వెలువడతాయి.