
సాక్షి, హైదరాబాద్: జేఎన్‌టీయూహెచ్ సెంటర్ ఫర్ స్పేషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో కొత్తగా ఏర్పాటు చేసిన గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్‌ఎస్‌ఎస్) ప్రయోగశాలను వైస్‌చాన్స్‌లర్ వేణుగోపాల్‌రెడ్డి, నోవాటెల్ సాఫ్ట్‌వేర్ డైరెక్టర్ మైఖెల్ కినాహాన్‌లు గురువారం ప్రారంభించారు. జేఎన్‌టీయూహెచ్, హెక్సాగన్ కేపబిలిటీ సెంటర్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ప్రకృతి వనరుల నిర్వహణలో ఉపగ్రహ ఆధారిత నావిగేషన్‌లో విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించేందుకు నూతన ప్రయోగ శాల ఉపయోగపడుతుందని వీసీ అన్నారు. సహాజ వనరుల డేటా ప్రాసెసింగ్, విశ్లేషణతో పాటు వాటిని సద్వినియోగం చేసుకునే దిశగా మెరుగైన పరిశోధనలకు ఊతమిస్తుందన్నారు.
విద్యార్థులకు శిక్షణ, ఇంటర్న్‌షిప్‌తో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. జేఎన్‌టీయూహెచ్‌లోని స్పేషియల్ ఇన్ఫర్మే షన్ టెక్నాలజీ విభాగం విద్యా ర్థులతో పాటు జియో ఇన్ఫ ర్మాటిక్స్ విభాగాలకు చెందిన విద్యార్థులందరూ కొత్త ల్యాబ్ సేవలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ హెచ్ రెక్టార్ ఎన్‌వీ రమణరావు, రిజిస్ట్రార్ ఎన్.యాదయ్య, నోవాటెల్ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ బల్లవ్ ముంద్రా, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ శ్రీనివాస్, ఐఎస్‌టీ విభాగం అధిపతి జయశ్రీ, సీఎస్‌ఐటీ విభాగం డైరెక్టర్ రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.