సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు సోమవారం విడుదల చేసింది. థియరీ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి మే 10 వరకు.. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఉంటాయని తెలిపింది. ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారని, ఎత్నిక్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్‌మెంట్ సబ్జెక్టులు తీసుకున్న వారికి ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఈ పేపర్లకు పరీక్షలు ఉంటాయని బోర్డు వెల్లడించింది. ఒకేషనల్ సహా జనరల్ ఇంటర్ విద్యార్థుల పరీక్షల షెడ్యూల్ ఈ విధంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment