ఏప్రిల్‌ 19న ఓపెన్‌ యూనివర్సిటీ అర్హత పరీక్ష  | Dr BR Ambedkar Open University Entrance Exam On 19/203/2020 | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 19న ఓపెన్‌ యూనివర్సిటీ అర్హత పరీక్ష 

Published Tue, Mar 24 2020 2:48 AM | Last Updated on Tue, Mar 24 2020 2:48 AM

Dr BR Ambedkar Open University Entrance Exam On 19/203/2020 - Sakshi

లాలాపేట: డా. బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2020–21 విద్యా సంవత్సరానికి వివిధ డిగ్రీ కోర్సుల్లో (బీఏ, బీకాం, బీఎస్సీ) చేరడానికి ఏప్రిల్‌ 19న రాష్ట్ర వ్యాప్తంగా అర్హత పరీక్షను (ఎలిజబిలిటీ టెస్టు) నిర్వ హించనుంది. ఈ మేరకు యూనివర్సిటీ అకడమిక్‌ కౌన్సిలర్‌ వెల్‌ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దునుకు వేలాద్రి, డా. పర్వతం వెంకటేశ్వర్లు, డా. బాల్‌రెడ్డి, సాయిబాబా, సత్యానందం తదితరులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎటువంటి విద్యార్హత లేక పోయినా ఈ సంవత్సరం జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఈ పరీక్ష రాయవచ్చన్నారు. తెలంగాణ ఆన్‌లైన్, ఏపీ ఆన్‌లైన్‌ సెంటర్ల ద్వారా ఏప్రిల్‌ 4 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9959850497, 9000729590 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement